Pawan Kalyan: పవన్ పై కుల ముద్రకు కుట్ర
Pawan Kalyan: రాజకీయ పార్టీలు అన్నాక ఎంతో మంది వస్తూ ఉంటారు.. పోతూ ఉంటారు. అన్ని పార్టీల్లో ఇది సహజమైన చర్యే. లాభ నష్టాలను భేరీజు వేసుకొని.. అవసరాల కోసం చాలామంది పార్టీలు మారుతుంటారు. కొందరు వెళుతుంటారు. మరికొందరు వస్తుంటారు. ఏపీలో ఎన్నికలు సమీపిస్తుండడంతో ఇటువంటి జంపింగ్ జపాంగులు ఊపందుకున్నాయి. నేతలు ఇలా చేరే క్రమంలో సామాజిక సమీకరణలు ముడిపెట్టి రాజకీయ ప్రత్యర్థులు తెగ ప్రచారం చేస్తుంటారు. ఇప్పుడు జనసేన విషయంలో జరుగుతున్నది అదే. జనసేనకు ఆకర్షితులై […]


Pawan Kalyan
Pawan Kalyan: రాజకీయ పార్టీలు అన్నాక ఎంతో మంది వస్తూ ఉంటారు.. పోతూ ఉంటారు. అన్ని పార్టీల్లో ఇది సహజమైన చర్యే. లాభ నష్టాలను భేరీజు వేసుకొని.. అవసరాల కోసం చాలామంది పార్టీలు మారుతుంటారు. కొందరు వెళుతుంటారు. మరికొందరు వస్తుంటారు. ఏపీలో ఎన్నికలు సమీపిస్తుండడంతో ఇటువంటి జంపింగ్ జపాంగులు ఊపందుకున్నాయి. నేతలు ఇలా చేరే క్రమంలో సామాజిక సమీకరణలు ముడిపెట్టి రాజకీయ ప్రత్యర్థులు తెగ ప్రచారం చేస్తుంటారు. ఇప్పుడు జనసేన విషయంలో జరుగుతున్నది అదే. జనసేనకు ఆకర్షితులై చాలా మంది నాయకులు ఆ పార్టీలో చేరుతున్నారు. అందులో మాజీ ఎమ్మెల్యేలు, వివిధ పార్టీల్లో పనిచేసిన క్రియాశీలక నాయకులు ఉన్నారు. ఇలా చేరుతున్న క్రమంలో వారిపై ఎటువంటి విశ్లేషణలు జరగడం లేదు. కానీ విజయవాడకు చెందిన ఆకుల కిరణ్ కుమార్ అనే నాయకుడు జనసేనను వీడి బీజేపీలో చేరడాన్ని నీలి మీడియా పలువులు చిలువలు చేస్తోంది. సామాజిక అంశాన్ని ముడిగట్టి ప్రచారం చేస్తోంది.
చిన్న నాయకుడి పార్టీ మారితే...
జనసేనకు బలమున్న ప్రాంతంలో విజయవాడ ఒకటి. చాలా మంది నాయకులు జనసేనలో యాక్టివ్ రోల్ ప్లే చేస్తున్నారు. అందులో ఆకుల కిరణ్ కుమార్ అనే నాయకుడు ఒకరు. జనసేన పార్టీ తరఫున టీవీ డిబేట్లలో పాల్గొనే స్థాయి గల తక్కువ మందిలో ఆయన కూడా ఉంటారు. చాలా కూల్ గా పద్ధతిగా మాట్లాడతారని పేరుంది. జనసేన భావజాలాన్ని ప్రదర్శించడంలో ముందుండేవారు. సదరు ఆకుల కిరణ్ కుమార్.. జనసేన పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. స్థానిక రాజకీయ అంశాలను పరిగణలోకి తీసుకొని ఆయన పార్టీ మారారు. భారతీయ జనతా పార్టీలో చేరారు. జనసేనలో ఉంటే రాజకీయ అవకాశాలు రావనో.. లేకుంటే ఇతరత్రా కారణాలున్నాయో తెలియదు కానీ.. జనసేనకు దూరమయ్యారు.
వాస్తవాలను గుర్తుచేస్తే…
ఓ చిన్న నాయకుడు జనసేన వీడడాన్ని కాపు,కమ్మ ఫార్ములా అంటూ వైసీపీ అనుకూల మీడియా కొత్త వాదనకు తెరదించింది. జనసేన పదో ఆవిర్భావ సభలో చంద్రబాబు పల్లకి మోయడానికి సిద్ధంగా ఉన్నట్టు పవన్ సంకేతాలిచ్చారని… అందులో భాగంగానే ఆకుల కిరణ్ కుమార్ అనే కాపు నాయకుడు పార్టీని వీడారని ప్రచారం మొదలుపెట్టారు. అయితే అందులో వాస్తవం ఉందా? అంటే అటువంటి వ్యాఖ్యాలే పవన్ చేయలేదు. తన ప్రసంగంలో భాగంగా కులాల గురించి మాట్లాడేటప్పుడు మోహన్ రంగా కమ్మ కులం అమ్మాయిని పెళ్లి చేసుకున్నారని గుర్తుచేశారు. రంగా అప్పట్లో తమ ఇంటికి వచ్చిన విషయాన్ని కూడా ప్రస్తావించారు. తెలుగు సినిమా రంగంలో చిరంజీవి అప్పుడే ఉవ్వెత్తున ఎగసిపడుతున్నారు. కాపు గర్జనలతో రంగా ఉమ్మడి ఏపీనే షేక్ చేసే రోజులవి. అటువంటి సమయంలో కాపు సామాజికవర్గానికి చెందిన చిరంజీవి ఇంటికి రంగా వెళ్లేవారు. పవన్ అదే విషయాన్ని గుర్తుచేశారు. ఆ మాటలనే ఇప్పుడు వైసీపీ అనుకూల మీడియా ట్రోల్ చేస్తోంది. పవన్ వ్యాఖ్యలతో మనస్తాపానికి గురై ఆకుల కిరణ్ కుమార్ పార్టీని వీడినట్టు కట్టుకథ అల్లుతున్నారు.

Pawan Kalyan
ముప్పేట దాడికి కారణం అదా..
ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రతికూల ఫలితాలు వచ్చాయి. దానికి పవన్ కళ్యాణే కారణమన్నది వైసీపీ భావన. అయితే మిత్రపక్షంగా ఉండి కూడా తమకు అనుకూలంగా జన సైనికులు ఓటేయ్యాలని పవన్ పిలుపు ఇవ్వకపోవడం బీజేపీ అసంతృప్తికి కారణం. అందుకే బీజేపీ జనసేనపై దృష్టిసారించి ఉండొచ్చు. అందులో భాగంగానే ఆకుల కిరణ్ కుమార్ ను పార్టీలో చేర్చుకొని ఉండవచ్చు. అదే సమయంలో విజయవాడలో రాజకీయ అవకాశాలు బీజేపీ ద్వారానే సాధ్యమని కిరణ్ కుమార్ భావించి ఉండవచ్చు. ఈ పరిణామాల నేపథ్యంలో పవన్ కమ్మ, కాపు బంధం గురించి మాట్లాడారని.. అది నచ్చకే కిరణ్ పార్టీ మారారన్న ప్రచారంలో ఏమంత నిజం కనిపించడం లేదు. ఇది వాస్తవానికి అందనంత దూరంలో ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దూకుడు మీద ఉన్న జనసేనకు అడ్డుకట్ట వేసేందుకేనని భావిస్తున్నారు.