Chanakya Niti Money: చాణక్య నీతి: మనిషి కుబేరుడు కావాలంటే ఏం చేయాలో తెలుసా?
మనతో పాటు ఎదిగే వారి విషయాలను కూడా గమనిస్తూ ఉండాలి. వ్యాపారంలో కొత్త పుంతలు తొక్కుతున్న క్రమంలో ప్రతి విషయం మీద మనకు పట్టు ఉండాలి. అప్పుడే మనం విజయం సాధిస్తాం. అంతేకాని విషయం గురించి తెలియకపోతే ఇబ్బందులు తప్పవు. ప్రతి శాఖ గురించి మనకు అవగాహన ఉంటే అవరోధాలు ఉండవు. సక్సెస్ మన వశం అవుతుంది. డబ్బు సొంతం చేసుకోవచ్చు. ఇలా చాణక్యుడు జీవితంలో చేసే పనుల విషయంలో జాగ్రత్తలు తీసుకుని మనం ఎదిగేందుకు మార్గం సుగమం అవుతుంది.

Chanakya Niti Money: ఆచార్య చాణక్యుడు డబ్బు ఎలా సంపాదించాలో సూచిస్తాడు. డబ్బు సంపాధిస్తేనే ధనవంతులుగా మారుతారు. కుబేరుడిగా మారాలంటే దానికి చాలా శ్రమ కావాలి. నియమ నిబంధనలతో కూడిన పనుల ద్వారానే మనం ధనవంతులుగా మారడం కామనే. ఈ నేపథ్యంలో జీవితంలో ఎదిగేందుకు గల విషయాలను ఎంతో వివరంగా చెప్పాడు. పేదరికంలో పుట్టడం తప్పు కాదు పేదరికలో చావడం తప్పు అంటారు. అందుకే ప్రతి వ్యక్తి జీవితంలో ఎదగాలనే చూస్తాడు. ఇందుకోసం ఏం చేయాలో చెబుతాడు చాణక్యుడు.
విజయం దక్కే వరకు ప్రయత్నం
ప్రతి వ్యక్తి విజయం కోసం శ్రమిస్తూనే ఉంటాడు. ధనవంతుడు కావాలంటే ఏ ఒక్క రోజులో అయ్యేది కాదు. కుబేరులుగా మారాలంటే తొంభై తొమ్మిది సార్లు అపజయం కలిగినా వందో సారి విజయం సాధిస్తాడు. దీనికి ఎవరు అతీతులు కారు. విజయం సాధించే వరకు మన ప్రయత్నం మానకూడదు. ధనవంతుడుగా మారే వరకు ప్రయత్నిస్తూనే ఉండాలి. అప్పుడే మనకు సక్సెస్ దక్కుతుంది.
చుట్టు ఉన్న వారిని సైతం..
మనం ధనవంతులం కావాలంటే మన చుట్టు ఉన్న వారు కూడా కావాలి. దీనికి మన తోటి వారికి సైతం ఉపాధి కల్పించాలి. అప్పుడే మనకు గుర్తింపు ఉంటుంది. మనం వారిలో మంచి స్థానాన్ని పొందుతాం. ఇలా ఉన్న వారే జీవితంలో విజయం సాధిస్తూ ఉంటారు. డబ్బు సంపాదించే సమయంలో మనల్ని నమ్ముకున్న వారిని సైతం ఎదిగేలా చేయడంలోనే మన విజయం దాగి ఉంటుంది.
పరిశీలన