Chandrababu Jail : చంద్రబాబుకు జైలు జీవితం ఇంకెన్నాళ్లు? వచ్చే ఎన్నికల్లో టీడీపీ పరిస్థితేంటి?
ఆదివారం సాయంత్రం విచారణ అనంతరం చంద్రబాబును సిఐడి అధికారులు న్యాయస్థానం ముందుహాజరు పరచనున్నారు. అయితే ఇప్పుడు చంద్రబాబు విచారణ కీలక అంశంగా మారనుంది.

Chandrababu Jail: ఈ పరిస్థితిని చంద్రబాబు ఊహించి ఉండరు. ఆయనకు రిమాండ్ విధించి దాదాపు పక్షం రోజులు సమీపిస్తుంది. కోర్టు తీర్పులు ప్రతికూలంగా వస్తున్నాయి. జైలు నుంచి విముక్తి ఎప్పుడు లభిస్తుందో తెలియడం లేదు. సిఐడి మోపిన కేసుల నుంచి శాశ్వతంగా విముక్తి పొందాలని వేసిన క్వాష్ పిటిషన్ హైకోర్టు కొట్టేసింది. రెండు రోజుల పాటు రిమాండ్ ను పొడిగించింది. అటు ఏసీబీ కోర్టు చంద్రబాబును రెండు రోజులపాటు సిఐడి కస్టడీకి అనుమతి ఇచ్చింది. శని, ఆదివారాల్లో చంద్రబాబును సిఐడి విచారించనుంది. ఇలా వరుసగా షాక్ ల మీద షాక్ లు చంద్రబాబుకు తగులుతున్నాయి.
ఆదివారం సాయంత్రం విచారణ అనంతరం చంద్రబాబును సిఐడి అధికారులు న్యాయస్థానం ముందుహాజరు పరచనున్నారు. అయితే ఇప్పుడు చంద్రబాబు విచారణ కీలక అంశంగా మారనుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో చంద్రబాబు బయటపడడం ఎలా? ఆయన ముందున్న ఆప్షన్స్ ఏంటి? అనేది ప్రశ్నార్థకంగా మారింది. అయితే ఈ కేసు విషయంలో చంద్రబాబు సుప్రీంకోర్టు ఆశ్రాయించానున్నట్టు తెలుస్తోంది.ఏపీ హైకోర్టు, ఏసీబీ కోర్టులో వరుసగా ఇబ్బందులు ఎదురైన నేపథ్యంలో చంద్రబాబు తరపు న్యాయవాదులు సుప్రీంకోర్టుకు వెళ్లాలని భావిస్తున్నట్లు సమాచారం.
వాస్తవానికి హైకోర్టు క్వాష్ పిటిషన్ కొట్టివేసిన నేపథ్యంలో.. వేనువెంటనే సుప్రీంకోర్టును ఆశ్రయిస్తారని ప్రచారం జరిగింది. అయితే సుప్రీంకోర్టులో క్వాష్ పిటిషన్ వేయాలా? లేకుంటే బెయిల్ పిటిషన్ దాఖలు చేయాలా? అని ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే లోకేష్ ఢిల్లీలో ఉన్నారు. పలువురు న్యాయ కోవిదులతో సుమాలోచనలు జరుగుతున్నట్లు సమాచారం. వారిచ్చే సలహాలు, సూచనలతో ముందుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.
ఆది నుంచి స్కిల్ డెవలప్మెంట్ స్కాం కేసులో చంద్రబాబుకు సంబంధం లేదని ఆయన తరుపు న్యాయవాదులు వాదిస్తూ వచ్చారు. కనీస ఆధారాలు లేవని.. అరెస్టు సమయంలో నిబంధనలు పాటించలేదని వాదించారు. అయినా సరే ఏసీబీ కోర్టు, హైకోర్టులో చుక్కెదురైంది. ఈ తరుణంలో సుప్రీంకోర్టులో ఎటువంటి తీర్పు వస్తుందోనన్న బెంగ వెంటాడుతోంది. అయితే పరిస్థితి ఎలా ఉన్నా.. సుప్రీం కోర్టుకు వెళ్లాలని స్ట్రాంగ్ గా డిసైడ్ అయినట్లు సమాచారం. సోమవారం అత్యున్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేసే పరిస్థితులు కనిపిస్తున్నాయి. మరోవైపు సోమవారం ఏసీబీ కోర్టులో చంద్రబాబు బెయిల్ పిటిషన్ విచారణకు రానుంది. ఈ పరిణామాల క్రమంలో చంద్రబాబు మరికొద్ది రోజులు జైలు జీవితం గడపాల్సి ఉంటుందని వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. వచ్చే ఎన్నికల వరకైనా చంద్రబాబు బయటకు రావాలని కోరుతున్నారు. అప్పటివరకూ టీడీపీ పరిస్థితి ఏంటని అందరూ ఆందోళన చెందుతున్నారు.
