Invalid Marriages : వివాహేతర సంతానానికీ ఆస్తిలో వాటా: సుప్రీం కీలక తీర్పు

ఇక మొదటి భర్త చనిపోయి రెండో భర్తను చేసుకొని పుట్టిన సంతానానికి కూడా మొదటి భర్త ఆస్తి విషయంలో దక్కడం లేదు. దీనిపైనే సుప్రీంకోర్టు చారిత్రక తీర్పునిచ్చింది. 

  • Written By: Bhaskar
  • Published On:
Invalid Marriages : వివాహేతర సంతానానికీ ఆస్తిలో వాటా: సుప్రీం కీలక తీర్పు

Invalid Marriages : వర్షం సినిమా చూశారా? అందులో గోపిచంద్‌ తన తండ్రిని చంపుతాడు. ఎందుకుంటే గోపిచంద్‌ తల్లి చనిపోగానే.. మరో మహిళకు అతడి తండ్రి దగ్గరవుతాడు. అతడికి ఓ కొడుకు పుడతాడు. అతడికి కూడా ఆస్తిలో వాటా ఇస్తానని చెబుతాడు. కానీ అది నచ్చని గోపిచంద్‌ ‘ఉంచుకున్న దాని కొడుకు నేను ఒకటేనా’ అంటూ తండ్రిని చంపేస్తాడు. ఆ సినిమా మాత్రమే కాదు ఇటీవల వచ్చిన పుష్పలో కూడా అదే పరిస్థితి కదా! అందలో ఓ వ్యక్తి మొదటి భార్య కొడుకు.. తన తండ్రికి దగ్గరయిన మరో మహిళకు పుట్టిన కొడుకును తమ్ముడిగా అంగీకరించడు. మహాభారతం నుంచి నేటి మన సమాజం వరకు వివా హేతర సంబంధాల ద్వారా జన్మించిన సంతానానికి పెద్దగా గుర్తింపు ఉండదు. అయితే వీరికి సంబంధించి శుక్రవారం సుప్రీం కోర్టు ఓ సంచలన తీర్పు చెప్పింది.

-ఇలా పిల్లలను కన్న సంతానానికి ఆస్తి వాటా దక్కుతుందా?
సమాజంలో ఇప్పుడు సహజీవనం ట్రెండింగ్ మారింది. పెళ్లి చేసుకోకుండానే పిల్లలను కనేస్తున్నారు. వీరి సంతానానికి వారి కుటుంబం వారసులుగా అంగీకరించడం లేదు. ఇక వివాహేతర సంబంధాలు పెట్టుకున్న సంతానానికి ఆస్తిలో వాటా దక్కడం లేదు. ఇక మొదటి భర్త చనిపోయి రెండో భర్తను చేసుకొని పుట్టిన సంతానానికి కూడా మొదటి భర్త ఆస్తి విషయంలో దక్కడం లేదు. దీనిపైనే సుప్రీంకోర్టు చారిత్రక తీర్పునిచ్చింది. 

వివాహేతర సంబంధం ద్వారా జన్మించిన సంతానానికి హిందూ చట్టాల ప్రకారం.. తల్లిదండ్రుల పూర్వీకుల ఆస్తిలో వాటా ఉంటుదా లేదా అనే అంశంపై దాఖలైన పిటిషన్‌పై సుప్రీం కోర్టు శుక్రవారం కీలక తీర్పు వెలువరించింది. చెల్లుబాటు కాని.. లేదా రద్దు చేయగలిగే వివాహాల ద్వారా పుట్టిన పిల్లలు చట్టబద్ధమైన వారసులేనని కోర్టు తెలిపింది. అందు వల్ల హిందూ వారసత్వ చట్టం కింద హిందూ అవిభాజ్య కుటుంబం లో తల్లిదండ్రులకు వచ్చే పూర్వీకుల ఆస్తిలో ఈ పిల్లలు కూడా వాటా పొందేందుకు హక్కు ఉంటుందని స్పష్టం చేసింది.

2011 నుంచి పెండింగ్‌లో ఉన్న ఈ అభ్యర్థనపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీ.వై చంద్రచూడ్‌ నేతృత్వంలోని ధర్మాసనం ఇటీవల విచారణ జరిపింది. చెల్లుబాటు కాని.. లేదా రద్దు చేయదగిన వివాహాల నుంచి పుట్టిన పిల్లలకు తల్లిదండ్రుల ఆస్తిలో హక్కు ఉంటుందని నిబంధనలు స్పష్టం చేస్తున్నాయని ధర్మాసనం ప్రకటించింది. అయితే, అలాంటి సంతతికి తల్లిదండ్రుల పూర్వీకుల ఆస్తిలో వాటా ఉండకూడదంటూ గతంలో సుప్రీం కోర్టు వ్యక్తం చేసిన అభిప్రాయాలలో ఇప్పటి సుప్రీం కోర్టు ధర్మాసనం విభేదించింది. చెల్లుబాటు కాని.. లేదా రద్దు చేయదగిన వివాహాల ద్వారా పుట్టిన సంతానానికి..తల్లిదండ్రులకు వారి పూర్వీకుల ద్వారా వచ్చిన వారసత్వ ఆస్తిలో వాటా పొందే హక్కు ఉంటుందని వెల్లడించింది.

ఈ వివాహేతర సంబంధానికి ఇప్పటికీ మన సమాజంలో ఆస్తి వాటా ఇవ్వడం లేదు. వారిని అసృశ్యులుగానే చూస్తున్నారు. ఎన్ని చట్టాలు చేసినా.. ఎంత మంది చెప్పినా వారికి వాటాలు మాత్రం దక్కడం లేదు. సినిమాల్లోనే కాదు.. నిజజీవితంలోనూ అదే కథ. అందుకే సుప్రీంకోర్టు దీనిపై విస్పష్టమైన తీర్పునిచ్చింది. వివాహేతర సంతనానికి కూడా ఆస్తిలో వాటా కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది.

Read Today's Latest National politics News, Telugu News LIVE Updates on Oktelugu
oktelugu whatsapp channel
follow us
  • facebook
  • instagram
  • twitter
  • youtube

సంబంధిత వార్తలు