Conductor Jhansi: సెలబ్రిలీ హోదా పరమాన్నం లాంటిది.. వేడి తగ్గాక ఏమీ ఉండదు.. ఝాన్సీ వృత్తికి అదే ఆటంకమా!?
వృత్తిరిత్యా కండక్టర్ అయిన ఝాన్సీకి ఈటీవీలో పాట ఎంత పేరు తెచ్చిందో.. ఆమె వృత్తికి కూడా అంతే ఆటకంగంగా మారింది. సెలబ్రిటీ హోదాతో తాను కండక్టర్ ఉద్యోగం చేసుకోలేకపోతున్నానని ఆవేదన వ్యక్తం చేసింది.

Conductor Jhansi: పల్సర్‌బైక్ ఝాన్సీ.. కండక్టర్ ఝాన్సీ.. గాజువాక ఝాన్సీ.. పేర్లు వేరైనా ఆమె ఒక్కరే.. మొన్నటి వరకు ఈమె ఎవరికీ తెలియదు.. ఈటీవీలో శ్రీదేవి డ్రామా కంపెనీలో చేసిన ఒక్క డ్యాన్స్‌తో తెలుగు ప్రేక్షకుల్లో తనకంటు ఒక స్థానం సాధించుకుంది. చాలా ఏళ్లుగా డ్యాన్స్ ప్రోగ్రామ్స్ చేస్తున్నా రాని గుర్తింపు ఒక్క పల్సర్ బైక్ పాటతో వచ్చింది ఓవర్‌నైట్ ఆమెను సెలబ్రిటీని చేసింది. తర్వాత ఆమె ప్రోగ్రామ్స్, డ్యాన్స్ కోసం నెట్టింట్లో వెతకడం ప్రారంభించారు తెలుగు ఆడియన్స్. ఇలా ఫేమస్ అయిన ఝాన్సీ తర్వాత ఈటీవీలోని జబర్దస్త్‌లో కూడా కొన్ని ఎపిసోడ్స్ చేసింది. తాజాగా విశాఖ స్టీల్‌ప్లాంట్ పరిరక్షణ ఉద్యమ నేపథ్యంలో తెరకెక్కుతున్న సినిమాలో ఓ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్‌కు ఎంపికైంది. ఈ సందర్భంగా ఆమె ఓ యూట్యూబ్ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓవర్‌నైట్ సెటబ్రిటీ ఇమేజ్ తన వృత్తికి ఆటంకంగా మారిందని తెలిపింది.
ఉద్యోగం చేసుకోలేక సెలవు..
వృత్తిరిత్యా కండక్టర్ అయిన ఝాన్సీకి ఈటీవీలో పాట ఎంత పేరు తెచ్చిందో.. ఆమె వృత్తికి కూడా అంతే ఆటకంగంగా మారింది. సెలబ్రిటీ హోదాతో తాను కండక్టర్ ఉద్యోగం చేసుకోలేకపోతున్నానని ఆవేదన వ్యక్తం చేసింది. చాలా ఏళ్లుగా తాను ప్రోగ్రామ్స్ చేస్తున్నానని, నెలకు 20 నుంచి 25 ప్రోగ్రామ్స్ చేసేదాన్నని తెలిపింది. అయితే ఈటీవీలో పల్సర్ బైక్ పాట తర్వాత తనకు మంచి గుర్తింపు వచ్చిందని చెప్పింది. అయితే తర్వాత కూడా తాను ఆర్టీసీ కండక్టర్ డ్యూటీకి వెళ్లానని తెలిపింది. తనను చాలా మంది గుర్తుపటారని పేర్కొంది.
విధులకు ఆటంకం కలుగకుండా మాస్క్‌తో..
కండక్టర్ విధులకు ఆటంకం కలుగకుండా తాను డ్యూటీకి మాస్క్ ధరించి వెళ్లేదానినని ఝాన్సీ చెప్పింది. అయితే తాను ప్రయాణికులను టికెట్ అడిగే విధానమే డిఫరెంట్‌గా ఉంటుందని, అది విని చాలా మంది తనను గుర్తుపట్టేవారని వెల్లడంచింది. చాలామంది తనను వెనక్కు తిప్పి నువ్వు ఝాన్సీవి కదా అని అడిగేవారని చెప్పింది. అయితే చాలాసార్లు తాను కాదని అబద్ధం చెప్పి తప్పించుకున్నానని వెల్లడించింది. అయినా విధులు నిర్వహించడం ఇబ్బందిగా మారిందని తెలిపింది.
వేడి తగ్గే వరకు సెలవు..
సెలబ్రెటీ ఇమేజ్ పరమాన్నం లాంటిదని, వేడిగా ఉన్నప్పుడు తినడానికి ఆసక్తి చూపుతామని, వేడి తగ్గాక ఇంట్రస్ట్ ఉండదని ఝాన్నీ సతెలిపింది. ఇప్పుడు తనకు ఉన్న సెలబ్రెటీ హోదా కూడా కొన్ని రోజులే ఉంటుందని వెల్లడిచింది. అది తగ్గాక తను నార్మట్‌గా డ్యూటీ చేసుకుంటానని చెప్పింది. ఏది ఏమైనా వృత్తిని మాత్రం వదలనని స్పష్టం చేసింది. సెలబ్రెటీ ఇమేజ్ వేడి తగ్గాలన్న ఉద్దేశంతో ఆర్టీసీ అధికారులను రిక్వెస్ట్ చేసి మూడు నెలలు సెలవు పెట్టానని తెలిపింది. మొత్తంగా ఓవర్‌నైట్ సూపర్ డ్యాన్సర్ ఇమెజ్ తెచ్చుకున్న ఝాన్సీకి ఇప్పుడు అదే ఇబ్బందిగా మారిందని ఆమె తెలిపింది.