Corona Cases in India: రోజుకు 17వేల కేసులు.. దేశంలో మరో కరోనా ఉప్పెన తప్పదా?

  • Written By:
  • Publish Date - June 24, 2022 / 02:02 PM IST

Corona Cases in India: కరోనా మహమ్మారి పడగ విప్పుతోంది. రోజువారి కేసులు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. దీంతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. కొద్ది రోజులుగా కేసులు పెరుగుతుండటంతో ప్రజలు భయపడుతున్నారు. నాలుగో దశ ప్రారంభమైందా అనే సందేహాలు అందరిలో వస్తున్నాయి. దీంతో వైద్య శాఖ సైతం అప్రమత్తంగా ఉండాలని సూచిస్తోంది. ప్రస్తుతం రోజువారీ కేసులు 17 వేలు దాటడంతో మహమ్మారి మరోమారు విజృంభిస్తుందని తెలుస్తోంది. ప్రజలు జాగ్రత్తలు పాటించాలని చెబుతోంది. కరోనా కలకలం సృష్టించే అవకాశముందని నిపుణులు చెబుతున్నారు.

Corona Cases in India

మహారాష్ట్రలోనే కేసులు ఎక్కువగా వస్తున్నాయి. ఇప్పటివరకు దాదాపు ఐదు లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. నాలుగు కోట్లకు పైగా రోగులు వైరస్ నుంచి బయటపడ్డారు. కరోనా మహమ్మారి ప్రపంచ వ్యాప్తంగా తన ప్రభావాన్ని చూపి అందరిని భయాందోళనలకు గురి చేసిన సంగతి తెలిసిందే. టీకా రావడంతో కాస్త పరిస్థితి అదుపులోకి వచ్చినా మళ్లీ కేసులు పెరగడంతో ప్రజల్లో భయం కలుగుతోంది. వైరస్ మనల్ని వీడి పోయేలా కనిపించడం లేదు.

Also Read: Chandrababu Naidu: జనసేన తో పొత్తు పై చంద్రబాబు నాయుడు సంచలన నిర్ణయం

మహారాష్ట్రలో రోజువారీ కేసులు ఐదు వేలు దాటుతున్నాయి. ముంబైలోనే రెండువేల పైన నమోదవుతున్నాయి. దీంతో ఒక మహారాష్ట్రలోనే కేసులు పెరుగుతుండటంతో ప్రజల్లో ఆందోళన కలుగుతోంది.

మహారాష్ట్ర తరువాత స్థానంలో పశ్చిమ బెంగాల్, కర్ణాటక రాష్ట్రాలు ఉన్నాయి కరోనా కేసులు రెండింతలు అవుతుండటంతో ప్రజలు బెంగ పెట్టుకున్నారు. పాజిటివిటీ రేటు పెరుగుతుండటంతో ఆందోళన మొదలైంది. నాలుగో ధశ ప్రారంభమైందనే సంకేతాలు సైతం వస్తున్నాయి దీంతో ఏం చేయాలనే దానిపై వైద్యశాఖ అధికారులు ప్రజలకు జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు. మహమ్మారి వైరస్ వల్ల మళ్లీ పూర్వ రోజులు వస్తాయోమోననే ఆందోళన అందరిలో వస్తోంది.

Corona Cases

వైరస్ బారి నుంచి ప్రజలను రక్షించడానికి వైద్య ఆరోగ్య శాఖ ప్రయత్నాలు చేస్తోంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తోంది. టీకా డోసులు పెంచాలని భావిస్తోంది. ప్రజలు గతంలో మాదిరి జాగ్రత్తలు పాటించాలని చెబుతోంది. వైరస్ ధాటికి కలిగే నష్టం గురించి చెబుతోంది. మాస్కులు ధరించాలని, భౌతిక దూరం పాటించి వైరస్ బారి నుంచి రక్షించుకోవాలని సలహాలు ఇస్తోంది. దీనికి గాను ప్రజలు ముప్పు నుంచి కాపాడుకోవాలని సూచనలు చేస్తోంది.

Also Read:Maharashtra Political Crisis: మహారాష్ట్ర ఫిరాయింపుల సంక్షోభం.. పార్టీలకు ఒక గుణపాఠం