Chandrababu Jail: చంద్రబాబు జైలు, గది చుట్టూ ఫాగింగ్.. ఆయన ఒక్కరే ఖైదీనా మిగతా వారు కాదా?
స్కిల్ డెవలప్మెంట్ స్కాం కేసులో చంద్రబాబు రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఆయన రిమాండ్ మూడు వారాలు సమీపిస్తోంది. మరోవైపు ఆయనకు కోర్టుల్లో చుక్కెదురు అవుతోంది.

Chandrababu Jail: చంద్రబాబు భద్రత, ఆరోగ్యంపై టిడిపి శ్రేణుల్లో ఆందోళన వ్యక్తం అవుతోంది. 73 ఏళ్లలో చంద్రబాబును రోజుల తరబడి రిమాండ్ ఉంచడం శ్రేయస్కరం కాదని టిడిపి నేతలు వాదిస్తున్నారు. జైలులో భద్రతపై కలవరపాటుకు గురవుతున్నారు. ముఖ్యంగా జైలు, చంద్రబాబును నిర్బంధించిన స్నేహ బ్లాక్ పరిసరాల్లో అపరిశుభ్ర వాతావరణం ఉందని.. బ్యారెక్ సమీపంలో చెట్లు ఉండడంతో దోమలు స్వైర విహారం చేస్తున్నాయని కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఈ తరుణంలో జైలు గది చుట్టూ ఫాగింగ్ చేపట్టారు. దోమల నియంత్రణకు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు.
స్కిల్ డెవలప్మెంట్ స్కాం కేసులో చంద్రబాబు రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఆయన రిమాండ్ మూడు వారాలు సమీపిస్తోంది. మరోవైపు ఆయనకు కోర్టుల్లో చుక్కెదురు అవుతోంది. అక్టోబర్ 5 వరకు ఆయన రిమాండ్ ను పొడిగించారు. సుప్రీంకోర్టులో స్పెషల్ సైతం విచారణకు రాలేదు. దీంతో ఆయన మరికొద్ది రోజులపాటు రిమాండ్ ఖైదీగా ఉండనున్నారు. అటు కుటుంబ సభ్యులు సైతం ఆందోళన వ్యక్తం చేయడంతో చంద్రబాబు, భద్రత ఆరోగ్యం పై జైలు అధికారులు ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. చంద్రబాబు ఉంటున్న స్నేహ బ్లాక్ పరిసరాల్లో పారిశుధ్య చర్యలు చేపట్టారు. చంద్రబాబు పుణ్యమా అని పారిశుద్ధ్య చర్యలైన చేపట్టారని తోటి ఖైదీలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
కొద్దిరోజుల కిందట రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీ ఒకరు డెంగ్యూ మృతి చెందారు. ధవలేశ్వరానికి చెందిన గంజేటి వీర వెంకట సత్యనారాయణ అనే 19 ఏళ్ల యువకుడు డెంగ్యూ తో పాటు టైఫాయిడ్ బారిన పడ్డాడు. దీంతో జైలు అధికారులు ఆయనను ఆసుపత్రికి తరలించారు. అక్కడ వారం రోజులు పాటు చికిత్స పొందుతూ ఆయన మృతి చెందాడు. అప్పటినుంచి తెలుగుదేశం పార్టీ శిబిరంలో కలవరం ప్రారంభమైంది. అటు కుటుంబ సభ్యులు సైతం ఆందోళన వ్యక్తం చేయడంతో అధికారులు స్పందించారు. పారిశుద్ధ్య పనులు చేపట్టారు. ప్రస్తుతం జైల్లో 2064 మంది ఖైదీలు ఉన్నారు. ప్రముఖ వ్యక్తిగా చంద్రబాబు రిమాండ్ ఖైదీగా రావడంతో జైల్లో పారిశుధ్యం పై ప్రత్యేకంగా చర్చ నడుస్తోంది. ముప్పేట విమర్శలు ఎదురు కావడంతో సంబంధిత అధికారులు సత్వర చర్యలకు దిగారు.
చంద్రబాబు ఒక్కరే ఖైదీనా? మేము కాదా? అంటూ తోటి ఖైదీలు ప్రశ్నిస్తున్నారు. గత కొద్ది రోజులుగా జైలులో ఖైదీలు అనారోగ్యం బారిన పడుతున్నారు. ప్రతిరోజు 100 నుంచి 150 మంది వరకు ఆసుపత్రిని ఆశ్రయిస్తున్నారు. ఇందులో ఎక్కువగా జ్వర పీడితులే ఉన్నారు. అటు డెంగ్యూ వెలుగు చూడడంతో జైలు అధికారులు అప్రమత్తమయ్యారు. మలేరియా విభాగం సహకారంతో హుటాహుటిన ఫాగింగ్ చేపట్టారు. లార్వా సర్వే తో పాటు ఖైదీల ఆరోగ్యం పైన ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. అటు జ్వరాల తీవ్రత, ఇటు చంద్రబాబు రక్షణకు కోర్టు ప్రత్యేక ఆదేశాలు ఇవ్వడంతో జైలులో యుద్ధ ప్రాతిపదికన పారిశుద్ధ్య పనులు చేపట్టినట్లు జైలు అధికారులు చెబుతున్నారు. కానీ ఇతర ఖైదీలు మాత్రం చంద్రబాబు వస్తే కానీ సౌకర్యాలు కల్పించరా అని ప్రశ్నిస్తున్నారు. చంద్రబాబు ప్రాణానికి రక్షణ ఇస్తారా? మా ప్రాణాలకు విలువ లేదా అంటూ ఖైదీలు ప్రశ్నిస్తుండడం విశేషం.
