Bigg Boss 6 Telugu Adi: బిగ్ బాస్ హౌస్ లోకి 17వ కంటెస్టెంట్ గా కామన్ మ్యాన్ ఆది.. ఇతడు ఎవరు? బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలుసా?

Bigg Boss 6 Telugu Adi: తెలుగు బుల్లితెరపై బిగ్గెస్ట్ రియాలిటీ షో ‘బిగ్ బాస్’ లాంచ్ అయ్యింది. కింగ్ నాగార్జున చేతుల మీదుగా 6వ సీజన్ ఘనంగా ప్రారంభమైంది. ఓ పేకమీడల మధ్యలో నాగార్జునను నిలబెట్టి.. బిగ్ బాస్ థీమ్ ను ప్రజెంట్ చేస్తూ షోను మొదలుపెట్టారు. బ్యాక్ గ్రౌండ్ లో కమలాసన్ ‘విక్రమ్’ మూవీ మ్యూజిక్ వస్తుండగా.. విదేశీ సుందరాంగుల మధ్యలో నుంచి నాగార్జున బయటకొచ్చి ‘బంగార్రాజు’ పాటకు స్టెప్పులేసి బిగ్ బాస్ 6ను […]

  • Written By: NARESH ENNAM
  • Published On:
Bigg Boss 6 Telugu Adi:  బిగ్ బాస్ హౌస్ లోకి 17వ కంటెస్టెంట్ గా  కామన్ మ్యాన్ ఆది.. ఇతడు ఎవరు? బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలుసా?

Bigg Boss 6 Telugu Adi: తెలుగు బుల్లితెరపై బిగ్గెస్ట్ రియాలిటీ షో ‘బిగ్ బాస్’ లాంచ్ అయ్యింది. కింగ్ నాగార్జున చేతుల మీదుగా 6వ సీజన్ ఘనంగా ప్రారంభమైంది. ఓ పేకమీడల మధ్యలో నాగార్జునను నిలబెట్టి.. బిగ్ బాస్ థీమ్ ను ప్రజెంట్ చేస్తూ షోను మొదలుపెట్టారు. బ్యాక్ గ్రౌండ్ లో కమలాసన్ ‘విక్రమ్’ మూవీ మ్యూజిక్ వస్తుండగా.. విదేశీ సుందరాంగుల మధ్యలో నుంచి నాగార్జున బయటకొచ్చి ‘బంగార్రాజు’ పాటకు స్టెప్పులేసి బిగ్ బాస్ 6ను లాంచ్ చేశారు.

Bigg Boss 6 Telugu Adi

Bigg Boss 6 Telugu Adi

పోయిన సారి సెట్ కంటే ఈసారి కాస్తా కలర్ ఫుల్ గా బిగ్ బాస్ హౌస్, సెట్ వేశారు. ఎంటర్ టైన్ మెంట్ కు అడ్డా 6, ఎంటర్ టైన్ మెంట్ కు అడ్డా ఫిక్స్ అంటూ నాగార్జున మొదట బిగ్ బాస్ ఇంటిని వెరైటీగా చూపించారు. ఈసారి బిగ్ బాస్ హౌస్ ను ఒక పాట రూపంలో వినూత్నంగా ఆవిష్కరించారు. హౌస్ మాత్రం ఎంతో అందంగా ముస్తాబు చేశారు. డైనింగ్ హాల్, స్విమ్మింగ్ ఫూల్, గార్డెన్ ఏరియా సహా అన్నింటిని కలవ్ ఫుల్ గా డిజైన్ చేశారు. చూస్తుంటేనే ఆహ్లాదకరంగా ఇది ఉంది. ఈసారి ఎంటర్ టైన్ మెంట్ అదిరిపోయేలా కనిపిస్తోంది.

బిగ్ బాస్ హౌస్ లోకి తొలి కంటెస్టెంట్ గా సీరియల్ యాక్టర్ ‘కీర్తి’ అడుగుపెట్టింది. ఇక సెకండ్ కంటెస్టెంట్ గా నువ్వు నాకు నచ్చావ్ లో హీరోయిన్ ఆర్తి అగర్వాల్ చెల్లెలుగా నటించిన ‘పింకి’ ఎంట్రీ ఇచ్చింది. ఈమె అసలు పేరు సుదీప. ఇక మూడో కంటెస్టెంట్ గా యూట్యూబర్ ‘శ్రీహాన్’ , నాలుగో కంటెస్టెంట్ గా నేహా , ఇక ఐదో కంటెస్టెంట్ గా జబర్ధస్త్ కమెడియన్ చలాకీ చంటీ, 6వ కంటెస్టెంట్ గా సింగర్, మోడల్ శ్రీ సత్య , 7వ కంటెస్టెంట్ గా అర్జున్ కళ్యాణ్ , 8వ కంటెస్టెంట్ చిత్తూరు జిల్లాకు చెందిన యూట్యూబర్ గీతూ ఎంట్రీ ఇచ్చింది. ఈమెను లేడీ ‘పుష్ప’గా పిలుస్తుంటారు. 9వ కంటెస్టెంట్ గా ఐటెం బాంబ్, నటి అభినయశ్రీ ప్రవేశించింది. 10వ కంటెస్టెంట్లుగా సీరియల్స్ లో పాపులర్ అయిన జోడీ రోహిత్-మెరినీ ప్రవేశించారు. 11వ కంటెస్టెంట్ గా నటుడు ‘బాలాదిత్య’, 12వ కంటెస్టెంట్ గా వాసంతి కృష్ణన్ ,13వ కంటెస్టెంట్ గా క్యారెక్టర్ ఆర్టిస్ట్ షానీ సాల్మన్ ఎంటర్ అయ్యారు.. 14వ కంటెస్టెంట్ గా గ్లామర్ బ్యూటీ ఇనయా సుల్తానా, 15వ కంటెస్టెంట్ గా ఆర్జే సూర్య, 16వ కంటెస్టెంట్ గా జబర్ధస్త్ లేడీ కమెడియన్ ‘ఫైమా’ ప్రవేశించింది.

బిగ్ బాస్ 17వ కంటెస్టెంట్ గా నెల్లూరు జిల్లాకు చెందిన కామన్ మ్యాన్ ఆది ప్రవేశించాడు. ఇతడు సోషల్ మీడియాతో పాపులర్ అయ్యాడు. ఇతడిని గుడాల్ మామ అని కూడా పిలుస్తుంటారు. నెల్లూరులో పేద కుటుంబం.. కష్టాల మధ్య పెరిగిన ఆది బిగ్ బాస్ తోనే ఫేమస్ అవ్వడం విశేషం. యూట్యూబ్ లో బిగ్ బాస్ రివ్యూలు చేసి పాపులర్ అయ్యాడు. దాంతోనే అతడి కష్టాలు తీరాయి. యూట్యూబ్ లో నెలకు రూ.2 లక్షలు సంపాదించే వరకూ ఎదిగాడు. ఈ మధ్య జనసేన కౌలు రైతులకు లక్ష రూపాయల విరాళం ఇచ్చి తమ ఊదారత చాటుకున్నారు. యూట్యూబ్ తో తన పేదరికాన్ని జయించిన ఆది 17వ కంటెస్టెంట్ గా హౌస్ లోకి ప్రవేశించాడు.

Tags

    Read Today's Latest Upcoming movies News, Telugu News LIVE Updates on Oktelugu
    oktelugu whatsapp channel
    follow us
    • facebook
    • instagram
    • twitter
    • youtube