Chandrababu – Pawankalyan : చంద్రబాబు మారరా.. పవన్ విషయంలో అదేం దుర్బుద్ధి
ఇప్పుడున్న పరిస్థితుల్లో చంద్రబాబుకు పవన్ కీలకం. ఆయన లేనిదే ముందడుగు వేయలేని పరిస్థితి. దూరమైన వర్గాలను పవన్ దగ్గర చేస్తారని చంద్రబాబు భావిస్తున్నారు. ముఖ్యంగా కాపు సామాజికవర్గాన్ని తన వెంట తీసుకొస్తారని నమ్ముతున్నారు. అటు యూత్ ఓటు బ్యాంకు సైతం మల్లుతుందని కాంక్షిస్తున్నారు. ఈ కారణం చేతనే పవన్ తో స్నేహానికి, సంధికి చంద్రబాబు ఆది నుంచి ప్రయత్నిస్తూ వచ్చారు. కానీ తన మనసులో ఉన్న దుర్బుద్ధిని ఎప్పటికప్పుడు బయటపెట్టుకుంటున్నారు.

Chandrababu – Pawankalyan : రాజకీయ అవసరాలు తీర్చుకోవడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య. గట్టెక్కిన తరువాత తెప్పను తగలేసిన టైపు చంద్రబాబుది. తెలుగు రాష్ట్రాల్లో అన్ని పార్టీలు దాదాపు బాబు బాధిత పక్షాలే. ఎవర్నీ వదల్లేదు. అసాంతం నాకిపడేశారు. కాకలుతీరిన యోధులైన నాయకుల రాజకీయ జీవితాలనే ఫుల్ స్టాప్ పెట్టిన చరిత్ర చంద్రబాబుది. అయితే కాలం ఒకేలా ఉండదు. అందుకే ఇప్పుడు రాజకీయంగా అట్టడుగున ఉన్నారు. పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తులు చేయి ఇస్తే కానీ పైకిలేవలేని స్థితికి చేరుకున్నారు. అయితే ఇంత జరుగుతున్నా తన బుద్ధి మార్చుకోవడం లేదు.
వారాహి యాత్రలో పవన్ వ్యాఖ్యలపై చంద్రబాబు ఎందుకు స్పందించడం లేదు? సెడన్ గా జనసేనాని అలా మాట్లాడేసరికి మైండ్ బ్లాక్ అయ్యిందా? బాబు అయోమయానికి గురయ్యారా? ఇప్పుడు పొలిటికల్ సర్కిల్ లో ఇదే చర్చ నడుస్తోంది. గత కొద్దిరోజులుగా ప్రభుత్వ వైఫల్యాలపై పవన్ గట్టిగానే మాట్లాడుతున్నారు. ముఖ్యంగా వలంటీరు వ్యవస్థపై విరోచిత పోరాటం చేస్తున్నారు. అదే స్థాయిలో ముప్పేట దాడిని ఎదుర్కొంటున్నారు.ఈ సమయంలో సాటి విపక్షంగా, కలిసి నడవాలనుకున్న పార్టీగా ఉన్న టీడీపీ ఎందుకు స్పందించడం లేదన్నదే ఇప్పుడు ప్రశ్న.
గత కొద్దిరోజులుగా వలంటీర్ల ఎపిసోడ్ నడుస్తోంది. కానీ ఏనాడూ చంద్రబాబు స్పందించిన దాఖలాలు లేవు. పవన్ పై జగన్ సర్కారు ముప్పేట దాడి చేస్తున్నా చంద్రబాబు మౌనంగా చూస్తూ ఉన్నారే తప్ప ఏ మాట ఆడలేదు. చలి మంట కాగుతున్నట్టు అలానే ఉండిపోయారు. వారాహి యాత్ర చివరి రోజు మాత్రం స్పందించారు. వలంటీరు వ్యవస్థపై వ్యాఖ్యలు చేశారు. అయితే ఇది పవన్ పై ప్రేమతో చేసిన వ్యాఖ్యలు కాదు. అదే జరిగితే తొలిరోజే స్పందించాల్సి ఉండేది. సరిగ్గా పవన్ వారాహి రెండో విడత యాత్ర ముగిసిన రోజే కావడంతో ఏదో దుర్బుద్ధి ఉంది. మీడియా మేనేజ్ కోసం తప్ప మరొకటి కాదని విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు.
నారా లోకేష్ యువగళం పాదయాత్ర రెండు వేల కిలోమీటర్ల మైలురాయి దాటింది. యాత్ర షెడ్యూల్ లో దాదాపు 50 శాతం పూర్తయ్యింది. అయినా పెద్దగా వర్కవుట్ కాలేదు. సక్సెస్ ఫుల్ గా రన్ కావడం లేదు. పవన్ వారాహి యాత్ర మొదలుపెట్టిన నాటి నుంచి చప్పబడింది. ఉనికి కూడా కోల్పోయింది. పవన్ ఇలా అడుగుపెట్టారో లేదో కెమెరాలన్నీ ఆయన వైపే తిరిగిపోయాయి. చివరకు ఎల్లో మీడియా సైతం ప్రయారిటీ ఇవ్వాల్సిన అనివార్య పరిస్థితి ఎదురైంది. అందుకే చంద్రబాబు పవన్ యాత్ర ముగియడంతో మీడియా కోసమే వలంటీర్ల వ్యవస్థపై స్పందించారు.
ఇప్పుడున్న పరిస్థితుల్లో చంద్రబాబుకు పవన్ కీలకం. ఆయన లేనిదే ముందడుగు వేయలేని పరిస్థితి. దూరమైన వర్గాలను పవన్ దగ్గర చేస్తారని చంద్రబాబు భావిస్తున్నారు. ముఖ్యంగా కాపు సామాజికవర్గాన్ని తన వెంట తీసుకొస్తారని నమ్ముతున్నారు. అటు యూత్ ఓటు బ్యాంకు సైతం మల్లుతుందని కాంక్షిస్తున్నారు. ఈ కారణం చేతనే పవన్ తో స్నేహానికి, సంధికి చంద్రబాబు ఆది నుంచి ప్రయత్నిస్తూ వచ్చారు. కానీ తన మనసులో ఉన్న దుర్బుద్ధిని ఎప్పటికప్పుడు బయటపెట్టుకుంటున్నారు.
