Chanakya Niti Ashamed: చాణక్య నీతి: ఎక్కడ సిగ్గుపడకూడదో తెలుసా?
మనలో చాలా మంది తిండి విషయంలో కూడా మొహమాట పడుతుంటారు. ఇది కరెక్టు కాదు. మనకు ఆకలేసినప్పుడు నిర్మొహమాటంగా కావాల్సింది అడిగి మరీ తినాలి. లేకపోతే కడుపు ఎండటం ఖాయం. దీంతో మనకే ఇబ్బంది. బంధువుల ఇంటికి వెళ్లినా నిరభ్యంతరంగా ఆహారం కావాలని అడిగి మరీ తినాలి. అప్పుడే నీ ఆకలి తీరుతుంది. కానీ నువ్వు మొహమాట పడితే కడుపు మాడటం ఖాయం.

Chanakya Niti Ashamed: చాణక్యుడు మనకు ఎన్నో విషయాల్లో ఉన్న అనుమానాలు పటాపంచలు చేశాడు. జీవితంలో ఎదురయ్యే ఇబ్బందులను ఎలా తట్టుకోవాలో సూచించాడు. మనిషి ఎలాంటి పనులు చేయొచ్చు ఎలాంటి వాటికి దూరంగా ఉండాలో కూడా వివరించాడు. దీంతో చాణక్యుడు నీతిశాస్త్రంలో మనిషి మనుగడకు పనికొచ్చే చాలా విషయాలు విశదీకరించాడు. మనిషి తన కర్తవ్యాన్ని విడవకూడదని తెలియజేశాడు. ఎప్పుడు కూడా మొహమాటపడొద్దని చెప్పాడు. మొహమాట పడే వ్యక్తి జీవితంలో పైకి రాడని గ్రహించాలన్నాడు.
భార్య దగ్గర
మనిషి ఎప్పుడు కూడా తన భార్య దగ్గర సిగ్గు పడకూడదు. సంభోగం విషయంలో కూడా తనకేమి కావాలో అడిగి మరీ కోరిక తీర్చుకోవాలి. మొహమాట పడితే పనులు జరగవు. కోరికలు తీరవు. మనకు కలిగిన ఆశ తీరకుండా పోతుంది. ముక్కుసూటిగా వ్యవహరిస్తేనే పనులు సకాలంలో పూర్తవుతాయి. నీ కోరిక నీలోనే ఉంచుకుంటే అది నిన్నే దహిస్తుంది. కానీ నీ మనసు తేలిక కాదు.
తిండి దగ్గర
మనలో చాలా మంది తిండి విషయంలో కూడా మొహమాట పడుతుంటారు. ఇది కరెక్టు కాదు. మనకు ఆకలేసినప్పుడు నిర్మొహమాటంగా కావాల్సింది అడిగి మరీ తినాలి. లేకపోతే కడుపు ఎండటం ఖాయం. దీంతో మనకే ఇబ్బంది. బంధువుల ఇంటికి వెళ్లినా నిరభ్యంతరంగా ఆహారం కావాలని అడిగి మరీ తినాలి. అప్పుడే నీ ఆకలి తీరుతుంది. కానీ నువ్వు మొహమాట పడితే కడుపు మాడటం ఖాయం.
గురువు దగ్గర
చదువు నేర్చుకునే క్రమంలో నీకు వచ్చే అనుమానాలు తెలుసుకోవాలి. లేకపోతే నీకు చదువు రాదు. చదువులో ఏ చిన్న సందేహం వచ్చినా గురువును నిరభ్యంతరంగా అడగాలి. ఆ అనుమానాన్ని తీర్చుకోవాలి. అలాగైతేనే జీవితంలో నువ్వు ముందుకు వెళతావు. లేదంటే అక్కడే ఆగిపోతావు. సిగ్గు పడితే పనులు కావు. సిగ్గు విడిచి అడిగి మరీ తెలుసుకోవడం మనకే మంచిది.
ఇలా చాణక్యుడు జీవితంలో మొహమాట పడితే పనులు జరగవు. మనమే తెగించాలి. మనకు కావాల్సిన వాటిని అడిగి మరీ తీర్చుకోవాలి. లేదంటే అవి తీరని సమస్యలుగా మారతాయి. దీంతో నీ మనసు కూడా తేలికగా ఉండదు. ఆ సందేహాలు తీరలేదని ఆలోచనలో పడిపోతావు. అందుకే ఎప్పుడైనా నిరభ్యంతరంగా అడగడమే శ్రేయస్కరం.