Bigg Boss 6 Telugu: ఈ సీజన్ లో బిగ్ బాస్ తీసుకునే నిర్ణయాలు కంటెస్టెంట్స్ కి మాత్రమే కాకుండా ఆడియన్స్ కి కూడా చిరాకు కలిగించేలా చేస్తుంది..మొదటి ఎపిసోడ్ నుండి బాగా ఆడే కంటెస్టెంట్స్ ని బయటకి పంపడం ఒక ఎత్తు అయితే..ప్రైజ్ మనీ 50 లక్షల నుండి 38 లక్షలకు కుదించడం ఈ షో పై జనాల్లో తీవ్రమైన నెగటివిటీ వచ్చేలా చేసింది..గత సీజన్స్ అన్నీ కూడా చాలా న్యాయబద్దం గా టాస్కులు కానీ ఎలిమినేషన్స్ కానీ జరిగేవి.

Bigg Boss 6 Telugu
కానీ ఇప్పుడు మాత్రం ప్రజాభిప్రాయం కి పూర్తి బిన్నంగా టీఆర్ఫీ రేటింగ్స్ ట్విస్ట్స్ మీద ట్విస్ట్స్ ఇస్తూ కంటెస్టెంట్స్ కి ఆడియన్స్ కి కోపం తెప్పిస్తున్నాడు..చివరి దశకి చేరుకున్న ఈ సీజన్ లో నిన్న ‘టికెట్ 2 ఫినాలే’ టాస్కుని నిర్వహించాడు బిగ్ బాస్..ఈ వారం మొత్తం ఈ టాస్కు జరగబోతుంది..ఈ టాస్కులో ఎవరైతే గెలుస్తారో వాళ్ళు నేరుగా బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే కి చేరుకుంటారు.
ఏ క్షణం లో ఏమి జరుగుతుందో చెప్పలేని స్థితిలో బిగ్ బాస్ ఎపిసోడ్స్ నడుస్తుండడం తో నామినేషన్స్ లో ఉన్న కంటెస్టెంట్స్ అందరికి ‘టికెట్ 2 ఫినాలే’ టాస్కు ఎంతో కీలకం..ఎందుకంటే ఈ టాస్కులో గెలిచినా కంటెస్టెంట్స్ కి పోలింగ్ లో ఒకవేళ తక్కువ ఓట్లు వచ్చి ఉంటె ఎలిమినేషన్స్ నుండి తప్పించుకొని నేరుగా గ్రాండ్ ఫినాలే వీక్ కి వెళ్లొచ్చు..ఇలాంటి అపూర్వమైన టాస్కుని ఎవరు మాత్రం వదులుకుంటారు..అలాంటి టాస్కు నుండి కంటెస్టెంట్స్ నుండి ఏకాభిప్రాయం తో ఇద్దరినీ తొలగించాలి అని బిగ్ బాస్ ప్రకటన చేస్తే కంటెస్టెంట్ మండిపోతాది కదా..సరిగ్గా ఈరోజు అదే జరిగింది.

Bigg Boss 6 Telugu
‘ఇది చాలా అన్యాయం బిగ్ బాస్..ఆది ఓడిపోతే ఏమి అనిపించదు కానీ ఆడకుండా ఏకాభిప్రాయం తో వెళ్లిపోవడం అనేది చాలా దారుణం’ అంటూ కంటెస్టెంట్స్ అందరూ బిగ్ బాస్ పై ఆరోపణలు చేస్తున్నారు..ఇక శ్రీహాన్ అయితే ‘నాకు ఈ టాస్కు చాలా ముఖ్యం..నన్ను ఏకాభిప్రాయం తో తొలగిస్తే ఎవ్వరిని ఆడనివ్వను..అందరూ ప్లేట్స్ నెట్టేస్తాను’ అంటూ శ్రీహాన్ చెప్తాడు..ఈ ప్రోమో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.