Bhola Shankar Postponed: చిరంజీవి ‘భోళా శంకర్’ విడుదల తేదీ వాయిదా.. తమ్ముడి కోసం చిరంజీవి త్యాగం చేశాడా?

ఇక ఈ సినిమాని ఆగస్టు 11 వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదల చేయబోతున్నామని, ఇది వరకే మూవీ టీం అధికారిక ప్రకటన చేసింది. అయితే ఈ సినిమా ఇప్పుడు వాయిదా పడే అవకాశం కూడా ఉందని అంటున్నారు విశ్లేషకులు.

  • Written By: Vicky
  • Published On:
Bhola Shankar Postponed: చిరంజీవి ‘భోళా శంకర్’ విడుదల తేదీ వాయిదా.. తమ్ముడి కోసం చిరంజీవి త్యాగం చేశాడా?

Bhola Shankar Postponed: ‘వాల్తేరు వీరయ్య’ లాంటి రికార్డు స్థాయి వసూళ్లను రాబట్టిన తర్వాత మెగాస్టార్ చిరంజీవి మెహర్ రమేష్ తో ‘భోళా శంకర్’ అనే సినిమా చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. తమిళం లో సంచలన విజయం గా నిల్చిన అజిత్ ‘వేదలమ్’ చిత్రానికి ఇది రీమేక్. తెలుగు ఆడియన్స్ నేటివిటీ కి తగ్గట్టుగా మార్పులు చేర్పులు చేసి, ఈ చిత్రాన్ని తీస్తున్నాడట డైరెక్టర్ మెహర్ రమేష్. చిరంజీవి ఇన్ పుట్స్ కూడా ఈ చిత్రానికి బాగా ఉపయోగపడ్డాయి అట.

ఇప్పటి వరకు తీసిన సినిమా ఔట్పుట్ బాగా వచ్చిందని అంటున్నారు. అందులో ఎంత మాత్రం నిజం ఉందో ఎవరికీ తెలియదు కానీ, నిన్న విడుదలైన పాటకి మాత్రం ఆశించిన స్థాయి రెస్పాన్స్ రాలేదు. రొటీన్ ట్యూన్ ని తిప్పి మళ్ళీ కొట్టారు అంటూ మ్యూజిక్ డైరెక్టర్ మహతి సాగర్ పై విరుచుకుపడుతున్నారు ఫ్యాన్స్. అయితే మెగాస్టార్ చిరంజీవి తన అద్భుతమైన స్టెప్పులతో పాటకి వన్నె తెచ్చాడు.

ఇక ఈ సినిమాని ఆగస్టు 11 వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదల చేయబోతున్నామని, ఇది వరకే మూవీ టీం అధికారిక ప్రకటన చేసింది. అయితే ఈ సినిమా ఇప్పుడు వాయిదా పడే అవకాశం కూడా ఉందని అంటున్నారు విశ్లేషకులు.ఎందుకంటే ఈ సినిమాకి సంబంధించిన వర్క్ ఇంకా చాలా వరకు బ్యాలన్స్ ఉండిపోయిందట. ఫస్ట్ హాఫ్ కి సంబంధించిన సన్నివేశాలన్నీ పూర్తి చేసినప్పటికీ, సెకండ్ హాఫ్ సన్నివేశాలు మాత్రం కీలకమై బ్యాలన్స్ ఉండిపోయిందట. అంతే కాకుండ రెండు సాంగ్స్ కి సంబంధించిన షూటింగ్స్ కూడా బ్యాలెన్స్ ఉందట.

దీనితో ఈ చిత్రం ఆగష్టు నుండి దసరా కి వాయిదా పడే అవకాశం ఉందని అంటున్నారు. దానికి తోడు తమ్ముడు పవన్ కళ్యాణ్ బ్రో సినిమా జులై 28 వ తారీఖున విడుదల అవ్వబోతుంది. రెండు సినిమాలకు మధ్య గ్యాప్ కేవలం రెండు వారాలు మాత్రమే, ఇంత తక్కువ సమయం లో తమ్ముడి సినిమాకి అడ్డుగా వెళ్లడం కరెక్ట్ కాదని, అందుకే చిరంజీవి వాయిదా వేసే ఆలోచనలో ఉన్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి.

Read Today's Latest Tollywood News, Telugu News LIVE Updates on Oktelugu
oktelugu whatsapp channel
follow us
  • facebook
  • instagram
  • twitter
  • youtube

సంబంధిత వార్తలు