Samantha : ఆస్పత్రి పాలైన సమంత.. క్లారిటీ ఇచ్చిన ఆమె మేనేజర్
Samantha : టాలీవుడ్ స్టార్ సమంత మరోసారి ఆస్పత్రి పాలైందని.. ఆమెను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారని వార్తలు వచ్చాయి. ఉన్నట్టుండి అనారోగ్యానికి గురైన సమంతను ఆమె కుటుంబ సభ్యులు హైదరాబాద్లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారని నెట్టింట పలు పోస్టులు దర్శనమిచ్చాయి. ఇప్పటికే ‘మయోసైటిస్’ అనే కండరాల క్షీణత వ్యాధికి గురైన సమంత ప్రస్తుతం చికిత్స తీసుకుంటోంది. దాని నుంచి బయటపడేందుకు ప్రయత్నిస్తోంది. తాజాగా గురువారం అనారోగ్యానికి గురైందని ఆస్పత్రి పాలైందని ప్రచారం సాగింది. దీంతో ఆందోళనకు […]

Samantha : టాలీవుడ్ స్టార్ సమంత మరోసారి ఆస్పత్రి పాలైందని.. ఆమెను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారని వార్తలు వచ్చాయి. ఉన్నట్టుండి అనారోగ్యానికి గురైన సమంతను ఆమె కుటుంబ సభ్యులు హైదరాబాద్లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారని నెట్టింట పలు పోస్టులు దర్శనమిచ్చాయి.
ఇప్పటికే ‘మయోసైటిస్’ అనే కండరాల క్షీణత వ్యాధికి గురైన సమంత ప్రస్తుతం చికిత్స తీసుకుంటోంది. దాని నుంచి బయటపడేందుకు ప్రయత్నిస్తోంది. తాజాగా గురువారం అనారోగ్యానికి గురైందని ఆస్పత్రి పాలైందని ప్రచారం సాగింది.
దీంతో ఆందోళనకు గురైన ఆమె అభిమానులు.. ఇండస్ట్రీలోని వారు సమంతకు ట్విటర్ లో ‘గెట్ వెల్ సూన్’ అంటూ ఆమెను ట్యాగ్ చేసి అడుగుతున్నారు. కొందరు సినీ నటులు ఫోన్ చేసి కూడా ఆరాతీశారు. సమంత ఆరోగ్యంపై వస్తున్న వార్తలపై ఎట్టకేలకు ఆమె వ్యక్తిగత సిబ్బంది స్పందించారు.
సమంత ఆరోగ్యంగానే ఉందని.. ఆమె వైద్యశాలలో చేరినట్లు వస్తోన్న వార్తల్లో ఎటువంటి నిజం లేదని పేర్కొన్నారు. ఆమె ప్రస్తుతం ఇంట్లోనే ఉన్నారని.. ఆరోగ్యం కూడా బాగానే ఉందని తెలిపారు.
ప్రస్తుతం సమంత నటించిన ‘యశోద’ మూవీ విడుదలై ఘన విజయం సాధించింది. ప్రస్తుతం ఆమె సినిమాలు సెట్స్ పై ఉన్నాయి. మయోసైటిస్ కు చికిత్స తీసుకుంటూ సినిమా నిర్మాణలు పూర్తి చేస్తోంది.
