Pawan Kalyan: జనసేన దూకుడు పెంచింది. ప్రజాసమస్యలపై నిలదీసేందుకు సిద్ధమవుతోంది. ప్రభుత్వాలపై సరైన సమయంలో ప్రశ్నించడానికి సమాయత్తమైంది. మిత్రపక్షమైనా, అధికార పక్షమైనా ప్రజాసమస్యలే ఎజెండాగా ముందుకు కదులుతోంది. ఇందులో భాగంగా పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఈనెల 31న విశాఖలో కేంద్ర ప్రభుత్వ వైఖరిని ఎండగట్టేందుకు కార్మికులకు మద్దతుగా దీక్ష చేపట్టేందుకు రెడీ అయ్యారు. సభా వేదిక కార్యక్రమాలు కూడా చురుకుగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో పవన్ కల్యాణ్ మిత్రపక్షమైన బీజేపీ విధానాలను విమర్శించేందుకు సిద్ధమవడం చర్చనీయాంశంగా మారింది.
మరోవైపు సభా వేదిక కార్యక్రమాలు చేపడుతున్న జనసేక కార్యకర్తల పనులకు పోలీసులు అడ్డు చెప్పారు. సభా వేదిక మరోచోటుకు మార్చాలని ఒత్తిడి తెస్తున్నారు. అయినా జనసేన కార్యకర్తలు మాత్రం పట్టించుకోవడం లేదు. ఇక్కడే సభ జరిపి తీరుతామని ఘంటాపథంగా చెబుతున్నారు. ఈ మేరకు జనసేన పార్టీ ఉత్తరాంధ్ర ఇన్ చార్జి తమ్మరెడ్డి శివశంకర్ మాట్లాడుతూ ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా సభ జరిపే తీరుతామని చెప్పారు.
పవన్ కళ్యాణ్ కు భయపడుతున్న సీఎం జగన్
వైసీపీ విశాఖ ఉక్క పరిశ్రమ ప్రైవేటీకరణకు అనుకూలమా? వ్యతిరేకమా? తన వైఖరి స్పష్టం చేయాలని డిమాండ్ తెరమీదికి వస్తోంది. దీంతో ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే పనిలో భాగంగా జనసేన ప్రభుత్వ విధానాలపై ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ప్రజా సమస్యలను పట్టించుకోని ప్రభుత్వంపై తమ అక్కసు వెళ్లగక్కుతోంది. దీంతో ప్రభుత్వం ఇప్పుడు సమాధానం చెప్పాల్సిన అవసరం ఏర్పడింది. దీంతో వైసీపీ ఇరుకున పడటం ఖాయమని తెలుస్తోంది. ఎందుకంటే అనుకూలమంటే ప్రజలతో, వ్యతిరేకమంటే బీజేపీతో నష్టం కలిగే సూచనలున్నందున జగన్ ఎటు వైపు మొగ్గు చూపుతారో అని అందరిలో ఉత్కంఠ నెలకొంది.
Also Read: Modi PM: బీజేపీ సంచలన ప్రకటన : 2024లోనూ మోడీనే ప్రధాని.. వర్కవుట్ అవుతుందా?
విశాఖ కూర్మన్నపాలెం స్టీల్ ప్లాంట్ ఆర్చి వద్ద పవన్ కల్యాణ్ సభ నిర్వహించేందుకు ఏర్పాట్లు సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో పోలీసులు అడ్డు చెప్పడంపై జనసేన నేతలు మండిపడుతున్నారు. అధికార పార్టీకి కొమ్ము కాస్తూ అడ్డుకోవాలని చూస్తే ఫలితాలు దారుణంగా ఉంటాయని హెచ్చరిస్తున్నారు. ప్రభుత్వం ప్రతిపక్షాల గొంతు నొక్కాలని చూస్తే ఊరుకోబోమని చెబుతున్నారు. ప్రభుత్వాల వైఖరిని ఎండగట్టి తీరుతామని పేర్కొన్నారు.
Also Read: Crime News: మిస్ తెలంగాణ.. రెండోసారి సూసైడ్.. కారణమిదే