Waltair Veerayya Review: నటీనటులు :మెగాస్టార్ చిరంజీవి , రవితేజ , శృతి హాస్సన్, క్యాథరిన్ తెరిసా ,ప్రకాష్ రాజ్ , బాబీ సిన్హా, ప్రదీప్ రావత్ , వెన్నెల కిషోర్ , షకలక శంకర్ తదితరులు

chiranjeevi and ravi teja
బ్యానర్ : మైత్రి మూవీ మేకర్స్
డైరెక్టర్ : బాబీ కొల్లి
మ్యూజిక్ డైరెక్టర్ : దేవిశ్రీ ప్రసాద్
సినిమాటోగ్రఫీ :అర్థుర్ A విల్సన్
మెగాస్టార్ చిరంజీవి హీరో గా నటించివున్న ‘వాల్తేరు వీరయ్య’ చిత్రం నేడు భారీ అంచనాల నడుమ ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదలైంది..మెగాస్టార్ మార్క్ కమర్షియల్ ఎంటర్టైనర్ చూసి ఫ్యాన్స్ మరియు ఆడియన్స్ కి చాలా కాలమే అయ్యింది..వింటేజ్ మెగాస్టార్ కామెడీ టైమింగ్ ని కానీ.యాక్టింగ్ ని కానీ నచ్చని మనిషి అంటూ ఉండదు..డైరెక్టర్ బాబీ మెగాస్టార్ లో ఉన్న ఆ టైమింగ్ నే ఈ సినిమాలో బయటకి తీసాను అంటూ మొదటి నుండి చెప్పుకుంటూ వచ్చాడు..మరి అతను చెప్పినట్టే ఫ్యాన్స్ మరియు ఆడియన్స్ ఫీల్ అయ్యారా..?, చాలా కాలం నుండి మెగాస్టార్ రేంజ్ హిట్ కోసం ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ కి ఈ సినిమా సంక్రాంతి కానుక ఇచ్చాడా..అనేది ఇప్పుడు మనం ఈ రివ్యూ లో చూడబోతున్నాము.
కథ :
జాలరి పేటలో ఉండే వీరయ్య(చిరంజీవి) ఆ పేటకు పెద్ద దిక్కులా ఉంటాడు..అతను మాటని పేటలో ఉన్నవాళ్లు వేదవాక్కు గా భావిస్తారు..ఆయన ఏది చెప్తే అదే చేస్తారు..అయితే వీరయ్య తోనే ఉంటూ అతని మనుషులు కొంతమంది వీరక్కి తెలియకుండా డ్రగ్స్ బిజినెస్ చేస్తుంటారు..ఈ విషయం తెలుసుకున్న ఏసీపీ విక్రమ్ సాగర్ (రవితేజ) జాలరి పేటకు వెళ్లి డ్రగ్స్ దందా చేస్తున్న వాళ్ళని అరెస్ట్ చేస్తాడు..వాళ్ళకోసం అడ్డుగా వచ్చిన వీరయ్య ని కూడా అరెస్ట్ చేసి జైలు లో పెడుతాడు విక్రమ్..అయితే చిరంజీవి మరియు రవితేజ ఒకే తండ్రి బిడ్డలు..ఒకరి మీద ఒకరికి అభిమానం ఉన్నప్పటికీ పరిస్థితుల కారణం గా ఇద్దరి మధ్య విభేదాలు ఏర్పడుతాయి..వీరయ్య అలా జైలు లో ఉన్న సమయం లో విక్రమ్ సాగర్ ని విలన్స్ మోసపూరితంగా చంపుతారు..తమ్ముడు విక్రమ్ చనిపోవడానికి అసలైన కారకుడు ప్రకాష్ రాజ్ మలేసియా లో ఉన్నాడని తెలుసుకొని అక్కడికి వెళ్తాడు వీరయ్య..తర్వాత ఏమి జరిగింది అనేదే స్టోరీ.
విశ్లేషణ :
డైరెక్టర్ బాబీ మొదటి నుండి ఏదైతే చెప్తూ వచ్చాడో,అదే ఈ సినిమాలో కూడా చూపించాడు..వింటేజ్ మెగాస్టార్ ని బయటకి తీసాడు..ఆయనలోని కామెడీ టైమింగ్ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించింది..ఎంత కామెడీ అయితే చేయించాడో..ఎమోషనల్ సన్నివేశాల్లో చిరంజీవిలో నట విశ్వరూపం ని మరోసారి బయటకి తీసాడు..ఇక మెగాస్టార్ సినిమా అంటే పూనకం వచ్చినట్టు ఊగిపోయి అదిరిపొయ్యే మ్యూజిక్ ఇచ్చే దేవి శ్రీప్రసాద్ ఈ సినిమా కోసం కూడా అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చాడు..సాంగ్స్ అదిరిపోయాయి..బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ విషయం లో కూడా తన పనితనం ఏంటో చూపించాడు..ఇక మాస్ మహారాజ రవితేజ పాత్ర ఎంట్రీ సెకండ్ హాఫ్ లో ఉంటుంది..చిరంజీవి మరియు రవితేజ మధ్య వచ్చే సన్నివేశాలన్నీ ఫ్యామిలీ ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అవుతాయి..రవితేజ పాత్ర చిన్నదే అయినా ఆడియన్స్ బాగా కనెక్ట్ అయ్యేవిధంగా పవర్ ఫుల్ గా చూపించాడు డైరెక్టర్ బాబీ.

chiranjeevi
ఇక శృతి హాసన్ కూడా సీబీఐ ఆఫీసర్ గా తన పరిధిమేర నటించింది..ప్రకాష్ రాజ్, బాబీ సింహా అందరూ బాగా నటించారు..మొత్తానికి సంక్రాంతికి ఎలాంటి సినిమాని అయితే ఆడియన్స్ కోరుకుంటారో అలాంటి సినిమానే ఇచ్చాడు మెగాస్టార్..ఫ్యాన్స్ కి పూనకాలే..ఆడియన్స్ కి కూడా నచ్చేస్తుంది..ఇక ఫ్యామిలీ ఆడియన్స్ అయితే ఈ సినిమాకి బ్రహ్మరథం పట్టేస్తారు..ఒక పర్ఫెక్ట్ కమర్షియల్ సినిమాని అభిమానుల జోబులో పెట్టాడు మెగాస్టార్..ఇక ఆడియన్స్ దానిని ఏ రేంజ్ కి తీసుకెళ్లారో చూడాలి.
చివరి మాట : అభిమానులకు పండుగా లాంటి సినిమా..కమర్షియల్ సినిమాలను నచ్చే ఆడియన్స్ కి ఈ సినిమా భుక్తాయాసం వచ్చేలా చేస్తుంది..ఈ సంక్రాంతి మెగాస్టార్ చిరంజీవిదే.
రేటింగ్ : 3/5