Megastar Chiranjeevi College: తాను చదువుకున్న కాలేజీ కోసం చిరంజీవి చేసిన సహాయం తెలిస్తే చేతులెత్తి దండం పెడుతారు!
రీసెంట్ గా ఆయన చేసిన మరో గొప్ప సహాయం గురించి సోషల్ మీడియా మొత్తం ఎంతో గొప్పగా మాట్లాడుకుంటుంది. అసలు విషయానికి వస్తే కొంతమంది సెలెబ్రిటీలు ఒక హోదా రాగానే తాము పుట్టిన ఊరుని, అక్కడ ఉన్న మనుషులను మర్చిపోతూ ఉంటారు.

Megastar Chiranjeevi College: తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఎవరికీ ఏ సహాయం అవసరమైన నేను ఉన్నాను అంటూ తన దాతృత్వ గుణంతో ఆదుకునే గొప్ప వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి. ఈయన చేసిన సహాయాలు అన్నీ ఇన్నీ కావు, చెప్పుకుంటూ పోతే ఈ ఒక్క రోజు సరిపోదు. ఎంత సంపాదించిన మనతో పాటు చిన్న నూలి పోగు కూడా తీసుకొని పోలేము అనే గొప్ప మాటని అనుసరించే వ్యక్తి మన మెగాస్టార్.
అందుకే సంపాదించిన దాంట్లో ఎంతో కొంత నలుగురికి పంచాలి అనే స్వభావం తో ఉంటాడు చిరంజీవి. అదే తన కుటుంబ సబ్యులకు కూడా నేర్పించాడు.నేడు పవన్ కళ్యాణ్ ఇంత మందికి సహాయపడే గొప్ప అలవాటు చిరంజీవి ని చూసే నేర్చుకున్నాడు. ఆయన చేసిన సహాయాలు గురించి ఎప్పుడూ చెప్పుకోడు, సమయం వచ్చినప్పుడు ఆ సహాయం పొందిన వాళ్ళు పలు ఇంటర్వ్యూస్ లో చెప్తే మనకి తెలియడమే తప్ప, మెగాస్టార్ ఎప్పటికీ తన సహాయాలు గురించి నోరు విప్పడు.
రీసెంట్ గా ఆయన చేసిన మరో గొప్ప సహాయం గురించి సోషల్ మీడియా మొత్తం ఎంతో గొప్పగా మాట్లాడుకుంటుంది. అసలు విషయానికి వస్తే కొంతమంది సెలెబ్రిటీలు ఒక హోదా రాగానే తాము పుట్టిన ఊరుని, అక్కడ ఉన్న మనుషులను మర్చిపోతూ ఉంటారు. కానీ మెగాస్టార్ చిరంజీవి మాత్రం ఎప్పుడు ఆ పని చెయ్యలేదు, తాను చదువుకున్నYN కాలేజీ అభివృద్ధి కోసం చిరంజీవి ఎంపీ గా ఉన్న సమయం లో దాదాపుగా 50 లక్షల రూపాయిలు సహాయం చేసాడట. ఇది స్వయంగా ఆ కాలేజీ చైర్మన్ చెప్పుకొచ్చిన మాట.
అంతే కాదు వ్యక్తిగతంగా కూడా చిరంజీవి గారు ఎంతో సహాయం చేసారని, తన చివరి శ్వాస వరకు ఎలాంటి అవసరం వచ్చినా ఈ కాలేజీ కి సహాయం చేస్తానని మాట ఇచ్చాడట.ఇంత గొప్ప మనసు ఎంతమందికి ఉంటుంది చెప్పండి అంటూ అభిమానులు సోషల్ మీడియా లో మెగాస్టార్ ని పొగుడుతూ పోస్టులు పెడుతున్నారు.
