Chanakya Niti Husband Wife: భార్యాభర్తల విషయాల్లో మూడో వ్యక్తి జోక్యం చేసుకోవాలా? వద్దా?
పూర్వం రోజుల్లో చిన్న వయసులోనే పెళ్లిళ్లు చేసే వారు. వారికి సరైన బుద్ధి రాకముందే వివాహం చేసి అత్తారింటికి పంపేవారు. అప్పుడు తండ్రి తన కూతురుకు మంచి మాటలు చెప్పేవాడు. బిడ్డ ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ విషయంలో ఇతరుల జోక్యం ఉండకూడదు. నీవు భర్తకు అనుకూలంగా మసలుకో. ఏదైనా తప్పు చేస్తే అది తప్పని నిక్కచ్చిగా చెప్పి మార్చుకో. కానీ కుటుంబ విషయం మాత్రం బయటకు చెప్పుకోవద్దని మంచిగా చెప్పేవాడు.

Chanakya Niti Husband Wife: ఆలుమగల అనుబంధం చాలా పవిత్రమైనది. వారి మధ్య వచ్చే తగాదాలు సముద్రంలో వచ్చే ఆటుపోట్లు. పొద్దున్నే వచ్చి సాయంత్రం వెళ్లిపోతాయి. దంపతుల మధ్య ఎప్పుడు కూడా మూడో వ్యక్తి జోక్యం అవసరం ఉండొద్దు. ఒకవేళ అలాంటి పరిస్తితి వస్తే అంతకంటే దౌర్భాగ్యం మరొకటి ఉండదు. భార్యాభర్తలకు వారే న్యాయ నిర్ణేతలు. వారే ముద్దాయిలు. ఏదైనా జరిగితే తమలో తామే సర్దుకుపోవాలి.
పురాతన సంప్రదాయం
పూర్వం రోజుల్లో చిన్న వయసులోనే పెళ్లిళ్లు చేసే వారు. వారికి సరైన బుద్ధి రాకముందే వివాహం చేసి అత్తారింటికి పంపేవారు. అప్పుడు తండ్రి తన కూతురుకు మంచి మాటలు చెప్పేవాడు. బిడ్డ ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ విషయంలో ఇతరుల జోక్యం ఉండకూడదు. నీవు భర్తకు అనుకూలంగా మసలుకో. ఏదైనా తప్పు చేస్తే అది తప్పని నిక్కచ్చిగా చెప్పి మార్చుకో. కానీ కుటుంబ విషయం మాత్రం బయటకు చెప్పుకోవద్దని మంచిగా చెప్పేవాడు.
సనాతన సంప్రదాయం
గతంలో ఉన్న సంప్రదాయాయం స్థానంలో ఇప్పుడు నాగరికత పేరుతో మార్పులు తెస్తున్నారు. అనాగరక పద్ధతులు పాటిస్తూ పచ్చని సంసారంలో నిప్పులు పోసుకుంటున్నారు. అనవసర పట్టింపులకు పోయి కాపురం కకావికలం చేసుకుంటున్నారు. చక్కని సంసారంలో కలతలు లేకుండా చూసుకోవాల్సింది పోయి వారే గొడవలకు కారణంగా నిలుస్తున్నారు.
అనుబంధాలకు కాలం చెల్లు
రానురాను రాజుగారి గుర్రం గాడిదయిందన్నట్లుగా భార్యాభర్తల మధ్య అనుబంధాలు తగ్గుతున్నాయి. పూర్వం రోజుల్లో భర్త ఏం చెబితే భార్య కూడా సరే అనేది. కానీ ఇప్పుడు స్వతంత్ర భావాలు పెరిగిపోయి ఇగోలకు వెళ్తున్నారు. నువ్వెంత అంటే నువ్వెంత అంటూ నిత్యం గొడవలకు దిగుతున్నారు. ఈ సంస్కృతికి చరమగీతం పాడితేనే సంసారాలు సాఫీగా సాగడానికి ఆస్కారం ఏర్పడుతుంది.