పెళ్ళికి తమన్నా రెడీ.. కానీ పెళ్లి కొడుకే సమస్య !

మిల్కీ బ్యూటీగా తనకు మం చి క్రేజ్ ఉంది. అయినా ఎందుకో తనకు పెళ్లి సెట్ అవడం లేదని.. దాంతో మనసులో తానూ కొంత బాధ పడుతున్న మాట వాస్తవమే అని తమన్నా ఫీల్ అవుతుందట. ఎఫ్ 3 షూట్ లో ప్రస్తుతం బిజీగా ఉన్న ఈ బ్యూటీ, తన పెళ్లి గురించి అక్కడ సెట్ లో ఒక హీరోగారితో పంచుకుందట. మొత్తానికి ఈ ముదురు భామ తన ఫాన్స్ కి నిరాశ కలిగించడానికి రెడీ అయిపోతుంది […]

Written By: admin, Updated On : April 4, 2021 12:52 pm
Follow us on


మిల్కీ బ్యూటీగా తనకు మం చి క్రేజ్ ఉంది. అయినా ఎందుకో తనకు పెళ్లి సెట్ అవడం లేదని.. దాంతో మనసులో తానూ కొంత బాధ పడుతున్న మాట వాస్తవమే అని తమన్నా ఫీల్ అవుతుందట. ఎఫ్ 3 షూట్ లో ప్రస్తుతం బిజీగా ఉన్న ఈ బ్యూటీ, తన పెళ్లి గురించి అక్కడ సెట్ లో ఒక హీరోగారితో పంచుకుందట. మొత్తానికి ఈ ముదురు భామ తన ఫాన్స్ కి నిరాశ కలిగించడానికి రెడీ అయిపోతుంది అన్నమాట.

తమన్నా త్వరలోనే పెళ్లి చేసుకునేందుకు ఆల్ రెడీ సంబంధాలు కూడా చూస్తోందట. ఇటీవలే చేసిన సినిమాలతో తమన్నాకు మళ్ళీ నిరాశే మిగిలింది. అసలుకే అవకాశాలు తగ్గాయి. అయినా అవకాశాల కోసం ఇంకా ప్రయత్నాలు చేస్తూనే ఉంది. ఎఫ్ 2తో వచ్చిన మంచి సూపర్ హిట్ కారణంగా, అమ్మడికి ఎఫ్ 3 లో కూడా ఛాన్స్ వచ్చింది. ఈ సినిమా కూడా సూపర్ హిట్ అయితే, మరో రెండు సినిమాలు రావొచ్చు.

ఇలాగే సినిమాలు చేసుకుంటూ పోతే, లైఫ్ లో సెటిల్ అవ్వడం ఇప్పట్లో సాధ్యం కాదని, అందుకే పెళ్లి చేసుకోవాలని తమన్నా ప్లాన్ చేసుకుంటుందట. అవసరం అయితే పెళ్లి తరువాత అయినా, సినిమాలు చేసుకోవచ్చు కదా, శ్రీయా లాంటి హీరోయిన్లు చేస్తోంది అదే కదా.. తానూ అలాగే చేస్తాను అంటూ తమన్నా మొత్తానికి తన ఫ్యామిలీ మెంబర్స్ కి క్లారిటీ ఇచ్చిందట.

ఇక తమన్నా ఫ్యామిలీ కూడా మంచి వరుడికోసం వెతుకుతున్నారు. మంచి భర్త కోసం వెయిట్ చేస్తున్న మిల్కీ బ్యూటీకి మంచి భర్త రావాలని కోరుకుందాం. అయితే తనతో మీ పెళ్లి ఎప్పుడు అని ఎవరైనా అడిగితే.. వెంటనే మంచి పెళ్ళికొడుకు ఉంటే చెప్పండి అంటూ అడిగిన వాళ్ళనే సరదాగా అడుగుతుందట తమన్నా.

మొత్తానికి అడపా దడపా వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకుంటున్న ఈ అమ్మడికి కూడా పెళ్లి అయిపోతే.. ఇక సీనియర్ హీరోలకు హీరోయిన్ సమస్య ఇంకా ఎక్కువైపోతుంది.