Chiranjeevi – Pawan Kalyan : చిరంజీవి ఫ్యామిలీ రేర్ పిక్.. పవన్ ఎలా ఉన్నాడో చూడండి
ఈ పిక్ తీసే సమయానికి పవన్ కళ్యాణ్ ఇంకా సినీ ఫీల్డ్ లోకి ఎంటర్ అయినట్టుగా కనిపించడం లేదు.

Chiranjeevi – Pawan Kalyan : తెలుగు సినిమా ఇండస్ట్రీలో కేవలం బ్యాక్ గ్రౌండ్ లేకుండా హీరో అవ్వాలి అనుకునే వారికి ఇన్స్పిరేషన్ గా మిగిలిన హీరో కొణిదెల శివ శంకర్ వరప్రసాద్ అలియాస్ చిరంజీవి అనడంలో ఎటువంటి సందేహం లేదు. సినీ ఇండస్ట్రీలో ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకపోయినా తన స్వయంకృషి తో ఎదిగి మెగాస్టార్ గా నిలిచారు చిరంజీవి. కోట్లాది మంది అభిమానులని సొంతం చేసుకుని మెగాస్టార్ అయ్యారు. తనతో పాటు తన తమ్ముళ్లను కూడా సినీ ఇండస్ట్రీకి పరిచయం చేశారు చిరు.
మెగాస్టా ర్ తమ్ముడిగా సినీ ఇండస్ట్రీ లోకి అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి మూవీ తో ఎంట్రీ ఇచ్చిన పవన్ కళ్యాణ్…ఆ తర్వాత తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్నారు. దశాబ్దాలుగా ఇండస్ట్రీని మహారాజుల ఏలుతున్న పవన్ కు అభిమానులు పవర్ స్టార్ అని ఇష్టంగా పిలుస్తారు. ఇప్పటికీ అదే పవర్తో ఎనర్జీతో కంటిన్యూ అవుతున్న పవర్ స్టార్ హిట్, ఫ్లాప్ తో తేడా లేకుండా ఎప్పటికీ ఎవర్ గ్రీన్ స్టార్ గానే ఉన్నారు.
పవన్ కళ్యాణ్ కేవలం నటుడు గానే కాకుండా సంఘ సేవకుడిగా , రాజకీయవేత్తగా మనందరికీ సుపరిచితుడే. మిగిలిన వారిలా తన చుట్టూ ఏం జరిగితే తనకేంటి నష్టం అనే విధంగా పవన్ ఎప్పుడూ ప్రవర్తించలేదు. ప్రతి ఒక్కరి కష్టం తనదే అని భావించే సున్నిత మనస్కుడు కావడంతో ప్రజల కోసం జనసేన పార్టీని స్థాపించి, జననాయకుడిగా జనంలోకి వెళ్లడానికి సిద్ధపడ్డారు. రీసెంట్గా విడుదలైన పవన్ చిత్రం బ్రో అనూహ్యమైన విజయాన్ని సొంతం చేసుకుంది.ఇవి కాక హరిహర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్, ఓజీ లాంటి క్రేజీ ప్రాజెక్ట్స్ పవన్ లైన్ అప్ లో ఉన్నాయి.
ఈ నేపథ్యంలో చిరంజీవికి సంబంధించిన ఆయన ఫ్యామిలీ రేర్ పిక్ ఒకటి సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తోంది.ఈ పిక్ లో పవన్ అమ్మానాన్న,అన్న చిరంజీవి ,సురేఖ ,చిరు పెద్ద కుమార్తె , అలానే మెగా బ్రదర్ నాగబాబు తో కలిసి ఉండడం విశేషం. దీంతో ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియా మాధ్యమాలలో తెగ వైరల్ అవుతుంది. అంతే గాక ఈ ఫోటో పై కొందరు మెగా అభిమానులు స్పందిస్తూ ఇందులో పవన్ కళ్యాణ్ భలే ఉన్నాడు అని కామెంట్లు పెడుతున్నారు. ఈ పిక్ తీసే సమయానికి పవన్ కళ్యాణ్ ఇంకా సినీ ఫీల్డ్ లోకి ఎంటర్ అయినట్టుగా కనిపించడం లేదు.
