Chanakya Niti Problems: చాణక్య నీతి: సమస్యల నుంచి బయట పడాలంటే ఏం చేయాలి
సమస్య ఏర్పడినప్పుడు బాధ పడిపోకుండా దాని నుంచి ఎలా గట్టెక్కాలో ఆలోచించాలి. దానికి మూల కారణాన్ని విశ్లేషించి పరిష్కరించుకునే ప్రయత్నం చేయాలి. అప్పుడే మనకు ఎలాంటి బాధలు లేకుండా పోతాయి.

Chanakya Niti Problems: ఆచార్య చాణక్యుడు మన జీవితంలో ఎదురయ్యే సమస్యలకు పరిష్కారాలు సూచించాడు. జీవితం ఎవరికి కూడా వడ్డించిన విస్తరి కాదు. ఎన్నో ఆటుపోట్లు వస్తాయి. కష్ట సుఖాలు ఉంటాయి. కష్టమొచ్చినప్పుడు పొంగిపోతూ సుఖమొచ్చినప్పుడు సంతోష పడటం కాదు. ఎప్పుడు ఒకే తీరుగా ఉండాలి. పర్వతం గాలివానకు అలాగే ఉంటుంది. ఎంత ఎండ వచ్చినా తొణకదు. మనం కూడా జీవితంలో ఎన్ని బాధలొచ్చినా అలాగే నిలబడాలి. అదే నీతి. చాణక్యుడు జీవితంలో ఎదురయ్యే ఒడిదుడుకులను తనదైన శైలిలో వివరించాడు. అతడి ప్రకారం మనం జీవితంలో ఎలా ఉండాలో చెప్పాడు.
ప్రధాన కారణం
సమస్య ఏర్పడినప్పుడు బాధ పడిపోకుండా దాని నుంచి ఎలా గట్టెక్కాలో ఆలోచించాలి. దానికి మూల కారణాన్ని విశ్లేషించి పరిష్కరించుకునే ప్రయత్నం చేయాలి. అప్పుడే మనకు ఎలాంటి బాధలు లేకుండా పోతాయి. ఇలా జీవితంలో ఎదురయ్యే సవాళ్లను యుక్తితో పరిష్కరించుకోవాలి. సమస్య వస్తే దాన్ని చూసి కుంగిపోతే అంతే సంగతి. అదే మనల్ని భయపెడుతుంది. చీకటిని చూసి జడుసుకుంటే చెట్టే చుట్టూరా అరణ్యమై భయపెడుతుంది. గుండెంటూ కలిగి ఉంటే అదే సైన్యమై నీ వెంట నిలుస్తుంది.
ఎవరికి చెప్పకుండా..
మనం చేసే పనిని ఎవరితో చెప్పకుండా చేయాలి. మన వ్యూహాలు, ప్రణాళికలు పక్కాగా ఉండాలి. అప్పుడే పనిలో విజయం సాధిస్తాం. అంతేకాని ముందే మన రహస్యాలు బట్టబయలు చేస్తే పని విజయవంతం కాకపోతే మీరు సంజాయిషీ ఇచ్చుకోవాల్సి ఉంటుంది. అందుకే పని పూర్తయ్యాకే చెప్పాలి. ముందే చెబితే ఫెయిల్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇలా చేస్తేనే విజయం మన వెంట నిలుస్తుంది. మనం చేసే ప్రయత్నాలు ఎవరికి తెలియవు.
నిష్ణాతుల మార్గదర్శకత్వం
ఏదైనా పని చేసేటప్పుడు నిపుణులైన వారి సలహాలు, సూచనలు స్వీకరించడం మంచిదే. అలాగైతేనే మన పని ముందుకు వెళ్తుంది. ఎందుకంటే మనకు అనుభవం లేకపోవడంతో వారు చెప్పిన దాని ప్రకారం నడుచుకుంటే మనకు ఏ రకమైన ఇబ్బందులు రావు. పని కూడా సాఫీగా సాగేందుకు అవకాశం ఉంటుంది. మనం చేసే పనిలో అనుభవం ఉన్న వారి సలహాలు తీసుకుని ముందుకెళితే మనకు విజయం ఖాయం. దీనికి అందరు కట్టుబడి ఉంటేనే సక్సెస్ మీ సొంతం అవుతుంది.
ఓటమిని అంగీకరించండి
మనం చేసే పనిలో ఓటమి ఎదురైనప్పుడు నిర్మొహమాటంగా అంగీకరించండి. మనం తప్పులు ఎక్కడ చేశామో ఆలోచించుకోవాలి. ఏ తప్పు చేయకపోతే పని విజయం సాధిస్తుందనే వ్యూహంలో మన ఆలోచనలకు పదును పెట్టాలి. ఓటమి విజయానికి నాంది అని తెలుసుకోవాలి. అంతే కాని ఓటమికి కుంగిపోతే జీవితంలో రాణించలేవు. విజయాలు అందుకోలేవు. పడ్డవాడు చెడ్డవాడు కాదు. పడి లేచేవాడే గొప్పవాడు అవుతాడని చాణక్యుడు తన నీతిశాస్త్రంలో వివరించాడు.
