Chanakya Niti Success: చాణక్య నీతి: ఈ ఐదు సూత్రాలు పాటిస్తే విజయం మన సొంతమే
మన ప్రణాళిక ఎవరికి చెప్పకూడదు. ఇతరుల ముందు చెబితే దాన్ని ప్రచారం చేస్తారు. దీంతో మన రహస్యం బయట పడుతుంది. ఇలా జరగకుండా ఉండాలంటే మనం జాగ్రత్తగా ఉండాలి. చాణక్యుడి ప్రకారం మన సిద్ధాంతాలు, ప్రణాళికలు ఎవరితోనూ షేర్ చేసుకోకూడదు. ఇతరులకు చెబితే హాని జరుగుతుంది. మన ఉద్దేశాలు పంచుకోవడం మంచిది కాదు.

Chanakya Niti Success: ఆచార్య చాణక్యుడు మన జీవితంలో విజయం సాధించడానికి ఎన్నో మార్గాలు సూచించాడు. మనం మంచి ఉన్నతి సాధించాలంటే కొన్నింటిని వదులుకోవాలి. కొన్నింటిని అలవరచుకోవాలి. మంచి వాటిని వెంటే ఉంచుకోవాలి. చెడును తొలగించుకోవాలి. ఇలా మన జీవితంలో మనం అనుసరించే మార్గాల గురించి చాణక్యుడు వివరంగా చెప్పాడు. ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం ముందుకు వెళ్లాలంటే కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకోవడం తప్పనిసరి.
తీయగా మాట్లాడే వారితో..
మనతో తియ్యగా మాట్లాడే వారితో జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే కడుపులో కత్తులు నోట్లో బెల్లాలు అంటారు. కడుపులో విషం పెట్టుకుని పైకి తియ్యగా మాట్లాడే వారు చాలా మంది ఉంటారు. అలాంటి వారితో జాగ్రత్తగా ఉండాలి. మన రహస్యాలు వారికి చెప్పకూడదు. ఒకవేళ చెబితే అంతే సంగతి. మన రహస్యాలు బట్టబయలు కావడం జరుగుతుంది. ఇలా మనం జీవితంలో ముందుకు వెళ్లాలంటే ఇలాంటి వారితో జాగ్రత్తగా ఉండటం శ్రేయస్కరం.
నమ్మలేని వారిని..
జీవితంలో మనం నమ్మకుండా ఒకసారి పక్కన పెట్టిన వారిని విశ్వసించకపోవడమే మంచిది. అలాంటి వారితో కూడా మనం జాగ్రత్తగా ఉండకపోతే ఇబ్బందులు తలెత్తుతాయి. మన రహస్యాలను అతడితో చెబితే అందరి సమక్షంలోనే వాటిని బహిర్గతం చేస్తాడు. దీంతో విశ్వాసపాత్రుడు కాని వారితో స్నేహం చేయడం అంత మంచిది కాదు. మన విషయాలు అతడితో పంచుకోకూడదు.
మన ప్రణాళిక
మన ప్రణాళిక ఎవరికి చెప్పకూడదు. ఇతరుల ముందు చెబితే దాన్ని ప్రచారం చేస్తారు. దీంతో మన రహస్యం బయట పడుతుంది. ఇలా జరగకుండా ఉండాలంటే మనం జాగ్రత్తగా ఉండాలి. చాణక్యుడి ప్రకారం మన సిద్ధాంతాలు, ప్రణాళికలు ఎవరితోనూ షేర్ చేసుకోకూడదు. ఇతరులకు చెబితే హాని జరుగుతుంది. మన ఉద్దేశాలు పంచుకోవడం మంచిది కాదు.
ఆచితూచి వ్యవహరించాలి
మనం చేసే పనుల విషయంలో ఎప్పుడు కూడా మూర్ఖంగా ఆలోచించకూడదు. మన మూర్ఖత్వం మన విజయానికి అడ్డుగా నిలవకూడదు. మంచి ఆలోచనలు మంచి చేస్తాయి. చెడు ఆలోచనలు చెడును పెంచుతాయి. ఈ నేపథ్యంలో విజయం సాధించాలనుకునే వారు మంచి ఉద్దేశాలతో ఉండటమే శ్రేయస్కరం. చాణక్యుడి ప్రకారం మనిషిలో మూర్ఖత్వమే పెద్ద లోపంగా గుర్తించాలి.
చేసే పనిలోనే దైవత్వం
చాణక్యుడి ప్రకారం మనం చేసే పనిలోనే దైవత్వం చూసుకోవాలి. పనిలోనే మన శక్తిని పెట్టాలి. దీంతో మనం విజయం సాధిండం తథ్యం. ఇలా చేయడం వల్ల మనకు విజయం సిద్ధించడం ఖాయం. ఈ నేపథ్యంలో మన చూపు విజయం మీదే ఉంచుకోవాలి.
