Venumadhav Mother: టాలీవుడ్ ని ఏలిన కమెడియన్స్ లో వేణుమాధవ్ ఒకరు. ఫార్మ్ లో ఉన్న సమయంలో వేణు మాధవ్ ఏడాదికి 20 నుండి 30 సినిమాలు చేసేవారు. ప్రతి సినిమాలో ఆయన ఉండేవారు. కోట్లు రూపాయలు సంపాదించారు. నిర్మాతగా మారి సినిమాలు చేశారు. హీరో కూడా అయ్యారు. అనారోగ్యం ఆయన్ని దెబ్బతీసింది. చిన్న వయసులోనే వేణుమాధవ్ లివర్, కిడ్నీ సంబంధిత వ్యాధుల బారిన పడ్డారు. ఆరోగ్యం సహకరించక సినిమాలకు దూరమయ్యాడు. సుదీర్ఘ కాలం అనారోగ్య సమస్యలతో పోరాడిన వేణుమాధవ్ 2019 సెప్టెంబర్ 25న కన్నుమూశారు. అప్పటికి ఆయన వయసు 49 సంవత్సరాలు మాత్రమే.

Venumadhav Mother
వేణుమాధవ్ నిర్మాతగా కొంత డబ్బులు పోగొట్టుకున్నాడు. అయితే ఫ్యామిలీని దృష్టిలో పెట్టుకొని కొన్ని స్థిరాస్థులు పోగేసిపోయారు. వాటి విలువ రూ. 20 కోట్లు వరకూ ఉంటుంది. ప్రతి నెలా ఆదాయం ఇచ్చే షాపులు, ఇళ్ళు ఉన్నాయి. వేణుమాధవ్ కి ఇద్దరు కుమారులు. నాన్న తోడుగా లేరన్న బాధ మినహాయిస్తే… మాకు ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు లేవని పలు ఇంటర్వ్యూలో వెల్లడించారు. అయితే వేణుమాధవ్ తల్లిగారు మాత్రం దీనస్థితిలో ఉన్నట్లు తాజాగా వెలుగులోకి వచ్చింది.
ఓ మీడియా ఇంటర్వ్యూలో వేణుమాధవ్ మదర్ షాకింగ్ విషయాలు బయటపెట్టారు. నాకు ముగ్గురు కొడుకులు. వేణుమాధవ్ చిన్నప్పటి నుండి చురుగ్గా ఉండేవాడు. మిమిక్రీ చేసేవాడు. వాడి స్టేజ్ పెర్ఫార్మన్స్ చూసి ఎస్వీ కృష్ణారెడ్డి-అచ్చిరెడ్డి సినిమా ఆఫర్ ఇచ్చారు. నటుడిగా ఎదిగి సక్సెస్ అయ్యాడు. వేణుమాధవ్ దగ్గరే మిగతా ఇద్దరు కొడుకులను అసిస్టెంట్స్ గా పెట్టాను. అది నేను చేసిన పెద్ద తప్పు. దాని వలన వారు ఎదగలేదు. ఒక కొడుకు కూతురు పెళ్లి టెన్షన్ లో చనిపోయాడు.

Venumadhav Mother:
అతను చనిపోయిన రోజుల వ్యవధిలో వేణుమాధవ్ కన్నుమూశాడు. ఇద్దరు కొడుకుల మరణం చూసిన నాకు బ్రతకడం ఎందుకు అనిపిస్తుంది. ఇప్పుడు మా పరిస్థితి బాగోలేదు. ఉన్న ఒక కొడుకు దగ్గర ఉంటున్నాను. అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నాము. వేణుమాధవ్ బ్రతికి ఉంటే మాకు ఈ పరిస్థితి వచ్చేది కాదని ఆమె వేదన చెందారు. ఆమె మాటలను బట్టి వేణుమాధవ్ భార్య ఆయన తల్లిని పట్టించుకోవడం లేదని తెలుస్తుంది. ఆయన మరణానంతరం స్థిరాస్తులపై వస్తున్న ఆదాయం పిల్లలతో పాటు ఆమెనే అనుభవిస్తున్నారని అర్థం అవుతుంది.