Karnataka Congress : ఇలాగైతే కర్ణాటకలో తిరిగి 25 సీట్లు బీజేపీవే
కర్ణాటకలో బీజేపీ చేస్తోన్న పనులన్నీ రివర్స్ చేస్తారట.. ఇదే వివాదమైంది. బీజేపీ చేసిన పనులు, బిల్లులు, ఆర్డర్స్ అన్నీ సమీక్ష చేస్తారట.. ఒక మంత్రి దీన్ని ప్రకటించడం వివాదాస్పదమైంది. ఆర్ఎస్ఎస్ ను కూడా కర్ణాటకలో బ్యాన్ చేస్తామని ప్రకటించారు.

Karnataka Congress : కర్ణాటకలో కాంగ్రెస్ గెలవడం ఏమిటో కానీ.. కేంద్రంలో అధికారంలోకి వచ్చినంత హడావుడి చేస్తోంది. ఇటీవల కాంగ్రెస్ గెలిచిన పెద్ద రాష్ట్రం ఏదైనా ఉందంటే అది కర్ణాటకనే. ఈ అతి స్పందన చూస్తుంటే కాంగ్రెస్ కే మోసం వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యమంత్రి పీఠం కోసం సిద్ధరామయ్య, డీకే శివకుమార్ లు పెద్ద లాబీయింగ్ చేశారు. ఇక ప్రమాణ స్వీకారం వేళ ఓ మంత్రి ఏకంగా సిద్ధరామయ్యనే 5 ఏళ్లు ముఖ్యమంత్రి అని ప్రకటించారు. దీంతో మరోసారి రెండున్నరేళ్ల సీఎం పీఠం పంపిణీ అన్నది మరుగున పడిపోయింది.
కర్ణాటకలో బీజేపీ చేస్తోన్న పనులన్నీ రివర్స్ చేస్తారట.. ఇదే వివాదమైంది. బీజేపీ చేసిన పనులు, బిల్లులు, ఆర్డర్స్ అన్నీ సమీక్ష చేస్తారట.. ఒక మంత్రి దీన్ని ప్రకటించడం వివాదాస్పదమైంది. ఆర్ఎస్ఎస్ ను కూడా కర్ణాటకలో బ్యాన్ చేస్తామని ప్రకటించారు.
అధికారం రావడం ఒక ఎత్తు.. దాన్ని నిలుపుకోవడం మరో ఎత్తుగా మారింది. సిద్ధరామయ్య, శివకుమార్ కు మధ్య ప్రమాణ స్వీకారం, సీట్లు పంపిణీ కూడా పూర్తికాలేదు. ఎమ్మెల్యేలకు మంత్రి పదవుల పంపిణీపై గొడవ జరుగుతోంది. అప్పుడే బీజేపీ పాలనపై సమీక్ష అనడం పెద్ద దుమారం రేపుతోంది.
ఇలాగైతే కర్ణాటకలో ఇలాంటి కుమ్ములాటలు జరిగితే తిరిగి 25 సీట్లు బీజేపీవే అనడంలో ఎలాంటి సందేహం లేదు. దీనిపై రామ్ గారి సునిశిత విశ్లేషణను పైన వీడియోలో చూడొచ్చు.