కరోనా వ్యాక్సిన్ కనుగొన్న ఆ దేశాలు!
ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనాను నియంత్రించే వ్యాక్సిన్ మరో మూడు నెలలో కనుకొంటామని ఇటీవల ఇజ్రాయెల్ శాస్త్రవేత్తలు చెప్పారు. ఇప్పటికే ఆ వ్యాక్సిన్ ని కనుగొని పక్షులపై ప్రయోగించడంతో వారు విజయం సాధించారు. అయితే మనుషులపై ప్రయోగాలకు ఆ దేశ సైంటిస్టులు సిద్ధమయ్యారు. ఒకవేళ మనుషులపై కూడా వారి ప్రయోగాలు ఫలిస్తే మరో 90 రోజులలో కరోనాను నియంత్రించే వాక్సిన్ అందుబాటులోకి వస్తుంది. గతంలో కరోనా తొలి వ్యాక్సిన్ ను రూపొందించామని అమెరికాకు చెందిన బయోటిక్ సంస్థ మోడెర్నా […]

ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనాను నియంత్రించే వ్యాక్సిన్ మరో మూడు నెలలో కనుకొంటామని ఇటీవల ఇజ్రాయెల్ శాస్త్రవేత్తలు చెప్పారు. ఇప్పటికే ఆ వ్యాక్సిన్ ని కనుగొని పక్షులపై ప్రయోగించడంతో వారు విజయం సాధించారు. అయితే మనుషులపై ప్రయోగాలకు ఆ దేశ సైంటిస్టులు సిద్ధమయ్యారు. ఒకవేళ మనుషులపై కూడా వారి ప్రయోగాలు ఫలిస్తే మరో 90 రోజులలో కరోనాను నియంత్రించే వాక్సిన్ అందుబాటులోకి వస్తుంది.
గతంలో కరోనా తొలి వ్యాక్సిన్ ను రూపొందించామని అమెరికాకు చెందిన బయోటిక్ సంస్థ మోడెర్నా కూడా ప్రకటించింది. ఈ వ్యాక్సిన్ ను మనుషులపై ప్రయోగాలకు సిద్ధం చేశామని తెలిపింది .ఈ ట్రయల్స్ ఏప్రిల్‌లో ప్రారంభమయ్యే అవకాశం ఉందని, తొలి దశ ప్రయోగం విజయవంతమైతే.. అది అందుబాటులోకి రావడానికి ఏడాది సమయం పడుతుందని అమెరికా సైంటిస్టులు అంటున్నారు.
2002లో సార్స్ విజృంభించినప్పుడు దాని వ్యాక్సిన్ హ్యుమన్ ట్రయల్స్ కు సిద్ధమయ్యే సరికి 20 నెలలు పట్టగా తాజాగా కరోనా వైరస్ జన్యు సమాచారం తెలుసుకున్న ఆరు వారాల్లోనే వ్యాక్సిన్ ను రూపొందించి, మనషులపై ప్రయోగాలకు రెడీ చేయడం విశేషం.