KGF Chapter 2 Success: భారత దేశ సినీ పరిశ్రమ లో ప్రస్తుతం టాప్ డైరెక్టర్స్ ఎవరు అంటే ఒక్కరు మన తెలుగు సినిమా పరిశ్రమ కి చెందిన SS రాజమౌళి అయితే మరొక్కరు కన్నడ సినిమా ఇండస్ట్రీ కి చెందిన ప్రశాంత్ నీల్ అని చెప్పొచ్చు..ఎందుకంటే నిన్న మొన్నటి వరుకు ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద జరిగిన బాలీవుడ్ సినిమా డామినేషన్ ని వీళ్లిద్దరు అధిగమించి, నేడు టాప్ 5 హైయెస్ట్ గ్రాస్ సాధించిన సినిమాలలో మూడు సినిమాలు మన సౌత్ నుండే ఉండడానికి కారకులు అయ్యారు..వీళ్ళు తెరకెక్కించిన బాహుబలి 2 , #RRR మరియు KGF సినిమాలు బాలీవుడ్ లో సృష్టించిన రికార్డులు అన్ని ఇన్ని కావు.,.ఈ రికార్డ్స్ ని అక్కడి స్టార్ హీరో ఖాన్స్ కూడా అందుకోవడం అంత తేలికైన విషయం కాదు అనే చెప్పాలి..ఆ స్థాయి బెంచ్ మార్కుని ఏర్పరిచారు ఈ ఇద్దరు స్టార్ డైరెక్టర్లు..అయితే ప్రస్తుతం వీళ్లిద్దరి మధ్య ఉన్న సీక్రెట్ ఫ్రెండ్ షిప్ గురించి సోషల్ మీడియా లో ప్రచారం అవుతున్న ఒక్క వార్త ఇప్పుడు సెన్సషనల్ గా మారింది.

ఇక అసలు విషయానికి వస్తే KGF సినిమాని తొలుత డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కేవలం ఒక్క భాగం లోనే తీసి వెయ్యాలి అని అనుకున్నాడు అట..అయితే స్టోరీ ఏమో చాలా పెద్దది గా ఉన్నది..పాన్ ఇండియా కోప్ కూడా ఈ సినిమాకి ఉంది అని భావించిన ప్రశాంత్ నీల్..అప్పటికే బాహుబలి వంటి పాన్ ఇండియన్ సినిమాని తీసి భారీ హిట్ కొట్టిన SS రాజమౌళి గారి సలహా ని అడిగారు అట..ఆయన ఈ సినిమా స్టోరీ మొత్తం ని పరిశీలించిన తర్వాత ఈ కథ ని రెండు భాగాలుగా తీస్తే బాగా వర్కౌట్ అవుతుంది అని..క్లైమాక్స్ ఎండింగ్ కూడా రెండవ భాగం కోసం ప్రేక్షకులు ఎదురు చూసేలా ఒక్క ఐడియా ఇచ్చాడు అట రాజమౌళి..దానికి తగట్టుగా ప్రశాంత్ నీల్ స్క్రిప్ట్ ని డెవలప్ చేసి KGF పార్ట్ 1 ని తీసాడు..ట్రైలర్ దగ్గర నుండే అందరి దృష్టిని ఆకర్షించిన ఈ సినిమా విడుదల తర్వాత అదే స్థాయి అద్భుతమైన రెస్పాన్స్ ని అన్ని బాషల నుండి అందుకొని సుమారు 250 కోట్ల రూపాయిల గ్రాస్ ని ఫుల్ రన్ లో వసూలు చేసింది..ఇక ఆ తర్వాత KGF చాప్టర్ 2 రూపుదిద్దుకొని ఇటీవలే విడుదల అయ్యి ఎంత పెద్ద సంచలనాలు బాక్స్ ఆఫీస్ వద్ద సృష్టిస్తూ దూసుకుపోతుందో మన అందరికి తెలిసిందే.
Also Read: KGF2 5 Days Collections: 5 రోజుల్లో ₹ 200 కోట్లు.. కన్నీళ్లు పెట్టుకుంటున్న స్టార్ హీరోలు !
అతి త్వరలోనే ఈ సినిమా ప్రతిష్టాత్మక వెయ్యి కోట్ల రూపాయిల గ్రాస్ క్లబ్ లోకి కూడా చేరబోవడం కాకుండా ఆల్ టైం ఇండస్ట్రీ హిట్ సాధించే అవకాశాలు కూడా ఉన్నాయి అని ట్రేడ్ వర్గాల అంచనా..అలా ఇండియా లోనే రెండు బిగ్గెస్ట్ హిట్స్ ఇచ్చిన దర్శకుల మధ్య ఇంత స్నేహం ఉంది అని..ఒక్కరి సినిమా కోసం ఇంకొక్కరు శ్రద్ద తీసుకొని సలహా ఇచ్చి, ఇంత పెద్ద బాక్స్ ఆఫీస్ విద్వాంసం కి ఒక్క కారణం కావడం అనేది నిజంగా హర్షించదగ్గ విషయం..ఒక్క తెలుగు వాడిగా రాజమౌళి ని చూసి మనం ఎంత గర్వపడుతున్నామో..కన్నడ ప్రేక్షకులు కూడా ప్రశాంత్ నీల్ ని చూసి అదే స్థాయి లో గర్వపడుతున్నారు..23 రోజులకు గాను 1200 కోట్ల రూపాయిలు #RRR సినిమా వసూలు చెయ్యగా..నాలుగు రోజుల్లో 530 కోట్ల రూపాయిల గ్రాస్ ని KGF చాప్టర్ 2 వసూలు చేసింది అని ట్రేడ్ వర్గాల్లో సాగుతూ..నాలుగు రోజుల క్రితం ప్రారంభం అయినా ఈ బాక్స్ ఆఫీస్ తుఫాన్ ఫుల్ రన్ లో ఎక్కడ వరుకు వెళ్లి ఆగుతుందో చూడాలి.
Also Read: KGF2: ఇంత అద్భుతంగా కేజీఎఫ్2 ఫైనల్ కట్ చేసిన ఎడిటర్ ఈ 19 ఏళ్ల కుర్రాడని తెలుసా?