Chandrababu Arrest: చంద్రబాబు అరెస్టుపై.. విజయసాయిరెడ్డి మనుమల నిరసన
చంద్రబాబు తనకు సోదరుడితో సమానమని ఓసారి విజయ్ సాయి రెడ్డి చెప్పుకొచ్చారు. నందమూరి వారసుడు తారకరత్న. చంద్రబాబుకు స్వయానా మేనల్లుడు. అటు విజయసాయి రెడ్డికి అల్లుడు కూడా.

Chandrababu Arrest: చంద్రబాబు అరెస్ట్ పై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి బాధపడుతున్నారా? అక్రమ అరెస్టు అని భావిస్తున్నారా? బాబు నిరపరాధని బలంగా నమ్ముతున్నారా? అంటే అవుననే అనుమానం వ్యక్తం అవుతోంది. ఆ మధ్యన తారకరత్న అకాల మరణం సమయంలో చంద్రబాబుతో విజయసాయిరెడ్డి సన్నిహితంగా గడిపారు. అది వైసిపి నాయకత్వానికి ఆగ్రహం తెప్పించిందని అప్పట్లో ప్రచారం జరిగింది. అందుకు తగ్గట్టుగానే విజయ సాయి రెడ్డి వ్యవహార శైలి నడిచింది. అటు వైసీపీ శ్రేణులు సైతం విజయ సాయి రెడ్డిని పెద్దగా పట్టించుకోలేదు. తాజాగా విజయసాయి యాక్టివ్ అయినా.. ఆయనపై అనుమానం కలిగేలా ఓ ఘటన చోటుచేసుకుంది.
చంద్రబాబు తనకు సోదరుడితో సమానమని ఓసారి విజయ్ సాయి రెడ్డి చెప్పుకొచ్చారు. నందమూరి వారసుడు తారకరత్న. చంద్రబాబుకు స్వయానా మేనల్లుడు. అటు విజయసాయి రెడ్డికి అల్లుడు కూడా. విజయసాయి భార్య సోదరి కుమార్తయే తారకరత్న భార్య. దీంతో తారకరత్న అకాల మరణం సమయంలో అటు చంద్రబాబు, ఇటు విజయసాయి ఆ కుటుంబానికి పెద్ద దిక్కుగా నిలిచారు. పెద్దకర్మ జరిగే వరకూ సన్నిహితంగా మెలిగేవారు. చివరివరకు ఆ కుటుంబానికి తాను అండగా ఉంటానని విజయ సాయి ప్రకటించారు.
చంద్రబాబు ప్రస్తుతం జైల్లో ఉన్నారు. తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర ప్రాంతాల్లో సైతం ప్రజలు సంఘీభావం తెలుపుతున్నారు. విదేశాల్లో సైతం చంద్రబాబుకు మద్దతుగా నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి. సరిగ్గా ఇదే సమయంలో తారకరత్న ముగ్గురు పిల్లలు చంద్రబాబు అరెస్టుపై నిరసన వ్యక్తం చేయడం విశేషం. ప్లకార్డులు ప్రదర్శిస్తూ చంద్రబాబుది అక్రమ అరెస్టు అంటూ ఆ ముగ్గురు చిన్నారులు నిరసన చేపట్టడం ఆకట్టుకుంటోంది. సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
అయితే విజయసాయి అనుమతి లేకుండా ఆ పిల్లలు అలా చేస్తారా అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. తారకరత్న చనిపోయే నాటికి తల్లిదండ్రులతో సంబంధాలు లేవని వార్తలు వచ్చాయి. ప్రస్తుతం తారకరత్న భార్య ముగ్గురు పిల్లలతో ఉంటున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఆ కుటుంబానికి పెద్దదిక్కుగా ఉన్న విజయసాయి రెడ్డి అనుమతి లేకుండా పిల్లలు నిరసన తెలుపుతారా? అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. అయితే అందులో ఏముంది అని? రాజకీయాలు వేరు. బంధుత్వం వేరు.. అన్న ప్రశ్న తలెత్తుతోంది. తారకరత్న బతికున్న సమయంలోనే తెలుగుదేశం పార్టీలో యాక్టివ్ గా ఉండేవారు. ఆ లెక్కన పిల్లలు చంద్రబాబు అరెస్ట్ పై స్పందించారని.. దానిని లైట్ తీసుకోవాల్సిన అవసరం ఉందని నేటిజెన్లు కామెంట్ పెడుతున్నారు. అయితే ఏ విషయంలోనైనా నెగిటివ్ గా ఆలోచించే వైసీపీ శ్రేణులు.. ఈ విషయంలో ఎలా రియాక్ట్ అవుతాయో చూడాలి మరి.
