చిరు మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్?

కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి-152వ సినిమా చేస్తున్న సంగతి తెల్సిందే. గతేడాది దసరా రోజున ఈ మూవీ షూటింగ్ ప్రారంభమైంది. అయితే కొన్నినెలలు గ్యాప్ తర్వాత ఇటీవలే మెగాస్టార్ మూవీ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఈ మూవీకి సంబంధించిన ఒక న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఈ మూవీ తొలుత 2020 దసరా కానుకగా విడుదల చేయాలనుకున్నారు. ఇటీవల ‘సరిలేరునికెవ్వరు’ ప్రీరిలీజ్ ఫంక్షన్లో చిరంజీవికి కొరటాల శివ 90రోజుల్లో మూవీ కాంప్లీట్ చేస్తానని […]

  • Written By: Neelambaram
  • Published On:
చిరు మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్?

కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి-152వ సినిమా చేస్తున్న సంగతి తెల్సిందే. గతేడాది దసరా రోజున ఈ మూవీ షూటింగ్ ప్రారంభమైంది. అయితే కొన్నినెలలు గ్యాప్ తర్వాత ఇటీవలే మెగాస్టార్ మూవీ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఈ మూవీకి సంబంధించిన ఒక న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఈ మూవీ తొలుత 2020 దసరా కానుకగా విడుదల చేయాలనుకున్నారు. ఇటీవల ‘సరిలేరునికెవ్వరు’ ప్రీరిలీజ్ ఫంక్షన్లో చిరంజీవికి కొరటాల శివ 90రోజుల్లో మూవీ కాంప్లీట్ చేస్తానని హామీ ఇచ్చారు. దీంతో ఈ మూవీని వీలైనంత త్వరగా కాంప్లీట్ చేసేందుకు సన్నహాలు చేస్తున్నారు.

ఈ మూవీలో మెగాస్టార్ డ్యూయల్ రోల్ చేస్తున్నారు. ఇప్పటికే చిరంజీవిని మునుపటి మెగాస్టార్ల చూపేందుకు కొరటాల శివ గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. మెగాస్టార్ అభిమానులకు దృష్టిలో ఉంచుకొని సాంగ్స్, ఫైట్స్, డైలాగ్స్ అన్ని అంశాలను టచ్ చేస్తూ సామాజిక అంశంతో మూవీని తెరకెక్కిస్తున్నాడు. చిరంజీవికి జోడీగా సీనియర్ నటి త్రిష నటిస్తుంది. గతంలో మెగాస్టార్ నటించిన స్టాలీన్ మూవీలో త్రిష నటించింది. వీరిద్దరి కాంబినేషన్లలో ఇది రెండో చిత్రం. చిరంజీవి-రెజీనాలపై ఓ స్పెషల్ ఐటమ్ సాంగ్ రామోజీ ఫిల్మ్ సీటీలో షూట్ చేశారు. తెలుగమ్మాయి ఈషారెబ్బా ఓ కీలక పాత్రలో కనిపించనుంది.

ఇప్పటికే షూటింగ్ 70శాతం మేర పూర్తయినట్లు తెలుస్తోంది. చిరంజీవి, ఇతర నటీనటుల పాత్రలకు షూటింగ్ త్వరలో పూర్తి కానుంది. ‘ఆర్ఆర్ఆర్’ మూవీలో రాంచరణ్ షూటింగ్లో బీజీగా ఉండటంతో ఈ మూవీ నుంచి తప్పుకున్నట్లు సమాచారం. రాంచరణ్ స్థానంలో సూపర్ స్టార్ మహేష్ బాబు లేదా అల్లు అర్జున్ నటిస్తారని ప్రచారం జరుగుతుంది. వీరిలో ఎవరో ఒకరు ఫైనల్ అయ్యాక చిత్రం తుదిదశకు చేరుకోనుంది. ఆ తర్వాత పోస్టు ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకోనుంది. ఈ చిత్రానికి ‘ఆచార్య’ అనే టైటిల్ ఖరారైనట్లు తెలుస్తోంది.

అన్ని అనునున్నట్లు జరిగితే చిరంజీవి పుట్టిన రోజుకు ఒక రోజు ముందుగానే అంటే ఆగస్టు 21న సినిమా ప్రేక్షకుల ముదుకు రావడం ఖాయంగా కన్పిస్తుంది.

సంబంధిత వార్తలు