Conjunctivitis : ఈ కాలంలో తీవ్రంగా వ్యాపిస్తున్న కండ్ల కలక లక్షణాలు ఏంటి? చికిత్స ఏమిటి?

కళ్ల కలక వస్తే కంటి రెప్పలు ఉబ్బుతాయి. రాత్రి నిద్రపోయి తెల్లవారేసరికి కంటి రెప్పలు అతుక్కుపోతాయి. కళ్లు ఎర్రబడి నీరు కారుతుంది. కళ్ల కలక తగ్గించుకునే ప్రయత్నాలు చేస్తుంటే మంచిది.

  • Written By: Srinivas
  • Published On:
Conjunctivitis : ఈ కాలంలో తీవ్రంగా వ్యాపిస్తున్న కండ్ల కలక లక్షణాలు ఏంటి? చికిత్స ఏమిటి?

Conjunctivitis : వర్షాకాలంలో వ్యాధులు చుట్టుముడతాయి. పాత నీరు పోయి కొత్త నీరు వస్తుంది. దీంతో బ్యాక్టీరియా చేరి అపరిశుభ్రంగా మారి రోగాలు వస్తాయి. దీంతో జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది. కొన్ని రకాల వ్యాధులు వర్షాకాలంలో విజృంభిస్తాయి. కలరా, టైఫాయిడ్, డెంగ్యూ, ఫైలేరియా వంటి రోగాలు రావడానికి ఆస్కారం ఉంటుంది. ఇంకా కళ్ల కలక కూడా వస్తుంది. ఇది వస్తే బయట తిరగడం మంచిది కాదు.

కళ్ల కలక ఎలా ఉంటుంది

కళ్ల కలక వస్తే కళ్లు ఎర్రబడతాయి. ఇది అంటు వ్యాధి. అందుకే ఈ సమస్య వచ్చినప్పుడు బయటకు రాకూడదు. ఇతరులకు త్వరగా అంటుకుంటుంది. కళ్లు ఎర్రబారి వాటి నుంచి నీరు కారుతుంది. చూడటానికి కూడా కష్టంగా ఉంటుంది. అందుకే కళ్లకలక వచ్చిన వారు ఇంటికే పరిమితమైపోవాలి. లేదంటే ఇబ్బందులు వస్తాయి.

కళ్లకలక వస్తే ఏం చేయాలి

కళ్లకలక వస్తే బయటకు రాకుండా ఇంట్లోనే ఉండాలి. వాళ్లు వాడిన వస్తువులు ఇతరులు ముట్టుకోకూడదు. యాంటీ బయోటెక్ కంటి చుక్కల మందు వేసుకోవాలి. దీంతో కొంత ఉపశమనం లభిస్తుంది. కళ్లను తరచుగా కడుక్కుంటూ ఉండాలి. దీని వల్ల వ్యాధి తీవ్రత పెరగదు. కళ్ల కలక వస్తే జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది.

కంటి రెప్పలు

కళ్ల కలక వస్తే కంటి రెప్పలు ఉబ్బుతాయి. రాత్రి నిద్రపోయి తెల్లవారేసరికి కంటి రెప్పలు అతుక్కుపోతాయి. కళ్లు ఎర్రబడి నీరు కారుతుంది. కళ్ల కలక తగ్గించుకునే ప్రయత్నాలు చేస్తుంటే మంచిది. కళ్లకలకను పింక్ ఐ అంటారు. కళ్ల కలకను దూరం చేసుకునే చిట్కాలు పాటించి వాటిని దూరం చేసుకునేందుకు చొరవ తీసుకుంటే మంచి ఫలితాలు వస్తాయి.

Read Today's Latest Health news News, Telugu News LIVE Updates on Oktelugu
oktelugu whatsapp channel
follow us
  • facebook
  • instagram
  • twitter
  • youtube

సంబంధిత వార్తలు