India–China dispute: మాయలమారి డ్రాగన్ కుట్రలకు తెరలేపుతోంది. తన కుయుక్తులు నెరవేర్చుకునే క్రమంలో దాయాది దేశాలను వివాదాల్లోకి లాగేందుకు కుట్రలు పన్నుతోంది. ఇందులో భాగంగా చైనా మరో పన్నాగం పన్నింది. నూతన సరిహద్దు చట్టం పేరుతో భారత్ ను ఇరుకున పెట్టాలని చూస్తోంది. ఇందుకు గాను నూతన చట్టం రూపొందించి దాన్ని జనవరిలో అమలులోకి తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది. శాంతి స్థాపన కోసమే అని బుకాయిస్తూ భారత్ సార్వభౌమత్వాన్ని నాశనం చేసే విధంగా ప్రవర్తించేందుకు పావులు కదుపుతోంది.
చైనా 14 దేశాలతో అంతర్జాతీయ భూ సరిహద్దులు కలిగి ఉంది. 12 దేశాలతో వివాదాలే ఉన్నాయి. దీంతో చైనా బుద్ధి ఏమిటో ఇట్టే అర్థమవుతోంది. ఇండియా, భూటాన్ దేశాలతో మాత్రం వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇండియాలో అరుణాచల్ ప్రదేశ్ నుంచి జమ్ముకశ్మీర్ వరకు దాదాపు 3488 కిలోమీటర్ల మేర సరిహద్దు పంచుకుంటోంది. ఈ నేపథ్యంలో డ్రాగన్ కుట్రపూరిత విధానాలతో ఇతర దేశాలను భయపెట్టాలని చూస్తోంది.
గల్వాన్ లో జరిగిన ఘర్షణల నేపథ్యంలో ఇరు దేశాల మధ్య వివాదాలు పెరిగాయి. పలుమార్లు చర్చలు జరిగినా సఫలం కాలేదు. దీంతో రెండు దేశాల మధ్య అగాధం పెరిగిపోయింది. ప్రాదేశిక సమగ్రతకు భంగం కలుగుతోంది. అయినా రెండు దేశాల మధ్య ప్రాంతీయ గొడవలు చెలరేగుతున్నాయ. భారత్ కూడా ధీటుగా స్పందించడంతో డ్రాగన్ కుట్రలు నెరవేరడం లేదు. ఈ నేపథ్యంలో చైనా పలు కోణాల్లో కుట్రలు తెరమీదకు తీసుకొస్తోంది.
Also Read: నవంబర్ నెలలో బ్యాంకులకు 17 రోజులు సెలవులా.. అసలు నిజమేంటంటే?
చైనా తెచ్చిన కొత్త చట్టంతో భారత్ కు వచ్చే బ్రహ్మపుత్ర నదీ జలాల్ని రాకుండా చేయడానికి ప్రయత్నాలు చేస్తోంది. దీంతో భారత్ కు భవిష్యత్ లో మరింత ప్రమాదం ఏర్పడే అవకాశముంది. ప్రస్తుత పరిణామాలు భారత, చైనా మధ్య వివాదాలు పెరిగే సూచనలు ఎక్కువ కానుంది. ఈ నేపథ్యంలో డ్రాగన్ కుట్రలతో ఇండియా కష్టాల బారిన పడే పెను ప్రమాదం పొంచి ఉంది.
Also Read: కరోనాతో 30 రోజుల్లో మరణిస్తే పరిహారం.. ఈ పరిహారాన్ని ఎలా పొందాలంటే?