CM Jagan Humanity : ఈ ఒక్క పనితో జగన్ హీరో అయిపోయాడు
వెంటనే వెళ్లి కలవగా దివ్య కుటుంబానికి ఇంటి స్థలం మంజూరు చేసినట్టు తెలిపారు. దివ్య చదువుతో పాటు ఉద్యోగ, ఉపాధి అవకాశాలకు ప్రభుత్వం చేయూతనందిస్తుందని హామీ ఇచ్చారు.

CM Jagan Humanity : ఆ విద్యార్థి కష్టాన్ని చూసి సీఎం జగన్ చలించిపోయారు. ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొని చదువుకు ఇచ్చిన ప్రాధాన్యం తెలుసుకొని ఫిదా అయ్యారు. ఆమె కన్నీళ్లను తుడిచారు. కుటుంబం పడుతున్న బాధల నుంచి విముక్తి కల్పించే ప్రయత్నం చేశారు. ఇటీవల కొవ్వూరులో విద్యాదీవెన నిధులను సీఎం జగన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే, ఈ సందర్భంగా డిగ్రీ విద్యార్థిని తిరిగిపల్లి దివ్య ప్రసంగం సీఎం జగన్ ను ఎంతగానో ఆకట్టుకుంది. తన కుటుంబస్థితిగతులను చెబుతూ.. ప్రభుత్వ సాయంతో తాను చదువుకుంటున్న తీరును విద్యార్థిని వివరించింది.
కొవ్వూరు సభలో దివ్య ఇచ్చిన ప్రసంగం హైలెట్ అయ్యింది. ప్రభుత్వ విద్యావిధానాన్ని మెచ్చుతూ ఆమె సాగించిన ప్రసంగం సీఎం జగన్ ను విశేషంగా ఆకట్టుకుంది. అన్నా.. నా తల్లిదండ్రులు ఇద్దరూ వికలాంగులు. నా తండ్రి అవిటివాడు. తల్లి మూగ, చెవిటి. మేం ఇద్దరం ఆడపిల్లలం. కానీ.. మాకు ఏ బాధ లేదు. అమ్మానాన్నకు పెన్షన్ ఇస్తూ.. మీరు భరోసా ఇచ్చారు. నేను కార్పొరేట్ కాలేజీలో డిగ్రీ చదువుతున్నాను. నాకు ఫీజు కూడా మీరే చెల్లించారు. వసతి దీవెన కింద బస్సు ఛార్జీలు కూడా ఇచ్చి నన్ను నిలబెట్టారు. నేను ఇంటర్ వరకు తెలుగు మీడియంలోనే చదివాను. మీ దయవల్ల ఇవాళ ఇంగ్లీష్ మీడియంలో చదువుతున్నాను. వీటన్నింటికీ మీరే కారణం’ అని దివ్య చెప్పారు. మా కన్నీళ్లకు మీ చిరునవ్వుతో సమాధానం చెప్పారు. మా లాంటి పేద విద్యార్థుల కోసమే పుట్టిన భరోసా జగనన్న” అంటూ సీఎం జగన్‌ను ప్రశంసలతో ముంచెత్తింది విద్యార్థిని దివ్య.
అయితే దివ్య స్పీచ్ కు సీఎం జగన్ ఫిదా అయ్యారు. దివ్యను దగ్గరకు పిలిచి ఆశీర్వదించారు. కుటుంబ యోగక్షేమాల గురించి అడిగి తెలుసుకున్నారు. తప్పకుండా అండగా ఉంటానని హామీ ఇచ్చారు. అయితే కార్యక్రమం జరిగి మూడు రోజులైనా కాలేదు.. దివ్యకు తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ మాధవీలత నుంచి పిలుపు వచ్చింది. వెంటనే వెళ్లి కలవగా దివ్య కుటుంబానికి ఇంటి స్థలం మంజూరు చేసినట్టు తెలిపారు. దివ్య చదువుతో పాటు ఉద్యోగ, ఉపాధి అవకాశాలకు ప్రభుత్వం చేయూతనందిస్తుందని హామీ ఇచ్చారు. దీంతో దివ్య ఒక్కసారిగా ఉబ్బితబ్బిబ్బయ్యింది. మా కన్నీళ్లు తుడిచే దేవుడు జగనన్న అంటూ సగర్వంగా మరోసారి చెప్పుకొచ్చింది.