Karnataka Results : కర్ణాటక పీఠం కాంగ్రెస్ దే.. బీజేపీకి భంగపాటు
మధ్య కర్ణాటక, హైదరాబాద్ కర్ణాటక, మైసూరు, బాంబే కర్ణాటక ప్రాంతాల్లో కాంగ్రెస్ సత్తా చాటింది. బెంగళూరు, కోస్తా కర్ణాటకలో పట్టు బీజేపీ నిలుపుకుంది. ఫలితాల్లో జేడీఎస్‍కు ఊహించని పరాభవం ఎదురైంది. మైసూరు మినహా ఎక్కడా జేడీఎస్ ప్రభావం కనిపించలేదు.

Karnataka Results : కర్ణాటక రాష్ట్రాన్ని కాంగ్రెస్ హస్తగతం చేసుకుంది. మొత్తం 224 స్థానాల్లో 136 స్థానాలు కాంగ్రెస్ గెలుచుకున్నట్టు అధికారులు ప్రకటించారు. ఇప్పటివరకూ అధికారంలో ఉన్న బీజేపీ 65 స్థానాలతో సరిపెట్టుకుంది . కేవలం 19 స్థానాలకే పరిమితమైన జేడీఎస్ మూడో స్థానంలో నిలిచింది. ఈసారి హంగ్ రాలేదు. కాంగ్రెస్ క్లియర్ కట్ మెసేజ్ సాధించింది.
2018తో పోలిస్తే 5 శాతం అదనపు ఓట్లతో 56 స్థానాలు అదనంగా కాంగ్రెస్ సాధించింది. 2018 ఎన్నికలతో పోలిస్తే 39 స్థానాలు బీజేపీ కోల్పోయింది. 2018 ఎన్నికలతో పోలిస్తే 18 స్థానాలు కోల్పోయిన జేడీఎస్ పరిస్థితి ఘోరంగా తయారైంది.
మధ్య కర్ణాటక, హైదరాబాద్ కర్ణాటక, మైసూరు, బాంబే కర్ణాటక ప్రాంతాల్లో కాంగ్రెస్ సత్తా చాటింది. బెంగళూరు, కోస్తా కర్ణాటకలో పట్టు బీజేపీ నిలుపుకుంది. ఫలితాల్లో జేడీఎస్‍కు ఊహించని పరాభవం ఎదురైంది. మైసూరు మినహా ఎక్కడా జేడీఎస్ ప్రభావం కనిపించలేదు.
-ఏ ప్రాంతంలో ఎన్ని సీట్లు అన్నది తెలుసుకుందాం..
బెంగళూరు ప్రాంతం(28): బీజేపీ-15, కాంగ్రెస్-13, జేడీఎస్-0,
మధ్య కర్ణాటక (25): కాంగ్రెస్-19, బీజేపీ-5, జేడీఎస్-1,
కోస్తా కర్ణాటక (19): బీజేపీ-13, కాంగ్రెస్-6, జేడీఎస్-0,
హైదరాబాద్ కర్ణాటక (41): కాంగ్రెస్-26, బీజేపీ-10, జేడీఎస్-3,
బాంబే కర్ణాటక(50): కాంగ్రెస్-33, బీజేపీ-16, జేడీఎస్-1,
మైసూరు ప్రాంతం(61): కాంగ్రెస్-39, బీజేపీ-6, జేడీఎస్-14 .
ఇక జేడీఎస్ పార్టీ 5 శాతం ఓట్ల నష్టంతో 18 స్థానాలు జేడీఎస్ కోల్పోవడం గమనార్హం. ఓట్ల శాతంలో పెద్దగా తేడా లేకున్నా అధికారం బీజేపీ కోల్పోయింది. 0.65 శాతం ఓట్ల నష్టంతో 39 స్థానాలు బీజేపీ కోల్పోయింది.
