‘Waltheru Veeraiya’ : ‘వాల్తేరు వీరయ్య’ ప్రీ రిలీజ్ ఈవెంట్ వేదిక మార్పుపై చిరంజీవి – రవితేజ సెన్సేషనల్ కామెంట్స్

‘Waltheru Veeraiya’ : మెగాస్టార్ చిరంజీవి హీరో గా నటించిన ‘వాల్తేరు వీరయ్య’ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 13 వ తారీఖున విడుదల అవ్వబోతున్న సందర్భం గా ఈరోజు వైజాగ్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ ని జరపబోతున్నారు..సాయంత్రం నుండి ఈ ఈవెంట్ ‘ఆంధ్ర యూనివర్సిటీ’ లో జరగనుంది..అయితే ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని తొలుత వైజాగ్ ఆర్కే బీచ్ రోడ్డు లో చేద్దాం అనుకున్నారు..పోలీసులు అనుమతి కూడా ఇవ్వడం తో నిర్మాతలు భారీ […]

  • Written By: NARESH ENNAM
  • Published On:
‘Waltheru Veeraiya’ : ‘వాల్తేరు వీరయ్య’ ప్రీ రిలీజ్ ఈవెంట్ వేదిక మార్పుపై చిరంజీవి – రవితేజ సెన్సేషనల్ కామెంట్స్

‘Waltheru Veeraiya’ : మెగాస్టార్ చిరంజీవి హీరో గా నటించిన ‘వాల్తేరు వీరయ్య’ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 13 వ తారీఖున విడుదల అవ్వబోతున్న సందర్భం గా ఈరోజు వైజాగ్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ ని జరపబోతున్నారు..సాయంత్రం నుండి ఈ ఈవెంట్ ‘ఆంధ్ర యూనివర్సిటీ’ లో జరగనుంది..అయితే ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని తొలుత వైజాగ్ ఆర్కే బీచ్ రోడ్డు లో చేద్దాం అనుకున్నారు..పోలీసులు అనుమతి కూడా ఇవ్వడం తో నిర్మాతలు భారీ ఏర్పాట్లు చేసుకున్నారు.

కానీ చివరి నిమిషం లో ఆర్కే బీచ్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుపుకోవడానికి అనుమతిని నిరాకరిస్తున్నట్లు పోలీసులు ఉత్తర్వులు జారీ చేసారు..దీనిపై అభిమానులు చాలా తీవ్రంగా తమ అసహనం ని వ్యక్తం చేసారు..వైజాగ్ లో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు కూడా జరిపారు..అయితే ఈరోజు ప్రీ రిలీజ్ ఈవెంట్ కి చేరుకునేందుకు మెగాస్టార్ చిరంజీవి తో పాటుగా రవితేజ కూడా వైజాగ్ విమానాశ్రయం కి చేరుకున్నారు.

వీళ్లిద్దరు విమానాశ్రయంపై చేరుకోగానే మీడియా ప్రతినిధులు చుట్టుముట్టేశారు..ముందుగా సినిమా గురించి పలు విశేషాలు అడిగారు..కూల్ గానే సమాధానం చెప్పారు కానీ ఎప్పుడైతే ‘సభా స్థలి మార్పు పై మీ స్పందన ఏమిటి? ‘ అని మీడియా అడిగిన ప్రశ్నకి అటు చిరంజీవి ఇటు రవితేజ చాలా ఘాటుగానే సమాధానం చెప్పాడు..ముందుగా చిరంజీవి ని అడగగా ఆయన ‘ఇలాంటి ప్రశ్నలు ఇక్కడ అడగొద్దు’ అంటూ సమాధానం దాటవేసాడు..ఆ తర్వాత రవితేజ ని కూడా ఇదే ప్రశ్న అడగగా ‘ఆపేయ్ అక్కడితో..అలాంటి కాంట్రవర్సీ ప్రశ్నలకు నేను సమాధానం చెప్పను’ అంటూ సమాధానం ఇచ్చాడు.

ఇక ప్రీ రిలీజ్ ఈవెంట్ లో వీళ్లిద్దరు సినిమా గురించి ఏమి మాట్లాడబోతున్నారో అని అభిమానులు ఎంతో ఆత్రుతతో ఎదురు చూస్తున్నారు..నిన్న విడుదల చేసిన ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ కి సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది..అభిమానుల్లో అంచనాలను తారాస్థాయికి పెంచేసింది ఈ ట్రైలర్..మరి సినిమా కూడా ఆ అంచనాలను అందుకుంటుందా లేదా అనేది చూడాలి.

Read Today's Latest Viral news News, Telugu News LIVE Updates on Oktelugu
oktelugu whatsapp channel
follow us
  • facebook
  • instagram
  • twitter
  • youtube

సంబంధిత వార్తలు