Ramoji Rao : సీఐడీ ఆస్తులు అటాచ్ చేసింది.. తదపరి రామోజీ అరెస్టేనా?
సీఐడీ ఆస్తులు అటాచ్ చేయడం, మార్గదర్శి ఎండీ శైలజా కిరణ్‌ఐ లుక్ అవుట్ నోటీస్ జారీచేయడం.. వంటి పరిణామాలు జరిగిన తర్వాత ఈ కేసులో ఈడీ ప్రవేశించే అవకాశాలున్నాయని తెలుస్తోంది. ఇదే జరిగితే కనుక రామోజీరావు వ్యాపారాలను మొత్తం తవ్వే అవకాశం ఉంది.

Ramoji Rao : రామోజీరావు మార్గదర్శి విషయంలో వేగంగా అడుగులు వేస్తున్న ఏపీ సీఐడీ తర్వాత ఏం చేయబోతుందనేది ఆసక్తిగా మారింది. త్వరలో అరెస్ట్ చేస్తారనే ప్రచారం కూడా సాగుతోంది. ఇప్పటికే 793 కోట్ల రూపాయల ఆస్తులను అటాచ్ చేసిన సీఐడీ పూల్ ఖాతాను తన ఆధీనంలో ఉంచుకుంది. దీనికితోడు కక్ష సాధింపు విషయంలో ఏమాత్రం తగ్గని జగన్.. రామోజీరావును ఇంకా ఏఏ మార్గాల్లో వత్తాల్లో ప్రణాళికలు రూపిందిస్తున్నట్టు తెలుస్తోంది. అంతేకాదు రామోజీరావు మార్గదర్శి విషయంలో సీఐడీకి జగన్ పూర్తి స్వేచ్ఛ ఇచ్చాడు.
కలిశాకే సీన్ మారింది
ఇటీవల నీతి అయోగ్ సమావేశం ఢిల్లీలో నిర్వహించినప్పుడు ముఖ్యమంత్రి జగన్ వెళ్లారు. ప్రధానితో జరిగిన సమావేశానికి హాజరయ్యారు. అది ముగిసిన తర్వాత కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. అది ముగిసిన తర్వాత ఏపీలో సమూల మార్పులు చోటు చేసుకున్నాయి. నాటి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హయాంలో జరిగిన అవకతవకల నివేదికలు కావాలని సీఐడీ అడిగింది. ఇది జరిగిన తర్వాత కొద్దిసేపటికే రామోజీరావు ఆస్తులను సీఐడీ అటాచ్ చేసింది. ఇవన్నీ జరిగేందుకు అమిత్‌షా నుంచి జగన్ గ్రీన్ సిగ్నల్ తీసుకున్నారని, తర్వాతే సీఐడీ వేగంగా అడుగులు వేసిందని ప్రచారం జరుగుతోంది.
ఈడీ ఎంటర్ అవుతుందా?
సీఐడీ ఆస్తులు అటాచ్ చేయడం, మార్గదర్శి ఎండీ శైలజా కిరణ్‌ఐ లుక్ అవుట్ నోటీస్ జారీచేయడం.. వంటి పరిణామాలు జరిగిన తర్వాత ఈ కేసులో ఈడీ ప్రవేశించే అవకాశాలున్నాయని తెలుస్తోంది. ఇదే జరిగితే కనుక రామోజీరావు వ్యాపారాలను మొత్తం తవ్వే అవకాశం ఉంది. అంతే కాదు రామోజీరావుకు సంబంధించిన మరిన్ని ఆస్తులను అటాచ్ చేస్తుంది. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటుంది. అంతటి దక్కన్ క్రానికల్ కేసులోనూ ఈడీ ఇలాంటి చర్యలే తీసుకుంది. నాడు జరిగిన ఆర్థిక అవకతవకల వల్ల దక్కన్ క్రానికల్ తర్వాత ఆం రఽఽధభూమి పత్రికను మూసుకోవాల్సి వచ్చింది. ఇప్పడు రామోజీరావుకు కూడా అలాంటి పరిస్థితే వస్తుందా? ఆర్థిక అవకవతవకల రుజువు అయితే అరెస్ట్ అవుతారా? వీటంన్నింటికీ కాలమే సమాధానం చెబుతుంది.
బీజేపీ స్టాండ్ ఎందుకు మారింది
మొన్న కేంద్ర హోం శాఖ మంత్రి హైదరాబాద్ వచ్చినప్పుడు ఫిలింసింటీలో రామోజీరావును కలిశారు. ఆయనతో చాలా సేపు మాట్లాడారు. గతంలో కూడా రామోజీరావుకు బీజేపీ చాలా గౌరవమే ఇచ్చింది. పద్మ విభూషణ్ పురస్కారం ఇచ్చింది. మోదీ మొదటి సారి ప్రధానిగా ప్రమాణస్వీకారం చేసేప్పుడు ప్రత్యేకంగా ఆహ్వానించింది. చంద్రబాబు చెంతన చేరిన రామోజీరావు తన బుద్ధిని చూపించాడు. బీజేపీ మీద అడ్డగోలు రాతలు రాయించాడు. నాడు ఎన్టీఆర్ మీద వేయించినట్టు శ్రీధర్‌తో కార్టూన్లు గీయించాడు. అప్పటి పరిస్థితులను దృష్టిలో పెట్టుకున్న బీజేపీ హై కమాండ్ జగన్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అందుకు తగ్గట్టుగానే ఏపీ సీఐడీ అడుగులు వేస్తోంది. బీజేపీతో పెట్టకుంటే ఏం జరుగుతుందో ఇప్పుడు రామోజీరావుకు తెలిసివస్తోంది.
