Jagan Vs Chandrababu: ఆ కేసుల విషయంలో చంద్రబాబు, జగన్ లది తప్పే
స్కిల్ స్కాం కేసులో చంద్రబాబు అరెస్టు కావడానికి ముఖ్య ఉద్దేశం.. అప్పట్లో ఈ కేసును నీరుగార్చడమే. సాధారణంగా ఏవైనా నిర్మాణ బాధ్యతలు అప్పగించాలంటే టెండర్ ప్రక్రియ నిర్వహించి కట్టబెట్టాల్సి ఉంటుంది.

Jagan Vs Chandrababu: అధికారంలో ఉంటే ఏ లోపాలు కనిపించవు. మనల్ని ఎవరు ఏం చేస్తారు లే అన్న ధీమాతో గడిపేస్తుంటారు. తరువాత వచ్చేది తామే కదా అని భ్రమ పడుతుంటారు. ఒక్కోసారి ఈ భ్రమలే వికటించి ఇబ్బందులు తెచ్చి పెడుతుంటాయి.ఏపీలో చంద్రబాబు, జగన్ లు ఇలా భావించే ఏరి కోరి కష్టాలను తెచ్చుకున్నారు. బిజెపి అగ్ర నేతలకు సరెండర్ కావాల్సిన పరిస్థితిని తెచ్చి పెట్టుకున్నారు.
స్కిల్ స్కాం కేసులో చంద్రబాబు అరెస్టు కావడానికి ముఖ్య ఉద్దేశం.. అప్పట్లో ఈ కేసును నీరుగార్చడమే. సాధారణంగా ఏవైనా నిర్మాణ బాధ్యతలు అప్పగించాలంటే టెండర్ ప్రక్రియ నిర్వహించి కట్టబెట్టాల్సి ఉంటుంది. కానీ స్కిల్ డెవలప్మెంట్ విషయంలో సి మెన్స్ కంపెనీకి అప్పగించడమే ప్రధాన లోపం. అక్కడెక్కడో ఉత్తరాది రాష్ట్రాల్లో సి మెన్స్ కంపెనీ బోగస్ కంపెనీగా ఈడి గుర్తించింది. దానికోసం లోతైన అధ్యయనం చేయగా ఏపీలో దాని మూలాలు బయటపడ్డాయి. ఆ సమయంలో అధికారంలో ఉన్న చంద్రబాబు కేసును చాలా లైట్ తీసుకున్నారు. అప్పట్లోనే సి మెన్స్ కంపెనీ ప్రతినిధులు, అధికారులపై చర్యలు తీసుకుంటే కేసు ఈ స్థాయికి వచ్చి ఉండేది కాదు.
నాడు చంద్రబాబు చర్యలు తీసుకోకపోవడానికి ముడుపులు అందడమే ప్రధాన కారణమని సిఐడి చెబుతోంది. ఆ అంశాన్ని పరిగణలోకి తీసుకునే కేసులో పట్టు బిగిస్తూ వచ్చింది. ఎటువంటి ఆధారాలు లేకపోయినా.. ఈ కేసును నీరుగార్చారని.. కంపెనీకి పనులు అప్పగించి క్విడ్ ప్రో కు పాల్పడ్డారని.. ఏకంగా తెలుగుదేశం పార్టీ ఖాతాల్లోకి డబ్బు వచ్చి చేరిందని.. ఇలా రకరకాల కారణాలు చూపుతూ చంద్రబాబు కేసు విషయంలో సిఐడి పట్టు బిగించింది. అప్పట్లో చంద్రబాబు నామమాత్రపు విచారణ చేపట్టి చేతులు దులుపుకొని ఉంటే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదని కామెంట్స్ వినిపిస్తున్నాయి.
సీఎం జగన్ విషయంలో కూడా ఇటువంటి పొరపాటే జరిగింది. బాబాయ్ వివేకానంద రెడ్డి హత్య కేసులో తానే స్వయంగా విచారణ చేపట్టి.. ఇందులో నిందితులైన కొందరిపై చర్యలు తీసుకుని ఉంటే.. సిబిఐ విచారణ వచ్చి ఉండే అవకాశమే ఉండేది కాదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కేసును జాప్యం చేయడం వల్లే వివేకా కుమార్తె సునీత సిబిఐ దర్యాప్తును కోరారని.. సీఎం జగన్ ముందే మేల్కొని కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న వారిని అరెస్టు చేసి ఉంటే ఆదిలోనే దీనికి ఒక పరిష్కార మార్గం దొరికి ఉండేదని.. కానీ ఇప్పుడు సిబిఐ కి ఆ కేసు వెళ్లడంతో.. కేంద్ర పెద్దలకు సంప్రదించాల్సిన అనివార్య పరిస్థితి ఎదురైందని.. ఇందులో జగన్ తప్పు ఉందన్న అభిప్రాయం వినిపిస్తోంది. అయితే ఇవన్నీ అధికారం మాటున జరిగిన లోపాలే. నిత్యం తాము అధికారంలో ఉంటాం కదా? ఎవరు ఏం చేస్తారు లేనన్న ధీమా ఇటువంటి పరిస్థితిని తెచ్చి పెడుతుంది.
