Chiranjeevi -Thota Chandrashekar : ఆంధ్రప్రదేశ్ బీఆర్ఎస్ అధినాయకుడిని పొగడ్తలతో ముంచెత్తిన చిరంజీవి
Chiranjeevi -Thota Chandrashekar : ఫిబ్రవరి 17.. తెలంగాణ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా తెలంగాణలో బీఆర్ఎస్ నేతలు, కేసీఆర్ అభిమానులు ఘనంగా పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. తెలంగాణలోనే కాదు.. ఆంధ్రాలోనూ బీఆర్ఎస్ నేతలు కేసీఆర్ వేడుకను నిర్వహించారు. ఏపీ బీఆర్ఎస్ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ ఆధ్వర్యంలో కేసీఆర్ బర్త్ డేకు సేవా కార్యక్రమాలను నిర్వహించారు. ఏకంగా 100 మంది కలిసి రక్తదానం చేశారు. ఈ రక్తాన్ని చిరంజీవి బ్లడ్ బ్యాంకుకు దానం […]

Chiranjeevi -Thota Chandrashekar : ఫిబ్రవరి 17.. తెలంగాణ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా తెలంగాణలో బీఆర్ఎస్ నేతలు, కేసీఆర్ అభిమానులు ఘనంగా పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. తెలంగాణలోనే కాదు.. ఆంధ్రాలోనూ బీఆర్ఎస్ నేతలు కేసీఆర్ వేడుకను నిర్వహించారు. ఏపీ బీఆర్ఎస్ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ ఆధ్వర్యంలో కేసీఆర్ బర్త్ డేకు సేవా కార్యక్రమాలను నిర్వహించారు. ఏకంగా 100 మంది కలిసి రక్తదానం చేశారు. ఈ రక్తాన్ని చిరంజీవి బ్లడ్ బ్యాంకుకు దానం చేశారు.
ఇంత పెద్ద ఎత్తున రక్తాన్ని దానం చేసి చిరంజీవి బ్లడ్ బ్యాంకుకు ఇవ్వడంపై మెగాస్టార్ చిరంజీవి హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తోట చంద్రశేఖర్ సేవానిరతిని కొనియాడుతూ ఒక లేఖ రాశారు. కేసీఆర్ బర్త్ డే సందర్భంగా ఇంత పెద్ద ఎత్తున రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసి ఆ రక్తాన్ని మా బ్లడ్ బ్యాంకుకు దానం చేసినందుకు తోట చంద్రశేఖర్ ను చిరంజీవి ప్రత్యేకంగా అభినందించారు.
ఇక 100 మంది రక్తదానం చేసిన సభ్యులు ఎంతో విలువైన వారని.. వారు సమాజహితం కోసం.. తోటి వారి ప్రాణాలు రక్షించేందుకు ఈ మహాత్క్యాన్ని చేపట్టారని.. రక్తం దానం చేసిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు చిరంజీవి. ఒక గొప్ప సేవా హృదయంతో ఇలా బ్లడ్ డొనేషన్ చేసినందుకు సభ్యుల సేవలు వెలకట్టలేనివన్నారు.
రక్తదానంలో మీ అందరి సహకారం మరువలేనిదని.. చిరంజీవి ఐ, బ్లడ్ బ్యాంకుకు దానం చేసిన ఈ రక్తాన్ని ఆపదలో ఉన్న వారందరికీ అందిస్తామని చిరంజీవి తెలిపారు. ఈ సందర్భంగా రక్తదానం చేసినందుకు మరోసారి తోట చంద్రశేఖర్ కు చిరంజీవి కృతజ్ఞతలు తెలిపారు. మర ఈ ‘రక్తసంబంధాన్ని’ కొనసాగిద్దాం అంటూ చిరంజీవి ధన్యవాదాలు తెలిపారు. చిరంజీవితోపాటు బ్లండ్ బ్యాంక్ మేనేజింగ్ ట్రస్టీ రాంచరణ్ కూడా సభ్యులకు థాంక్స్ చెప్పారు.
