Chanakya Niti God: చాణక్య నీతి: భగవంతున్ని ఎలా కొలవాలి?
అందరు భగవంతున్ని కొలుస్తారు. దేవుడు విగ్రహాల్లో ఉండడు. మన భావాలే భగవంతుని రూపంలో ఉంటాయి. అందుకే భగవంతుని స్వరూపం తెలిసిన మీ మనసే దేవాలయంగా పరిగణింపబడుతుందని చాణక్యుడు చెప్పాడు. మంచి పుస్తకం వల్ల జ్ణానం పెరిగినట్లే చెడ్డ పుస్తకాలు చదివితే మనసు చెంచలం అవుతుంది. అందుకే మంచి పుస్తకాలు చదివి మన తెలివితేటలు పెంచుకోవాలని సూచించాడు.

Chanakya Niti God: ఆచార్య చాణక్యుడు మనిషి జీవితం గురించి నైతికత ఆధారంగా ఎన్నో విషయాలు తెలియజేశాడు. జీవితంలో ఎలాంటి పొరపాట్లు చేస్తే ఎలాంటి ఫలితాలు వస్తాయని వివరించాడు. మనిషి చేసే తప్పులను ఎత్తి చూపుతూ ఎలా నడుచుకోవాలో చెబుతాడు. దైనందిన జీవితంలో మనం చేసే తప్పులకు ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయో అని కూడా వివరించాడు. చాణక్య నీతి శాస్ర్తంలో వీటికి సంబంధించిన విషయాలు ఎన్నో రకాలుగా తెలిపాడు.
అందరు భగవంతున్ని కొలుస్తారు. దేవుడు విగ్రహాల్లో ఉండడు. మన భావాలే భగవంతుని రూపంలో ఉంటాయి. అందుకే భగవంతుని స్వరూపం తెలిసిన మీ మనసే దేవాలయంగా పరిగణింపబడుతుందని చాణక్యుడు చెప్పాడు. మంచి పుస్తకం వల్ల జ్ణానం పెరిగినట్లే చెడ్డ పుస్తకాలు చదివితే మనసు చెంచలం అవుతుంది. అందుకే మంచి పుస్తకాలు చదివి మన తెలివితేటలు పెంచుకోవాలని సూచించాడు.
ప్రస్తుతం స్వార్థపూరిత ధోరణి పెరిగిపోతోంది. మనుషులు తమ అవసరాలు తీర్చుకోవడానికి ఎంతకైనా తెగిస్తున్నారు. తమ పనులు చేసుకోవడానికే ఇతరులను వాడుకుంటున్నారు. అవసరం తీరాక వదిలేస్తున్నారు. ఎవరైనా నిస్వార్థంగా స్నేహంచేస్తున్నామంటే ఎవరు నమ్మరు. లోకం అంతలా మారిపోయింది. అందుకే జాగ్రత్తగా ఉండటం అలవాటు చేసుకోవాలని చాణక్యుడు సూచిస్తున్నాడు.
తాము ఏదో కారణజన్ములమనే భావం అందరిలో కలుగుతోంది. కానీ మనిషి పుట్టుకతో గొప్పవాడు కాలేడు. అతడు చేసే పనులను బట్టే అతడి స్థానం సమాజంలో గుర్తింపు పొందుతుంది. అడవికి రాజుగా ఉండే సింహం తన సహజత్వంతోనే గుర్తింపు తెచ్చుకుంటుంది. కానీ తనను గుర్తించాలని సింహం ఎలాంటి ప్రయత్నాలు చేయదు. అలాగే మనిషి కూడా తనలోని గుణాలతోనే అతడికి సమాజంలో స్థానం ఉంటుంది.