CM Jagan : ఉత్కంఠ : గవర్నర్ ను కలిసిన జగన్.. ముందస్తా? మంత్రివర్గ విస్తరణ..

CM Jagan : సీఎం జగన్మోహన్ రెడ్డి ముందస్తు ఎన్నికలకు సిద్ధమవుతున్నారా..? ఎన్నికల టీమ్ ను రెడీ చేసుకుంటున్నారా..? అందుకోసమే మంత్రివర్గ విస్తరణకు సిద్ధమవుతున్నారా..? సీఎం జగన్ మోహన్ రెడ్డి తాజాగా గవర్నర్ ను కలవడం గనుక ఉన్న కారణాలు ఏంటి..? ఇదే అంశం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంసంగా మారింది. అసలు ఏం జరుగుతుందన్నది ఉత్కంఠ రేపుతోంది. రాష్ట్రంలో మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం కుదురునట్లే కనిపిస్తోంది. శాసనమండలి ఎన్నికల ప్రక్రియ ముగిసిన నేపథ్యంలో తన మంత్రివర్గాన్ని ప్రక్షాళన […]

  • Written By: Naresh
  • Published On:
CM Jagan : ఉత్కంఠ : గవర్నర్ ను కలిసిన జగన్.. ముందస్తా? మంత్రివర్గ విస్తరణ..

CM Jagan : సీఎం జగన్మోహన్ రెడ్డి ముందస్తు ఎన్నికలకు సిద్ధమవుతున్నారా..? ఎన్నికల టీమ్ ను రెడీ చేసుకుంటున్నారా..? అందుకోసమే మంత్రివర్గ విస్తరణకు సిద్ధమవుతున్నారా..? సీఎం జగన్ మోహన్ రెడ్డి తాజాగా గవర్నర్ ను కలవడం గనుక ఉన్న కారణాలు ఏంటి..? ఇదే అంశం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంసంగా మారింది. అసలు ఏం జరుగుతుందన్నది ఉత్కంఠ రేపుతోంది.

రాష్ట్రంలో మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం కుదురునట్లే కనిపిస్తోంది. శాసనమండలి ఎన్నికల ప్రక్రియ ముగిసిన నేపథ్యంలో తన మంత్రివర్గాన్ని ప్రక్షాళన చేసే దిశగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అడుగులు వేస్తున్నారు. ఈ ఎన్నికల్లో గెలిచిన కొందరికి క్యాబినెట్ బెర్త్ కల్పించాలని ఉద్దేశంలో ఆయన ఉన్నట్లు ఇదివరకే జోరుగా చర్చలు సాగాయి. అంచనాలన్నీ ఒక వాస్తవ రూపాన్ని దాల్చడం దాదాపుగా ఖాయమైనట్లే కనిపిస్తోంది.

గవర్నర్ తో సీఎం కీలక భేటీ..

కేబినెట్లో మార్పులు చేయాలన్న జగన్మోహన్ రెడ్డి ఆలోచన నేపథ్యంలో.. తాజాగా సోమవారం సాయంత్రం రాజ్ భవన్ లో గవర్నర్ సయ్యద్ అబ్దుల్ నజీర్ తో సీఎం జగన్ మోహన్ రెడ్డి భేటీ కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. మంత్రివర్గ విస్తరణ కోసమే ఆయన గవర్నర్ ను కలిసారని తెలుస్తోంది. మండల ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత మంత్రివర్గ ప్రక్షాళన ఉండొచ్చు అంటూ గతంలోనే వార్తలు వచ్చాయి. ఆశించిన స్థాయిలో పనితీరు కనబరిచిన మంత్రులను జగన్ సాగనంపుతారని, వారి స్థానంలో మండలికి ఎన్నికైన కొత్త వారికి అవకాశం కల్పిస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది. తాజాగా సీఎం జగన్ మోహన్ రెడ్డి ఆ ఆలోచనతోనే గవర్నర్ ను కలిశారని చర్చ జరుగుతోంది.

వచ్చే సార్వత్రిక ఎన్నికల టీమ్..

వచ్చే సార్వత్రిక ఎన్నికలను ఎదుర్కొనేందుకు బలమైన టీం తో సిద్ధం కావాలని సీఎం జగన్ మోహన్ రెడ్డి భావిస్తున్నారు. ఇందులో భాగంగానే మంత్రివర్గ ప్రక్షాళనకు ఆయన సిద్ధమవుతున్నారు. గవర్నర్ అబ్దుల్ నజీర్ తో జగన్ భేటీ అయిన నేపథ్యంలో ఈనెల 30 లేదా 31 తేదీల్లో మంత్రివర్గ విస్తరణ ఉండే అవకాశం ఉందని జోరుగా ప్రచారం సాగుతోంది.

వీరికి అవకాశం దక్కే ఛాన్స్..

కొత్త క్యాబినెట్లో పలు కొత్త ముఖాలు కనిపించే అవకాశం ఉందని ప్రచారం సాగుతోంది. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించిన మర్రి రాజశేఖర్, బొమ్మ ఇజ్రాయిల్, పోతుల సునీత, చంద్రగిరి ఏసురత్నం, పెనుమత్స సూర్యనారాయణ రాజు, జయ మంగళ వెంకటరమణ ఉన్నారు. మిగిలిన కోటాలో నర్తు రామారావు, వంకా రవీంద్ర, కావూరు శ్రీనివాస్, మధుసూదన్, పొన్నపురెడ్డి రామసుబ్బారెడ్డి, మంగమ్మ, సిపాయి సుబ్రమణ్యం, మేరుగా మురళీధర్, కుదుపుడి సూర్యనారాయణ విజయం సాధించారు. వీరులో ఎవరికి మంత్రి పదవి దక్కుతుందనేది ఆసక్తికరంగా మారింది. అయితే మర్రి రాజశేఖర్ తో పాటు మరో ఒకరిద్దరికి అవకాశం దక్కుతుందన్న చర్చ జోరుగా సాగుతోంది.

నివేదికల ఆధారంగానే మార్పులు..

ప్రస్తుతం ఉన్న మంత్రులను తప్పించేందుకు బలమైన కారణాలు ఉన్నట్లు చెబుతున్నారు. పనితీరు సరిగా లేని మంత్రులకు సంబంధించిన నివేదికలు ఎప్పటికే సీఎం జగన్మోహన్ రెడ్డి వద్ద ఉన్నట్టు తెలిసింది. అయితే మంత్రివర్గం నుంచి ఉద్వాసన పలకబోయే అమాత్యులు ఎవరన్నా ఆసక్తి ఇప్పుడు నెలకొంది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల ప్రారంభానికి ముందే నిర్వహించిన మంత్రివర్గ సమావేశంలో కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ దిశగా సంకేతాలను పంపించినట్లు సమాచారం. మంత్రివర్గం నుంచి వేటుపడబోయేది ఎవరు అన్నదానిపై ఇప్పుడు సర్వత్ర ఆసక్తి నెలకొంది.

సంబంధిత వార్తలు