ఏమండోయ్ నితిన్ గారు ఇది నిజమేనా ?

ఏమండోయ్ నితిన్ గారు ఇది నిజమేనా ? అంటూ ఇటు సీరియస్ నెస్ ను, అటు వ్యంగ్యాన్ని కలిపి నితిన్ పై విరుచుకు పడ్డారు బయ్యర్లు. కారణం.. నితిన్ హీరోగా నటిస్తున్న ‘మాస్ట్రో’ సినిమా కూడా ఓటీటీలో రిలీజ్ కాబోతుంది. ఈ సినిమా రైట్స్ ను హాట్ స్టార్ కొనుక్కొంది. ఏమిటి ఇది పాత న్యూసే కదా. అవును, కానీ రిలీజ్ విషయంలో కొత్త న్యూస్ ఏమిటంటే.. ఈ సినిమా డైరెక్ట్ గా హాట్ స్టార్ లో […]

  • Written By: Raghava
  • Published On:
ఏమండోయ్ నితిన్ గారు ఇది నిజమేనా ?

Nithin Maestro Release Dateఏమండోయ్ నితిన్ గారు ఇది నిజమేనా ? అంటూ ఇటు సీరియస్ నెస్ ను, అటు వ్యంగ్యాన్ని కలిపి నితిన్ పై విరుచుకు పడ్డారు బయ్యర్లు. కారణం.. నితిన్ హీరోగా నటిస్తున్న ‘మాస్ట్రో’ సినిమా కూడా ఓటీటీలో రిలీజ్ కాబోతుంది. ఈ సినిమా రైట్స్ ను హాట్ స్టార్ కొనుక్కొంది. ఏమిటి ఇది పాత న్యూసే కదా. అవును, కానీ రిలీజ్ విషయంలో కొత్త న్యూస్ ఏమిటంటే.. ఈ సినిమా డైరెక్ట్ గా హాట్ స్టార్ లో స్ట్రీమ్ కాబోతుంది.

ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ కూడా పూర్తి చేసుకుంది కాబట్టి, మేకర్స్ మొత్తానికి ఫస్ట్ కాపీని రెడీ చేసి పెట్టారు. ఇప్పుడున్న లేటెస్ట్ అప్ డేట్ ప్రకారం ఆగస్టు 15న ‘మాస్ట్రో’ని తమ సైట్ లో స్ట్రీమ్ చెయ్యాలని హాట్ స్టార్ ఆల్ రెడీ నిర్ణయం తీసేసుకుందని తెలుస్తోంది. మరి నితిన్ సినిమా కూడా థియేటర్లో విడుదల కావడం లేదంటే.. మరి థియేటర్స్ యాజమాన్యం కచ్చితంగా నితిన్ కి వ్యతిరేకంగా పని చేస్తోంది.

నారప్ప విషయంలో సురేష్ బాబునే వదిలిపెట్టడం లేదు బయ్యర్లు. ఇక నితిన్ ని ఎలా వదులుతారు ? పైగా నితిన్ కెరీర్ లోనే డైరెక్ట్ గా ఓటీటీలో విడుదలవుతోన్న క్రేజ్ ఉన్న సినిమా ఇదే కావడంతో.. ఇప్పుడు ఇది హాట్ టాపిక్ అయిపోయింది. ఈ సినిమాని అయితే హాట్ స్టార్ దాదాపు 32 కోట్లకు కొనుక్కుంది. లాస్ లో ఉన్న నిర్మాతకు ఆ 32 కోట్లు గొప్ప రిలీఫ్.

పైగా నితిన్ మార్కెట్ ను దృష్టిలో పెట్టుకుని చూసుకున్నా అది మంచి గిట్టుబాటు ధరే అవుతుంది. అయితే, హిందీలో సూపర్ హిట్టైన ‘అంధధూన్’కి ఇది రీమేక్ కావడంతో ఈ సినిమా పై నెటిజన్లలో మంచి బజ్ ఉంది. అన్నిటికి మించి మేర్లపాక గాంధీ ఈ సినిమాకి దర్శకుడు. అదే విధంగా నితిన్ సరసన నభా నటేష్ హీరోయిన్, ఇక వెరీ బోల్డ్ పాత్రలో తమన్న నటిస్తోంది. సో.. ఏ రకంగా చూసుకున్నా ఇది క్రేజ్ ఉన్న సినిమానే.

Read Today's Latest Tollywood News, Telugu News LIVE Updates on Oktelugu
oktelugu whatsapp channel
follow us
  • facebook
  • instagram
  • twitter
  • youtube

సంబంధిత వార్తలు