ఎన్‌పిఆర్ డేటాతో జగన్ కు లింకు.. ఎందుకంటే..
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి జాతీయ జనాభా రిజిస్టర్ (ఎన్‌పిఆర్) కసరత్తుపై తన వైఖరిని మార్చుకున్నారు. 2010 ఫార్మాట్‌లో జనాభా డేటాను సేకరించి ఎన్‌పిఆర్‌ను అప్‌డేట్ చేయాలని ఆయన ఇప్పుడు కేంద్ర ప్రభుత్వాన్నీ కోరుతున్నారు. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కూడా ఇలాంటి వాదననే వినిపిస్తున్నారు. .జగన్ మోహన్ రెడ్డి ఇంతకుముందు పార్లమెంటులో పౌరసత్వ సవరణ చట్టానికి, ఎన్‌పిఆర్ ప్రక్రియకు మద్దతునిచ్చారు. అయితే ఈ విషయంలో ఒక వర్గంలో భయాలు నెలకొన్నాయని చెప్పడానికి జగన్ […]

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి జాతీయ జనాభా రిజిస్టర్ (ఎన్‌పిఆర్) కసరత్తుపై తన వైఖరిని మార్చుకున్నారు. 2010 ఫార్మాట్‌లో జనాభా డేటాను సేకరించి ఎన్‌పిఆర్‌ను అప్‌డేట్ చేయాలని ఆయన ఇప్పుడు కేంద్ర ప్రభుత్వాన్నీ కోరుతున్నారు. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కూడా ఇలాంటి వాదననే వినిపిస్తున్నారు. .జగన్ మోహన్ రెడ్డి ఇంతకుముందు పార్లమెంటులో పౌరసత్వ సవరణ చట్టానికి, ఎన్‌పిఆర్ ప్రక్రియకు మద్దతునిచ్చారు. అయితే ఈ విషయంలో ఒక వర్గంలో భయాలు నెలకొన్నాయని చెప్పడానికి జగన్ ట్విట్టర్లో తన వ్యక్తిగత హ్యాండిల్ ను ఆసరా చేసుకున్నారు.
దానిలో కొత్త ఫార్మాట్‌లో ఎన్‌పిఆర్‌ను వ్యతిరేకించటానికి కారణం తెలియజేశారు. ఈ నెల చివర్లో సమావేశమయ్యే శాసనసభ కూడా ఈ మేరకు తీర్మానాన్ని ఆమోదిస్తుందని పేర్కొంటూ ఆయన తన వైఖరిలో మార్పును పునరుద్ఘాటించారు.”ఎన్‌పిఆర్‌లో ప్రతిపాదించిన కొన్ని ప్రశ్నలు మా రాష్ట్రంలోని మైనారిటీల మనస్సులో అభద్రతాభావాలకు కారణమవుతున్నాయి. మా పార్టీలో సంప్రదింపులు జరిపిన అనంతరం 2010 లో ఉన్న పరిస్థితులకు అనుగుణంగా ఎన్‌పిఆర్ డేటా ఉండాలని కేంద్ర ప్రభుత్వాన్ని అభ్యర్థించాలని మేము నిర్ణయించుకున్నామని ఆయన ట్వీట్ చేశారు. అయితే 2020 ఫార్మాట్‌పై ఆధారపడి ముందుకు సాగాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన పక్షంలో రాష్ట్ర ప్రభుత్వం ఏమి చేస్తుందో జగన్ స్పష్టం చేయలేదు. అయితే ఈ రెండు ఫార్మాట్ల మధ్య ప్రాథమిక వ్యత్యాసం ఏమిటంటే… తల్లిదండ్రుల జన్మ స్థలం, పుట్టిన తేదీ డేటాను సేకరించడం… ఇది ముఖ్యంగా ముస్లింలలో ఆందోళనలను కలిగిస్తోంది. 2010 లో ప్రతి ఇంటిలోని సభ్యుల గుర్తింపునకు సంబంధించిన 15 వివరాలు సేకరించారు.
అయితే 2020 లో తల్లిదండ్రులతో పాటు కుటుంబ సభ్యులంతా ఒకే ఇంట్లో నివసించకపోయినా వారి వివరాలతో పాటు మాతృభాష, జన్మ స్థలం, పుట్టిన తేదీకి సంబంధించిన అదనపు సమాచారాన్ని సేకరించాలని కేంద్రం భావిస్తోంది. మరోవైపు ఇటీవలి ప్రభుత్వ ఉత్తర్వులో ఎన్‌పిఆర్ నవీకరణకు సంబంధించి, జిల్లా కలెక్టర్లు, జిల్లా ప్రిన్సిపల్ సెన్సస్ అధికారులు…. ప్రజలకు సమాధానం చెప్పే ఉద్దేశం లేకపోతే తిరిగి అడగవద్దని పేర్కొన్నారు. కాగా 2020 ఏప్రిల్, సెప్టెంబర్ మధ్య 45 రోజులు నిర్వహించే ఎన్‌పిఆర్ ప్రక్రియ కొనసాగనుంది. ఇదిలావుండగా రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించాలనే నిర్ణయానికి పార్టీ వచ్చిన నేపధ్యలో జగన్ ఎన్‌పిఆర్ పై తన వైఖరిని మార్చారనే వాదన వినిపిస్తోంది. సుప్రీంకోర్టు నిర్దేశించినట్లుగా, షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, వెనుకబడిన తరగతులకు సీట్లు కల్పించడంతో పాటు 50 శాతం రిజర్వేషన్లకు కట్టుబడి గ్రామీణ, పట్టణ స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఈ తరుణం లోనే జగన్ ఇటువంటి నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది.