Brahmanandam Son Engagement: కమెడియన్ బ్రహ్మానందం ఇంట్లో పెళ్లి సందడి

సిద్దార్థ్-ఐశ్వర్యల ఎంగేజ్మెంట్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. బ్రహ్మానందంకి ఇద్దరు కుమారులు. పెద్ద కొడుకు రాజా గౌతమ్ హీరోగా ప్రయత్నం చేశారు. పల్లకిలో పెళ్లి కూతురు చిత్రంతో వెండితెరకు పరిచయమయ్యారు.

  • Written By: SRK
  • Published On:
Brahmanandam Son Engagement: కమెడియన్ బ్రహ్మానందం ఇంట్లో పెళ్లి సందడి

Brahmanandam Son Engagement: హాస్యబ్రహ్మ బ్రహ్మానందం ఇంట్లో పెళ్లి సందడి నెలకొంది. ఆయన చిన్న కుమారుడు సిద్ధార్థ్ నిశ్చితార్థ వేడుక ఘనంగా జరిగింది. సిద్ధార్థ్ విదేశాల్లో చదువుకుని అక్కడే ఉద్యోగం చేస్తున్నాడని సమాచారం. వృత్తి రీత్యా డాక్టర్ అయిన ఐశ్వర్య అనే అమ్మాయిని నిశ్చయించారు. ఇది పెద్దలు కుదిర్చిన వివాహమని తెలుస్తుంది. ఆదివారం రాత్రి బ్రహ్మానందం నివాసంలో ఈ వేడుక జరిగింది. కమెడియన్ అలీ, నిర్మాత టి సుబ్బిరామిరెడ్డితో పాటు పలువురు టాలీవుడ్ ప్రముఖులు సిద్ధార్థ్ నిశ్చితార్థం వేడుకకు హాజరయ్యారు.

సిద్దార్థ్-ఐశ్వర్యల ఎంగేజ్మెంట్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. బ్రహ్మానందంకి ఇద్దరు కుమారులు. పెద్ద కొడుకు రాజా గౌతమ్ హీరోగా ప్రయత్నం చేశారు. పల్లకిలో పెళ్లి కూతురు చిత్రంతో వెండితెరకు పరిచయమయ్యారు. రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన ఈ రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ పర్లేదు అనిపించుకుంది. ఆయన హీరోగా గౌతమ్ కి బ్రేక్ రాలేదు.

బ్రహ్మానందం చిన్న కుమారుడు గురించి తెలిసింది తక్కువే. ఆయన మీడియాలో పెద్దగా ఫోకస్ కాలేదు. పరిశ్రమకు రాలేదు. ఇక కమెడియన్ గా దశాబ్దాల పాటు చిత్ర పరిశ్రమను బ్రహ్మానందం ఏలారు. ఈ మధ్య ఆయన సినిమాలు తగ్గించారు. వయసు పైబడటంతో పాటు అనారోగ్య సమస్యలు తలెత్తుతున్న నేపథ్యంలో బ్రహ్మానందం ఆచితూచి సినిమాలు చేస్తున్నారు.

ఇటీవల బ్రహ్మానందం రంగమార్తాండ మూవీలో కీలక రోల్ చేశారు. ఎప్పుడూ నవ్వించే పాత్రలు చేసిన బ్రహ్మానందం రంగమార్తాండ మూవీలో సీరియస్ రోల్ చేశారు. ఆయన ప్రేక్షకులను ఏడిపించేశారు. బ్రహ్మానందంలోని నయా యాంగిల్ మెప్పించింది. దర్శకుడు కృష్ణవంశీ తెరకెక్కించిన రంగమార్తాండ మూవీలో ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ ప్రధాన పాత్రలు చేశారు.

సంబంధిత వార్తలు