Vundavalli Aruna Kumar: ఉండవల్లి ఆగయా.. జగన్ కు తోడుగా ఇక బాబును వేటాడడమే..
వాస్తవానికి ఈ కేసులో సిఐడి అనుకున్న స్థాయిలో ఆధారాలు చూపలేకపోయింది. కేవలం అవినీతి జరిగిందని చెబుతోంది. కనీస ఆధారాలు సేకరించలేకపోయిందని సిఐడి పై అపవాదు ఉంది.

Vundavalli Aruna Kumar: ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేసులో కీలక మలుపు. మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అనూహ్యంగా ఎంట్రీ ఇచ్చారు. కేసును సిబిఐతో కానీ..ఈడితో కానీ విచారణ చేయించాలని హైకోర్టులో పిటిషన్ వేశారు.చంద్రబాబు వేసిన క్వాష్ పిటిషన్ పై తీర్పు వెలువడనున్న నేపథ్యంలో ఉండవెల్లి తాజా పిటిషన్ వేయడం చర్చనీయాంశమౌతోంది. ఇప్పుడు ఆయన ఎందుకు జోక్యం చేసుకున్నారో కానీ.. తెర వెనుక చాలా జరుగుతోందని అటు వైసిపి.. ఇటు టిడిపిలో అనుమానాలు పెరుగుతున్నాయి.
వాస్తవానికి ఈ కేసులో సిఐడి అనుకున్న స్థాయిలో ఆధారాలు చూపలేకపోయింది. కేవలం అవినీతి జరిగిందని చెబుతోంది. కనీస ఆధారాలు సేకరించలేకపోయిందని సిఐడి పై అపవాదు ఉంది. ఈ కేసు నిలబడదు కూడా అని కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఆధారాలు ఉన్నాయని చెప్పి రాత్రికి రాత్రి అరెస్టు చేయించడమే కాదు రిమాండ్ కూడా విధించేలా చేశారు. ఇప్పుడు ఆధారాలు చూపించాల్సిన అనివార్య పరిస్థితి సిఐడి కి ఎదురుకానుంది. అటు క్వాష్ పిటిషన్ పై విచారణలో చంద్రబాబుకు సంబంధం ఉందని ఎలాంటి డాక్యుమెంట్లు లేవని నేరుగా ప్రభుత్వ న్యాయవాదే చెప్పుకొచ్చారు. ఆయన కేవలం నిధులు మళ్లించారని తన వాదనలు వినిపించారు కానీ.. దానికి చంద్రబాబు ఎలా బాధ్యుడో చెప్పలేకపోయారు.
స్కిల్ డెవలప్మెంట్ స్కాం కేసులో సిఐడి అతిగా ప్రవర్తించిందని న్యాయ కోవిదులు తేల్చి చెబుతున్నారు. మున్ముందు ఈ కేసులో సిఐడి ఇరకాటంలో పడటం తప్పదని తేల్చి చెబుతున్నారు. ఇప్పుడు అకాస్మాత్తుగా ఉండవల్లి తెరపైకి వచ్చారు. కేంద్ర దర్యాప్తు సంస్థలతో విచారణ చేపట్టాలని పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఈడీ కేసులు పెట్టిందనే సాకుగా చూపి రాష్ట్ర ప్రభుత్వం సిఐడి విచారణకు ఆదేశించింది. ఇప్పుడు ఉండవెల్లి అదే ఈడీ స్మరణ చేస్తుండడం అనుమానాలకు తావిస్తోంది. ఇది ముమ్మాటికి సిఐడిని కాపాడే ప్రయత్నమేనని టిడిపి అనుమానిస్తోంది.
మరోవైపు పాత కేసులు తిరగదోడి మరి చంద్రబాబును ఉక్కిరి బిక్కిరి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. సిఐడి ద్వారా పట్టు బిగిస్తోంది. ఈ తరుణంలో సి.బి.ఐ విచారణ గానీ జరిగితే చంద్రబాబు కేసుల్లో రాష్ట్ర ప్రభుత్వం పట్టు తగ్గే అవకాశం ఉంది. రాష్ట్ర పరిధి నుంచి జాతీయస్థాయిలోకి కేసులు వెళ్లడంతో జగన్ సర్కార్ ఏం చేయలేని స్థితిలోకి వెళ్తుంది. అందుకే ఉండవల్లి అరుణ్ కుమార్ వ్యూహాత్మకంగా ఈ కేసులను సిఐడి కి అప్పగించాలని కోర్టును ఆశ్రయించినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చంద్రబాబుపై మోపుతున్న కేసులు నచ్చకే… ఉండవల్లి అరుణ్ కుమార్ ఈ నిర్ణయానికి వచ్చి ఉంటారన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి.
