MS Dhoni: ధోనికి చాక్లెట్ అంటే ఎంత ఇష్టమో?.. ఈ వీడియో చూసిన తర్వాత నవ్వు ఆపుకోలేరు

ప్రస్తుతం ధోని అమెరికాలో పర్యటిస్తున్నాడు.. ఇటీవల అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఆహ్వానం మేరకు గోల్ఫ్ ఆడాడు. ప్రొఫెషనల్ క్రీడాకారుడికి మించిన స్థాయిలో గోల్ఫ్ సాధించాడు.

  • Written By: Bhaskar
  • Published On:
MS Dhoni: ధోనికి చాక్లెట్ అంటే ఎంత ఇష్టమో?.. ఈ వీడియో చూసిన తర్వాత నవ్వు ఆపుకోలేరు

MS Dhoni: మహేంద్ర సింగ్ ధోని.. ఇతడి నాయకత్వంలోనే భారత జట్టు ఐసీసీ నిర్వహించిన మెగా టోర్నీలలో ట్రోఫీలు సాధించింది. కపిల్ దేవ్ నాయకత్వంలో సాధించిన వరల్డ్ కప్.. మళ్లీ ధోని సారధ్యంలోనే మనకు దక్కింది. టి20 వరల్డ్ కప్ కూడా అంతే. అయితే అలాంటి ధోని ఐపీఎల్లో తన చెన్నై జట్టును పలుమార్లు విజేతగా నిలిపాడు. ఇంటర్నేషనల్ క్రికెట్ కు వీడ్కోలు పలికిన తర్వాత చిత్ర నిర్మాణంలోనూ ధోని ప్రవేశించాడు. ఇటీవలే ఒక సినిమా కూడా తీశాడు. అందులో ప్రధాన పాత్రలో యోగి బాబు నటించాడు. ఆ సినిమా సెట్ లో యోగి బాబు పుట్టిన రోజు వేడుక లు నిర్వహించారు.. దీనికోసం ఒక పెద్ద చాక్లెట్ కేక్ ధోని తెప్పించాడు. ధోని సమక్షంలో యోగిబాబు కేక్ కట్ చేశాడు. అయితే మొదటి ముక్కను యోగికి తినిపించకుండా తనే తిన్నాడు. దీంతో యోగి బాబు అమాయకమైన ముఖంతో ధోని వైపు అదోలా చూశాడు.. అప్పట్లో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అదే సమయంలో చాక్లెట్ అంటే ధోని కి ఎంత ఇష్టమో ప్రపంచానికి తెలిసింది.

ప్రస్తుతం ధోని అమెరికాలో పర్యటిస్తున్నాడు.. ఇటీవల అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఆహ్వానం మేరకు గోల్ఫ్ ఆడాడు. ప్రొఫెషనల్ క్రీడాకారుడికి మించిన స్థాయిలో గోల్ఫ్ సాధించాడు. ఆ టోర్నీ ముగిసిన తర్వాత కూడా ధోని అమెరికాలోనే ఉన్నాడు. అమెరికాలోని పలు ప్రాంతాలను సందర్శిస్తున్నాడు. అయితే ఇటీవల తన అభిమానులను కలుసుకునేందుకు అమెరికాలోని ఒక ప్రాంతానికి వెళ్ళాడు. అక్కడ తన అభిమానులకు ఆటోగ్రాఫ్ ఇచ్చాడు. అయితే ఒక అభిమాని ధోనీకి ఇద్దామని చాక్లెట్స్ తీసుకొచ్చాడు. ఆ అభిమానికి ఆటోగ్రాఫ్ ఇచ్చిన తర్వాత.. అతడు తెచ్చిన చాక్లెట్స్ ను అడిగిమరీ ధోని తీసుకున్నాడు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీనిపై నెటిజెన్లు రకరకాల కామెంట్స్ చేస్తున్నారు.. ధోనికి చాక్లెట్స్ అంటే చాలా ఇష్టమని.. ఎప్పుడు కూడా అందులో మొహమాట పడడని వ్యాఖ్యానిస్తున్నారు. అభిమానికి ఆటోగ్రాఫ్ ఇవ్వగానే, తన కోసం తెచ్చిన చాక్లెట్స్ ఇవ్వాలని అడిగిమరీ తీసుకోవడం నవ్వు తెప్పించే విధంగా ఉందని కామెంట్స్ చేస్తున్నారు.

అమెరికాలో పర్యటిస్తున్న ధోని.. అక్కడ పలు ప్రాంతాల్లో స్థిరపడిన భారతీయులను కలుస్తున్నారు. వారితో ముచ్చట్లు చెబుతున్నారు. ఈ విషయాలను ఆయన ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు. ఇటీవల డోనాల్డ్ ట్రంప్ బృందంతో కలిసి ఆడిన గోల్ఫ్ మ్యాచ్ కు సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. క్రికెటర్ గా మారకముందు ధోని ఫుట్బాల్ కూడా ఆడేవాడు. గోల్ కీపర్ గా ఉండేవాడు. సెకన్ల వ్యవధిలోనే వికెట్లను నేల కూల్చగలిగే సామర్థ్యం ధోని కి వచ్చింది అంటే దానికి ఫుట్ బాలే కారణం.. గోల్ కీపర్ గా అతడు చాలా చురుకుగా ఉండేవాడు. ప్రత్యర్థి జట్టుకు ఏమాత్రం గోల్స్ సాధించే అవకాశం ఇవ్వకపోయేవాడు. ఆ స్థాయిలో అతడి సామర్థ్యం ఉంది కాబట్టే ఈరోజు ప్రపంచంలోనే నెంబర్ వన్ కీపర్ గా చరిత్ర పుటల్లోకి ఎక్కాడు. కా, అమెరికాలో ఉన్న ధోనిని రోజూ చాలామంది అభిమానులు కలుస్తున్నారు. అతడి ఆటోగ్రాఫ్ కోసం ప్రత్యేకంగా బ్యాట్లు తీసుకొస్తున్నారు. సందర్శకుల తాకిడి తో ధోని ఉంటున్న విడిది ప్రాంతం సందడిగా మారింది.

Read Today's Latest Sports news News, Telugu News LIVE Updates on Oktelugu
oktelugu whatsapp channel
follow us
  • facebook
  • instagram
  • twitter
  • youtube

సంబంధిత వార్తలు