Chiranjeevi 156 project : మెగా 156 టైటిల్ లీక్.. కథ ఎలా ఉంటుందో రివీల్.. గూస్ బాంబ్ ఖాయమట…

ఇప్పటికే ఈ సినిమా మీద చిరంజీవి అభిమానులు భారీ ఎత్తున అంచనాలు పెట్టుకున్నారు ఇక దానికి తోడుగా డైరెక్టర్ వశిష్ట కూడా ఈ సినిమా పైన అభిమానులు ఎన్ని అంచనాలు పెట్టుకున్న దానికి మించి సినిమా ఉండబోతుంది అన్నట్టుగా సినిమాకు సంబంధించిన హైప్ ని పెంచేశాడు

  • Written By: NARESH
  • Published On:
Chiranjeevi 156 project : మెగా 156 టైటిల్ లీక్.. కథ ఎలా ఉంటుందో రివీల్.. గూస్ బాంబ్ ఖాయమట…

Chiranjeevi 156 project : మెగాస్టార్ చిరంజీవి డైరెక్టర్ వశిష్ట కాంబినేషన్ లో వస్తున్న చిరంజీవి 156 ప్రాజెక్ట్ ని చిరంజీవి బర్త్ డే సందర్భంగా అనౌన్స్ చేశారు. ఇక అందులో భాగంగానే చిరంజీవి ఈ సినిమా పనుల్లో బిజీగా ఉన్నట్టు గా తెలుస్తుంది…ఇక ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించిన అప్డేట్ రోజుకి ఒకటి వస్తూనే ఉంది. అందులో భాగంగానే ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ అలాగే స్క్రిప్ట్ పేపర్స్ లీక్ అయినట్టుగా సోషల్ మీడియాలో ఒక వార్త భారీ ఎత్తున హల్చల్ చేస్తుంది. అందులో భాగంగానే ఈ సినిమాకి విశ్వంభర అనే టైటిల్ ని ఫిక్స్ చేసినట్టుగా తెలుస్తుంది. అయితే ఈ సినిమాని యూవీ క్రియేషన్స్ వారు నిర్మిస్తున్నాడు విశేషం…

ఇప్పటికే ఈ సినిమా మీద చిరంజీవి అభిమానులు భారీ ఎత్తున అంచనాలు పెట్టుకున్నారు ఇక దానికి తోడుగా డైరెక్టర్ వశిష్ట కూడా ఈ సినిమా పైన అభిమానులు ఎన్ని అంచనాలు పెట్టుకున్న దానికి మించి సినిమా ఉండబోతుంది అన్నట్టుగా సినిమాకు సంబంధించిన హైప్ ని పెంచేశాడు.ఇక అందులో భాగంగానే సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ కూడా శరవేగంగా జరుగుతున్నాయి ఇక ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి లావణ్య వరుణ్ తేజ్ పెళ్లి సంబంధించి కొంచెం బిజీగా ఉన్న విషయం మనకు తెలిసిందే…

ఇక దానికి తోడుగా రీసెంట్ గా చిరంజీవికి మోకాలు సర్జరీ కూడా జరిగింది అందులో భాగంగానే ఆయన రెస్ట్ తీసుకుంటూ అటు వరుణ్ తేజ్ పెళ్లి పనులను చూసుకుంటూ తను చాలా బిజీగా గడుపుతున్నాడు.ఇక ఈ క్రమంలోనే చిరంజీవి వశిష్ట కాంబినేషన్ లో చేస్తున్న సినిమా తొందరలోనే సెట్స్ మీద తీసుకెళ్లాలని ప్లాన్ చేస్తున్నాడు ఇక అందులో భాగంగానే చిరంజీవి ఈ సినిమాతో ఒక భారీ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టబోతున్నాడనే సూచనలైతే కనిపిస్తున్నాయి. రీసెంట్ గా బాలయ్య బాబు సైతం భగవంత్ కేసరి అనే సినిమాలో తన ఏజ్ కి తగ్గ పాత్రలో కనిపించాడు ఇక అందులో భాగంగా చిరంజీవి కూడా ఈ సినిమాలో తన ఏజ్ కి తగ్గ పాత్రలో నటించబోతున్నట్టుగా తెలుస్తుంది.ఇక ఈ సినిమాని చిరంజీవి వీలైనంత తోందరగా సెట్స్ మీదకి ఎక్కించబోతున్నాడని తెలుస్తుంది.

ఇలాంటి క్రమంలోనే చిరంజీవి వరుస సినిమాలను చేస్తూ యంగ్ హీరోలకు సైతం పోటీ ఇస్తూ వరుసగా బ్లాక్ బస్టర్ హిట్స్ ని కొట్టాలనే ఉద్దేశ్యం తో ఈ సినిమా మీద ఎక్కువ ఫోకస్ చేసినట్టుగా తెలుస్తుంది. ఇంకా ఈ సినిమాకి కీరవాణి మ్యూజిక్ అందిస్తున్నాడు. వశిష్ట ఫస్ట్ సినిమా అయిన బింబిసార సినిమాకి కూడా మ్యూజిక్ డైరెక్టర్ గా కీరవాణి పని చేశాడు.ఇక ఈ సినిమా టైం లో వీళ్లిద్దరి మధ్య మంచి రాపో కుదరడం తో ఈ సినిమాకి కూడా ఆయననే తీసుకున్నారు…

Read Today's Latest Tollywood News, Telugu News LIVE Updates on Oktelugu
oktelugu whatsapp channel
follow us
  • facebook
  • instagram
  • twitter
  • youtube

సంబంధిత వార్తలు