Chandrababu Alliance : రేవంత్ రెడ్డికి గొంతుకోస్తున్న చంద్రబాబు.. బీజేపీతో ఎసరు!
ఎన్నికల తర్వాత అవసరమైతే కాంగ్రెస్‌లోని ఒక వర్గాన్ని బీజేపీకి అనుకూలంగా గోడ దూకించేందుకు కూడా సహకరించగలనని చంద్రబాబు హామీ ఇచ్చినట్లు తెలిసింది. అదే జరిగితే తెలంగాణలో పుంజుకుంటున్న రేవంత్‌రెడ్డి గొంతును చంద్రబాబు తడిగుడ్డతో కోసినట్లే.

Chandrababu Alliance : ‘ఏ తీరుగ నను దయజూచెదవో ఐన సంశోత్తమ రామా….. క్రూర కర్మములు నేరకజేసితి నేరములెంచకు రామా…? ఈ భర్త రామదాసు కీర్తన తెలుగు వారందరికీ తెలిసినదే! తెలియక చేసిన నా తప్పుల్ని మన్నించి నా మీద దయ చూపమని శ్రీరామచంద్రుని చరణారవిందాల ఎదుట రామదాసు ప్రార్ధిస్తాడు. సరిగ్గా ఇదే భావాన్ని ప్రధాని నరేంద్రమోదీ ఎదుట ప్రకటించాలని మన చంద్రబాబు ఆరాటపడుతున్నారు. అధికారం కోల్పోయిన దగ్గరి నుంచి మోదీ దర్శన భాగ్యం కోసం, రామదాసు సన్నివేశం కోసం ఆయన చేయని ప్రయత్నం లేదు. అప్పుడొకసారి స్వాతంత్య్ర అమృతోత్సవాల సందర్భంగా జరిగిన సమావేశంలో మోదీకి చంద్రబాబు ఎదురుపడ్డారు. పూజకు వీలు చిక్కలేదు కానీ, హారతి కళ్లకద్దుకునేంత ఘడియ సమయం మాత్రం దొరికింది. అప్పుడాయన ప్రధాని వెళ్లే మార్గం పక్కన తొంభై డిగ్రీల లంబకోణంలో నిలబడి ఉన్నారు. వరుసగా అందర్నీ పలకరించినట్లే సీనియర్ నాయకులైన బాబును కూడా ప్రధాని పలకరించారు. వెంటనే తన మనసులోని మాటను చంద్రబాబు బయటపెట్టారు. ‘మీరు ఏకాంత సమయమిస్తే చాలా విషయాలు మనవి చేసుకుంటానని సిగ్గుపడకుండా అడిగేశారు. సరే చూద్దామంటూ ప్రధాని వెళ్లిపోయారు.
