India Corona cases: దేశంలో కరోనా కల్లోలం మళ్లీ పెరుగుతోంది. రోజువారీ కేసులు భారీగా పెరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా ఆందోళనకర పరిస్థితులు చోటుచేసుకుంటున్నాయి. మూడో దశ ముప్పు వచ్చినట్లే నని విశ్లేషకులు చెబుతున్నారు. రోజురోజుకు కేసులు పెరగడంతో ప్రజల్లో ఆందోళన నెలకొంది. కొవిడ్ టెస్ పాజిటివిటీ రేరటు కూడా 14.78 శాతంగా నమోదవుతోంది. దీంతో కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతున్నాయని తెలుస్తోంది.
యాక్టివ్ కేసుల సంఖ్య 220 రోజుల గరిష్టానికి చేరుకోవడం గమనార్హం. తాజా కేసులతో మొత్తం కేసుల సంఖ్య మూడు లక్షల పైకి చేరుకోవడం తెలిసిందే. ఇప్పటివరకు 4,85,350 మంది మరణించారు. దీంతో ప్రభుత్వం కూడా దిద్దుబాటు చర్యలకు ఉపక్రమిస్తోంది. కేసుల సంఖ్య ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో లాక్ డౌన్ విధిస్తున్నారు. దీంతో దేశంలోని కొన్ని స్టేట్లలో కరోనా వ్యాప్తి విపరీతంగా వ్యాపిస్తోంది.
Also Read: కరోనా చికిత్సకు 8 కోట్ల ఖర్చు,, 50 ఎకరాలు అమ్మేశాడు.. అయినా..
దేశంలోని ఐదు స్టేట్లలో రోజువారీ కేసులు ఇరవైవేల కంటే ఎక్కువగా ఉంటున్నాయి. ఎనిమిది స్టేట్లలో పది వేల కంటే ఎక్కువ కేసులు వస్తున్నాయి. మహారాష్ర్ట, కర్ణాటక, పశ్చిమ బెంగాల్, తమిళనాడులలో యాక్టివ్ కేసులు లక్ష కంటే ఎక్కువగా ఉంటున్నాయి. కరోనా వ్యాప్తిలో మహారాష్ర్ట మొదటి స్థానంలో ఉండటం తెలుస్తోంది.
ఢిల్లీ రెండో స్థానంలో నిలుస్తోంది. దేశవ్యాప్తంగా కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. టీకాలు వేస్తున్నా పాజిటివిటీ రేటు గణనీయంగా పెరగడానికి ప్రధాన కారణాలు ఆంక్షలు పాటించకపోవడమేనని తెలుస్తోంది. ఎవరు కూడా మాస్కులు ధరించడం లేదు. భౌతిక దూరం పాటించడం లేదు. దీంతోనే కేసుల సంఖ్య రెట్టింపవుతోంది. భవిష్యత్ లో మరిన్ని కేసులు పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి.
Also Read: కరోనా నుంచి మిమ్మల్ని రక్షించే ‘నవరత్నాలు’ ఇవే !