Chandrababu Arrest: చంద్రబాబు అరెస్ట్‌: ఆ టీడీపీ నేత కన్పించడం లేదు

దెందులూరులో టీడీపీకి కర్త, కర్త, క్రియగా చింతమనేని ప్రభాకర్‌ ఉన్నారు. వివాదాస్పద రాజకీయ నాయకుడిగా పేరొందిన ఈయనపై పలు కేసులున్నాయి. 2014 ఎన్నికల్లో టీడీపీ టికెట్‌ పై గెలిచిన ఈయన పలు వివాదాల్లో తల దూర్చారు.

  • Written By:
  • Publish Date - September 24, 2023 / 05:51 PM IST

Chandrababu Arrest: స్కిల్‌ డెవలలప్‌మెంట్‌ కేసులో ఏపీ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత అరెస్ట్‌ అయ్యారు. రాజమండ్రి సెంట్రల్‌ జైలులో శిక్ష అనుభవిస్తున్నారు. చంద్రబాబు అరెస్ట్‌ను నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ శ్రేణులు నిరసనలు నిర్వహిస్తున్నారు. వివిధ రూపాల్లో ఏపీ ప్రభుత్వ తీరును ఎండగడుతున్నాయి. వచ్చేది ఎన్నికల ఏడాది కావడంతో చాలా మంది టీడీపీ ఔత్సాహికులు వినూత్న రీతిలో నిరసనలు చేస్తున్నారు. రాష్ట్రం అంతా ఒక తీరుగా ఉంటే దెందులూరులో మరో రకంగా ఉంది.

దెందులూరులో టీడీపీకి కర్త, కర్త, క్రియగా చింతమనేని ప్రభాకర్‌ ఉన్నారు. వివాదాస్పద రాజకీయ నాయకుడిగా పేరొందిన ఈయనపై పలు కేసులున్నాయి. 2014 ఎన్నికల్లో టీడీపీ టికెట్‌ పై గెలిచిన ఈయన పలు వివాదాల్లో తల దూర్చారు. ఇసుకకు సంబంధించి ఓ వ్యవహారంతో ఓ మహిళా తహసీల్దార్‌ను దుర్భాషలాడారనే ఆరోపణలున్నాయి. అప్పట్లో ఇది రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. అంతే కాకుండా పలు సివిల్‌ కేసుల్లోనూ ప్రభాకర్‌ తల దూర్చారనే విమర్శలున్నాయి. అప్పట్లో ఈ వ్యవహారాలపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడికి టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు. ఈలోగా ఎన్నికలు రావడంతో ప్రభాకర్‌ కే మళ్లీ చంద్రబాబు టికెట్‌ ఇచ్చారు.

2019లో జరిగిన ఎన్నికల్లో ప్రభాకర్‌ వైసీపీ అఽభ్యర్థి చేతిలో ఓడిపోయారు. దీంతో పాత కేసులు వదలా బొమ్మాళీ అన్నట్టుగా ప్రభాకర్‌ వెంట పడ్డాయి. వైసీపీ కూడా పోలీసులకు స్వేచ్ఛ ఇవ్వడంతో ప్రభాకర్‌కు ఊపిరి తీసుకోవడం కూడా కష్టమైపోయిం దనే ఆరోపణలు విన్పించాయి. ఆ తర్వాత కొన్ని కేసుల విషయంలో జైలుకు ప్రభాకర్‌ వెళ్లి వచ్చారు. వైసీపీ ఒత్తిడి తేవడంతో ప్రభాకర్‌ దూకుడు తగ్గించారు. ఇటీవల తన నియోజకవర్గంలోని ఓ ప్రాంతంలో టీడీపీ, వైసీపీ శ్రేణుల మధ్య గొడవ జరిగింది. ఈ గొడవలో ప్రభాకర్‌ కలుగ జేసుకున్నారని వైసీపీ శ్రేణులు అంటు న్నాయి. దీంతో పోలీసులు ప్రభాకర్‌పై కేసులు నమోదు చేశారు. ఇదే తరుణంలో చంద్రబాబు అరెస్ట్‌ కావడం, రాజమండ్రి జైలుకు వెళ్లడంతో ప్రభాకర్‌ నియోజకవర్గం నుంచి ఎక్కడికో వెళ్లిపోయారు. తన శ్రేణులకు కూడా అందుబాటులో లేకుండా పోయారు. ప్రస్తు తం రాష్ట్రమంతా చంద్రబాబు అరెస్ట్‌కు వ్యతిరేకంగా నిరసనలు జరుగుతున్నాయి. ప్రభాకర్‌ పత్తా లేకుండా పోవడంతో దెందులూరులో టీడీపీ నిరసనలకు నాయకత్వం వహించే లేకుండా పోవడంతో దిగువ శ్రేణి నాయకత్వం ఆందోళనకు గురవుతోందనే విమర్శలున్నాయి. ప్రభాకర్‌ ఎప్పుడు వస్తాడో, పార్టీని ఎప్పుడు గాడిలో పెడతాడో అని పార్టీ శ్రేణులు ఎదురు చూస్తున్నారు.