Chandrababu : చంద్రబాబు నోట.. ‘అర్థమైందా రాజా’?

అర్థమైందా సైకో జగన్ రెడ్డి.. అంటూ చంద్రబాబు చెప్పిన డైలాగ్ తో ప్రాంగణం మార్మోగిపోయింది. ఇప్పుడు చంద్రబాబు కామెంట్స్ ని టిడిపి సోషల్ మీడియా ట్రోల్ చేస్తుంది.

  • Written By: NARESH ENNAM
  • Published On:
Chandrababu : చంద్రబాబు నోట.. ‘అర్థమైందా రాజా’?

Chandrababu : ఇటీవల చంద్రబాబు ప్రసంగ శైలి మారుతోంది. సినిమా డైలాగులతో మాట్లాడుతున్నారు. స్థానిక పరిస్థితులకు అనుగుణంగా కామెంట్స్ చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు. ఎలక్షన్ సమీపిస్తుండడంతో విమర్శలకు పదును పెడుతున్నారు. ఇవి ప్రజల్లోకి బలంగా వెళుతున్నాయి.

మొన్న ఆ మధ్యన రజనీకాంత్ నటించిన జైలర్ సినిమా విడుదలైన సంగతి తెలిసిందే. ఆ సినిమాకి సంబంధించిన ఫంక్షన్ లో రజనీకాంత్ కామెంట్స్ వైరల్ గా మారాయి. ఏపీలో బాగా పాపులర్ అయ్యాయి ” మొరగని కుక్క లేదు. విమర్శించని నోరు లేదు. ఈ రెండూ జరగని ఊరే లేదు. మనం మన పని చేసుకుంటూ పోతూనే ఉండాలి”అని తమిళంలో చెప్పి.. చివర్లో తెలుగులో ‘అర్థమైందా రాజా’ అని ఎండింగ్ ఇచ్చారు. ఈ డైలాగ్ పాపులర్ అయింది. సందర్భానుసారం ఈ డైలాగును అందరూ వాడేస్తున్నారు. చివరికి తాజాగా చంద్రబాబు సైతం వాడేసారు.

కాకినాడలో తెలుగుదేశం పార్టీ కీలక సమావేశం నిర్వహించారు. టిడిపి జోనల్ పేరిట సమావేశాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సమావేశాలను ఉద్దేశించి చంద్రబాబు ఉత్సాహంగా మాట్లాడారు. జగన్ పనితీరుపై విమర్శలు గుర్తించారు. ఆ సమయంలో కరెంటు కోతలు ప్రస్తావన వచ్చింది. ఈరోజు చెప్తున్నా.. కరెంటు కోతలు లేని చోటు లేదు.. కరెంటు బిల్లులపై ప్రభుత్వాన్ని తిట్టని నోరు లేదు.. ఆ రెండు జరగని ఊరే లేదు.. అర్థమైందా సైకో జగన్ రెడ్డి.. అంటూ చంద్రబాబు చెప్పిన డైలాగ్ తో ప్రాంగణం మార్మోగిపోయింది. ఇప్పుడు చంద్రబాబు కామెంట్స్ ని టిడిపి సోషల్ మీడియా ట్రోల్ చేస్తుంది.

Read Today's Latest Ap politics News, Telugu News LIVE Updates on Oktelugu
oktelugu whatsapp channel
follow us
  • facebook
  • instagram
  • twitter
  • youtube

సంబంధిత వార్తలు