CM Jagan Foreign Tour: ఏపీ సీఎం జగన్ విదేశీ పర్యటన ఖరారైంది. ఈ నెల 19 నుంచి 31 వరకూ ఆయన విదేశాల్లో పర్యటించనున్నారు. ఈ మేరకు సీబీఐ కోర్టులో ఆయన అనుమతి పొందారు. మూడు రోజుల పాటు దావోస్ లో జరిగి ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో పాల్గోనున్నారు. ఏపీ పెవలియన్ ఏర్పాటుచేసిన నేపథ్యంలో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే విధంగా పారిశ్రామికవేత్తలతో చర్చించనున్నారు. అటు తరువాత ఆయన విహార యాత్రకు వెళతారని తెలుస్తోంది. ఆయన ఏ దేశానికి వెళతారు? కుటుంబసభ్యులు ఎవరెవరు ఉంటారు? అధికారుల బ్రందం వెళుతుందా? అన్నదానిపై మాత్రం స్పష్టత లేదు. సీఎం విదేశీ పర్యటనకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి షెడ్యూల్ ప్రకటించలేదు. ఒకటి రెండు రోజుల్లో దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. మొన్నటి వరకూ పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రిగా ఉన్న మేకపాటి గౌతం రెడ్డి అకాల మరణంతో ఏపీ సర్కారుకు సరికొత్త చిక్కులు వచ్చిపడ్డాయి. అప్పటివరకూ పెట్టుబడుల అన్వేషణలో గౌతం రెడ్డి కీలక పాత్ర వహించారు. తరచూ విదేశీ పర్యటనలు చేసేవారు. తాజా మంత్రివర్గ విస్తరణలో ఆ శాఖలను దక్కించుకున్న గుడివాడ అమర్నాథ్ కు అనుభవనం తక్కువ. అందుకే ఆ బాధ్యత ఇప్పుడు సీఎం జగన్ తన భుజస్కందాలపై వేసుకున్నారు. సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తొలిసారి పెట్టబడుల కోసం సీఎం విదేశాలకు వెళుతున్నారు. మూడు రోజుల పాటు అధికారిక పర్యటన అనంతరం.. వారం రోజుల పాటు విహార యాత్రకు వెళ్లనున్నారు.

CM Jagan
Also Read: KGF 3 Update: ‘కేజీఎఫ్ 3’ ప్రకటించిన నిర్మాత.. ఎప్పుడు రాబోతుందో తెలుసా ?
సీబీఐ న్యాయవాదులు అభ్యంతరం
ప్రస్తుతం సీఎం జగన్ సీబీఐ అభియోగాలను ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. అందుకే ఆయన సీబీఐ కోర్టు అనుమతి కోసం ముందస్తుగా దరఖాస్తు చేసుకున్నారు. తాను అధికారిక పర్యటనకు వెళ్లాల్సిఉందని.. దావోస్ వెళ్లేందుకు అనుమతి కావాలని జగన్ పిటిషన్ పెట్టుకున్నారు. ఈ పిటిషన్‌పై సీబీఐ కోర్టులో జరిగిన విచారణలో .. సీబీఐ తరపు న్యాయవాదాలు జగన్ పర్యటనకు అనుమతించవద్దని విజ్ఞప్తి చేశారు. ఆయన విదేశాలకు వెళితే వచ్చే ఇబ్బంది లేకున్నా.. కేసు విచారణ మరింత ఆలస్యమవుతుందని అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే సీబీఐ న్యాయవాదుల వాదనను తోసిపుచ్చిన కోర్టు ఆయనకు విదేశాలకు వెళ్లేందుకు అనుమతి ఇచ్చింది.ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాతతొలి సారి ఏపీకి పెట్టుబడుల కోసం ఆయన విదేశాలకు వెళ్తున్నారు. ఆ పర్యటనలో మూడు రోజులు మాత్రమే ఆర్థిక వేదిక సదస్సులో పాల్గొంటారు. ఏడు రోజులు మాత్రం వ్యక్తిగత పర్యటనలో ఉంటారు. ఇప్పటికే జగన్ వెళ్లగానే పెట్టుబడులు తీసుకు రారని .. ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తారని.. అలాగని ఆశలు పెట్టుకోవద్దని మంత్రి అమర్నాథ్ ముందుగానే చెప్పడం విశేషం.
Also Read: Ambati Rayudu: అంబటి రాయుడు ఇక ఐపీఎల్ లో ఆడడం లేదా?