Skill Development Scam: స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో అసలు గుట్టు బయటపెట్టిన సీఐడీ
అయితే స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్టు కింద దాదాపు 2 లక్షల మంది విద్యార్థులకు శిక్షణను ఇచ్చినట్లు లోకేష్ చెబుతున్నారు. సి మెన్స్ సంస్థ ద్వారా రాష్ట్రవ్యాప్తంగా కేంద్రాలను ఏర్పాటు చేసి శిక్షణను ఇచ్చినట్లు ప్రకటనలు చేస్తున్నారు.

Skill Development Scam: స్కిల్ డెవలప్మెంట్ స్కాం కేసులో సిఐడి పక్కా ఆధారాలతో ముందుకు సాగుతోంది. అసలు స్కిల్ డెవలప్మెంట్ లో అవినీతి జరిగే అవకాశమే లేదని తెలుగుదేశం పార్టీ చెబుతోంది. అప్పట్లో సి మెన్స్ సంస్థతో 90:10 నిష్పత్తి వాటాతో టిడిపి ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. 90 శాతం నిధులు సి మెన్స్ సంస్థ సమకూర్చితే.. పది శాతం ప్రభుత్వం నిధులు భరించాలన్నది ఒప్పందం. కానీ సి మెన్స్ నిధులు విడుదల చేయకుండానే ప్రభుత్వం విడుదల చేసిందని.. ఆ నిధులు పక్కదారి పట్టాయి అన్నదే సిఐడి ఆరోపణ. దాని చుట్టూనే దర్యాప్తు సంస్థ పట్టు బిగుస్తోంది.
అయితే స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్టు కింద దాదాపు 2 లక్షల మంది విద్యార్థులకు శిక్షణను ఇచ్చినట్లు లోకేష్ చెబుతున్నారు. సి మెన్స్ సంస్థ ద్వారా రాష్ట్రవ్యాప్తంగా కేంద్రాలను ఏర్పాటు చేసి శిక్షణను ఇచ్చినట్లు ప్రకటనలు చేస్తున్నారు. సి మెన్స్ సంస్థ కేవలం సాంకేతిక పరికరాలు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ను మాత్రమే సమకూర్చుతుందని.. నేరుగా నిధులు విడుదల చేయదని చెప్పుకొస్తున్నారు. వారు కేంద్రాలను ఏర్పాటు చేసిన తర్వాతే ప్రభుత్వం తరఫున నిధులు మంజూరు చేసినట్లు చెబుతున్నారు. లక్షలాదిమందికి నైపుణ్య శిక్షణ ఇచ్చిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు.
అయితే ఇది పూర్తిగా అబద్ధమని, అసత్య ప్రచారమని సిఐడి వాదిస్తోంది. రూ.371 కోట్ల స్కాం జరిగిందని ఆరోపిస్తోంది. 2015 నుంచి నాలుగేళ్ల పాటు 745 కోట్ల రూపాయలు టిడిపి ప్రభుత్వం ఈ ప్రాజెక్టు గాను విడుదల చేసినట్లు సిఐడి గణాంకాలతో సహా చెబుతోంది. అయితే ఇందులో 371 కోట్ల రూపాయలు శిక్షణ నివ్వకుండానే పక్కదారి పట్టినట్లు సిఐడి అనుమానం వ్యక్తం చేస్తోంది. మరోవైపు ఏపీఎస్ఎస్డిసి ద్వారా డిజైన్ టెక్ కంపెనీకి నిధుల విడుదలపై కూడా సిఐడి సందేహాలు వ్యక్తం చేస్తోంది. పారదర్శకంగా నిధుల విడుదల ప్రక్రియ జరగలేదని చెప్పుకొస్తోంది. ఫ్యాక్ట్ చెక్ పేరిట ఎలా నిధులు గోల్ మాల్ అయ్యాయో సవివరంగా సిఐడి ప్రకటించింది.
2017 డిసెంబర్ 5న ఏపీ ఎస్ఎస్డిసి స్కిల్ ప్రాజెక్ట్ మార్కెట్ ఎవల్యూవేషన్ కోసం సంప్రదించింది. అదే రోజు ఒప్పందంలో 50 శాతాన్ని అంటే.. 185 కోట్ల రూపాయలను విడుదల చేసింది. 2016 జనవరి 29న 85 కోట్లు, 2016 మార్చి 11న 67 కోట్లు విడుదల చేసినట్లు సిఐడి చెబుతోంది. ఇలా మూడు విడతల్లో 337 కోట్ల రూపాయలను టిడిపి ప్రభుత్వం విడుదల చేసినట్లు చూపుతోంది. అంటే సి మెన్స్ వాటా నిధులు పెట్టకుండానే.. 371 కోట్ల రూపాయలు పక్కదారి పట్టించినట్లు సిఐడి గణాంకాలతో చూపుతోంది. లోకేష్ చెబుతున్న వివరాలు తప్పు అని చెప్పే ప్రయత్నం చేసింది.
