Chandrababu: చంద్రబాబు క్విడ్ ప్రోకో ఆరోపణలు.. సీఐడీ విచారణలో ఆ అంశమే కీలకం..
వైసీపీ ప్రభుత్వం అమరావతి విషయంలో చేపట్టిన ప్రతి విషయంలోను న్యాయపరమైన అడ్డంకులు వస్తున్నాయి. టీడీపీ ప్రభుత్వం ఏర్పడ్డాక అమరావతిని కొనసాగిస్తామని చెబుతున్నారు.

Chandrababu: వైసీపీ ప్రభుత్వం వచ్చిన మొదట్లో టీడీపీ హయాంలో జరిగిన క్విడ్ ప్రోకోపైనే ముఖ్యంగా దృష్టి పెట్టింది. అనధికార కట్టడాలను తొలగిస్తామని చెప్పి ముందుగా కృష్ణా కరకట్టపై చంద్రబాబు నిర్మించుకున్న బంగ్లాను కూల్చివేసింది. ఇది వ్యాపారవేత్త లింగమనేని రమేష్ కు చెందినది. ఆయన అనధికారికంగా నిర్మించుకున్న ఆ బంగ్లాలో చంద్రబాబు నివాసం ఎలా ఉంటారని వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఈ వ్యవహారం హాట్ టాపిగ్గా మారింది. సీఐడీ అధికారులు క్విడ్ ప్రోకోకు పాల్పడినట్లు నిరూపించేందుకు అవసరమైన సాక్ష్యాలను సేకరించేపనిలో పడ్డారు.
అమరావతి సిటీ ప్లాన్ లోనూ, ఇన్నర్ రింగు రోడ్డు అలైన్ మెంట్లలో టీడీపీ ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడిందన్నది ప్రధాన ఆరోపణ. వైసీపీ ప్రభుత్వం హడావుడిగా ఎన్నికలకు అతికొద్ది సమయం ఉన్నప్పుడు ఈ వ్యవహారంపై రాష్ట్ర స్థాయిలో చర్చలు జరిగేలా చేయడం వెను వ్యూహాంపై పలువురు భిన్న వాదనలు వినిపిస్తున్నారు. అమరావతిలో పేదలకు ఇళ్ల కేటాయింపునకు వైసీపీ ప్రభుత్వం పూనుకుంది. దీనిపై కొన్ని రోజులుగా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. విషయం హై కోర్టు వరకు చేరడంపై టీడీపీ నేతల హస్తం ఉందని వైసీపీ నేతలు చెబుతున్నారు.
వైసీపీ ప్రభుత్వం అమరావతి విషయంలో చేపట్టిన ప్రతి విషయంలోను న్యాయపరమైన అడ్డంకులు వస్తున్నాయి. టీడీపీ ప్రభుత్వం ఏర్పడ్డాక అమరావతిని కొనసాగిస్తామని చెబుతున్నారు. ఇందుకు వైసీపీ ప్రభుత్వం ఒప్పుకోవడం లేదు. విశాఖను రాజధాని చేయాలని చూస్తున్నారు. అమరావతి ప్రాంతంలో నెలకొన్న వైసీపీ వ్యతిరేకతను అణగదొక్కేందుకు ఆ పార్టీ నేతలు మొదటి నుంచి శతవిధాల ప్రయత్నిస్తున్నారు. ఇందుకు టీడీపీ నేతలను నిలవరించడం ప్రథమ కర్తవ్యంగా వైసీపీ భావించి ఉండొచ్చు.
తాజాగా, సీఐడీ అధికారులు అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబును, మంత్రి నారాయణ 1994 చట్టాన్ని అతిక్రమించారని అభియోగం మోపింది. ఇన్నర్ రింగు రోడ్డు ప్లాన్ ను మార్చివేశారని వైసీపీ అధికార సాక్షి పత్రికలో బ్యానర్ వార్తగా ప్రచురించింది. లింగమనేని రమేష్ కు లబ్ది చేకూరేలా నిర్ణయాలు తీసుకున్నారంటూ ఆ వార్త ప్రధాన సారాంశం. ఇందులో జనసేన నేత పవన్ కల్యాణ్ ను కూడా చేర్చి ఆరోపణలు చేశారు. అతి తక్కువ ధరకు భూములు పవన్ కల్యాణ్ కు అప్పగించి 2.4 ఎకరాలను అప్పగించినట్లు సాక్షి పత్రిక పేర్కొంది.
మొత్తంగా టీడీపీ హయాంలో అమరావతిలో భూముల వ్యాపారం దర్జాగా సాగిందని నిరూపించేందుకు వైసీపీ నేతలు తాపత్రయపడుతున్నారు. వైసీపీపై రాష్ట్రంలో పెరుగుతున్న వ్యతిరేకతను కప్పి పుచ్చుకునేందుకు రకరకాలుగా ప్రయత్నాలు చేస్తున్నది. రాబోవు ఎన్నికల్లో తెలుగు దేశం పార్టీ నేతలు క్విడ్ ప్రోకోకు పాల్పడ్డారనే అంశాన్ని ఒక ఆయుధంగా మార్చుకునే అవకాశాలు లేకపోలేదు. కాగా, సీఆర్డీఏ రూపొందించిన అలైన్ మెంట్ మార్పు అనుమతి తీసుకున్నాకే చేశారా లేదా ముందే చేశారా అన్నది తేలాల్సి ఉంది.
